ఉగాది పంచాంగంతో వచ్చిన ‘ఫన్ డే’ ముఖచిత్రం అద్భుతంగా ఉంది. కవుల మదిలో మెదిలే అద్భుత భావనలా చిత్రకారుడు అలవోకగా ప్రకృతి కన్యను చిత్రీకరించారు. చిత్రకారుడికి అభినందనలు.
- పుష్పలత, సోమందేపల్లి, అనంతపురం
ఒక గృిహ ణి అయిన నేను సొంతంగా ఒక పరిశ్రమను ప్రారంభిద్దాం అనుకొంటున్నాను. దీనికి స్ఫూర్తి మీరు ప్రచురిస్తున్న ‘మీరే పారిశ్రామికవేత్త’. ఈ శీర్షిక కింద వస్తున్న కథనాలు ప్రోత్సాహవంతంగా ఉంటున్నాయి.
- రూత్ సునైనా, ఇ మెయిల్
తళుకులీను తారలతో మిలమిల మెరిసే ఆకాశంలా ఉంటుంది ‘ఫన్‌డే’. ఉగాది వంటి ప్రత్యేక సందర్భాల్లో విశేష సమాచారాలకే పరిమితం కావడం మాలాంటి పాఠకులను నిరుత్సాహపరుస్తుంది. ప్రత్యేక సందర్భాల్లో విడుదలయ్యే ఫన్‌డేలో కూడా మిగతా శీర్షికలకు స్థానం కల్పించ ప్రార్థన.
- నేరెళ్ల వెంకటరావు, విజయనగరం
మీ రీడర్‌గా చేరి అప్పుడే ఏడేళ్లు గడిచిపోయాయా! సాక్షిని రూపొందించే చేతులు, అవి పడిన శ్రమ చదువుతుంటే చాలా బాగుంది. అన్నం ముద్దను తినే ముందు కోత కోసిన వాడి నుంచి కంచంలో వడ్డించిన వారి వరకూ అందరినీ ‘సుఖీభవ’ అని తలుచుకున్నట్టుగా ఉంది. ఒక టీచర్‌గా మాకు కావాల్సిన సమాచారం, పిల్లలకు గెడైన్స్ సూపర్. ఇక ఫ్యామిలీ ఎడిటోరియల్స్, వైద్యం, సాహిత్యం, సాగుబడి, ఫన్‌డే ఏదైనా మాకు అర్థమయ్యే శైలిలో ఉంటాయి.
పేపర్ కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ ఒక్కమాట మీద ఉండటం, చైర్‌పర్సన్ వైఎస్ భారతి రెడ్డిగారి కృషి... అవసరమైనప్పుడు తన కష్టాలని దిగమింగి ధైర్యంగా ఆమె ప్రజల ముందుకు వచ్చి నిజాలు చెప్పడం నాకు చాలా నచ్చింది. ఇంకా మీరు వినూత్నంగా ఎప్పటికప్పుడు మా అభిమానాన్ని చూరగొంటారని ఆశిస్తూ.. మీ టీమ్ అందరికీ అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు.
- వి.శశికళ, నాయుడుపేట, నెల్లూరు
మీ అభిప్రాయాలనూ, రచనలనూ స్వాగతిస్తున్నాం. మా చిరునామా: ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34.
ఫోన్: 040-23256000
funday.sakshi@gmail.com
పాఠక స్పందన
Published Sun, Apr 5 2015 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM
Advertisement
Advertisement