ready to eat food
-
విజయ కీర్తి
విజయసోపానాలు అధిరోహించడానికి ఏం చేయాలా?! అని సుదీర్ఘ ఆలోచనలు చేయనక్కర్లేదు అనిపిస్తుంది కీర్తి ప్రియను కలిశాక. తెలంగాణలోని సూర్యాపేట వాసి అయిన కీర్తిప్రియ కోల్‌కతాలోని ఐఐఎమ్ నుంచి ఎంబీయే పూర్తి చేసింది. తల్లి తన కోసం పంపే ఎండు కూరగాయల ముక్కలు రోజువారి వంటను ఎంత సులువు చేస్తాయో చూసింది. తన కళ్లముందు వ్యవసాయ పంట వృథా అవడం చూసి తట్టుకోలేకపోయింది. ఫలితంగా తల్లి తన కోసం చేసిన పని నుంచి తీసుకున్న ఆలోచనతో ఓ ఆహార పరిశ్రమనే నెలకొల్పింది. స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలనూ కల్పిస్తోంది. తన వ్యాపారంలో తల్లి విజయలక్ష్మిని కూడా భాగస్వామిని చేసిన కీర్తి విజయం గురించి ఆమె మాటల్లోనే.. ‘‘ఈ రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్‌కు ముందు చదువు, ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉన్నప్పుడు మా అమ్మ నాకు వంట ఈజీగా అవడం కోసం ఎండబెట్టిన కూరగాయల ముక్కలను ప్యాక్ చేసి, నాకు పంపేది. వాటిలో టొమాటోలు, బెండ, క్యాబేజీ, గోంగూర, బచ్చలికూర, మామిడికాయ... ఇలా రకరకాల ఎండు కూరగాయల ముక్కలు ఉండేవి. వీటితో వంట చేసుకోవడం నాకు చాలా ఈజీ అయ్యేది. ఈ సాధారణ ఆలోచన నాకు తెలియకుండానే నా మనసులో అలాగే ఉండిపోయింది. వృథాను అరికట్టవచ్చు సూర్యాపేటలోని తొండా గ్రామం మాది. ఒకసారి రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక, ఆ పంటను పొలంలోనే వదిలేశారు. ఇది చూసి చాలా బాధేసింది. చదువు తర్వాత సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాలన్న ఆలోచనకు నా బాధ నుంచే ఓ పరిష్కారం కనుక్కోవచ్చు అనిపించింది. అమ్మ తయారు చేసే ఎండు కూరగాయల కాన్సెప్ట్నే నా బిజినెస్‌కు సరైన ఆలోచన అనుకున్నాను. ఆ విధంగా వ్యవసాయదారుల పంట వృథా కాకుండా కాపాడవచ్చు అనిపించింది. ఈ ఆలోచనను ఇంట్లోవాళ్లతో పంచుకున్నాను. అంతే, రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్ సిద్ధమైపోయింది. కుటుంబ మద్దతు మా నాన్న పోలీస్ విభాగంలో వర్క్ చేస్తారు. అమ్మ గృహిణి. ముగ్గురు అమ్మాయిల్లో నేను రెండవదాన్ని. నా ఆలోచనకు ఇంట్లో అందరూ పూర్తి మద్దతు ఇచ్చారు. దీనికి ముందు చేసిన స్టార్టప్స్, టీమ్ వర్క్ .. గురించి అమ్మానాన్నలకు తెలుసు కాబట్టి ప్రోత్సహిస్తూనే ఉంటారు. కాకపోతే అమ్మాయిని కాబట్టి ఊళ్లో కొంచెం వింతగా చూస్తుంటారు. వృద్ధిలోకి తీసుకు వస్తూ.. సాధారణంగా తెలంగాణలో ఎక్కువగా పత్తి పంట వేస్తుంటారు. మా చుట్టుపక్కల రైతులతో మాట్లాడి, క్రాప్ పంటలపై దృష్టి పెట్టేలా చేశాను. రసాయనాలు వాడకుండా కూరగాయల సాగు గురించి చర్చించాను. అలా సేకరించిన కూరగాయలను మెషిన్స్ ద్వారా శుభ్రం చేసి, డీ హైడ్రేట్ చేస్తాం. వీటిలో ఆకుకూరలు, కాకర, బెండ, క్యాబేజీ.. వంటివి ఉన్నాయి. వీటితోపాటు పండ్లను కూడా ఎండబెడతాం. రకరకాల పొడులు తయారు చేస్తాం. మూడేళ్ల క్రితం ఈ తరహా బిజినెస్ ప్లానింగ్ మొదలైంది. మొదట్లో నాలుగు లక్షల ప్రారంభ పెట్టుబడితో ప్రారంభించిన ఈ పరిశ్రమ ఇప్పుడు రెండున్నర కోట్లకు చేరింది. వ్యాపారానికి అనువుగా మెల్లమెల్లగా మెషినరీని పెంచుకుంటూ, వెళుతున్నాం. మార్కెట్‌ను బట్టి యూనిట్ విస్తరణ కూడా ఉంటోంది. రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్‌తో ఈ ఐడియాను అభివృద్ధి చేస్తున్నాం. వీటితో పాటు సూప్ మిక్స్‌లు, జ్యూస్ మిక్స్‌లు, కూరల్లో వేసే పొడులు మా తయారీలో ఉన్నాయి. ఏ పని చేయాలన్నా ముందు దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. దీంతోపాటు తమ మీద తమకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మనకు ఓ ఆలోచన వచ్చినప్పుడు, దానిని అమలులో పెట్టేటప్పుడు చాలామంది కిందకు లాగాలని చూస్తుంటారు. కానీ, మనకు దూరదృష్టి ఉండి, క్లారిటీగా పనులు చేసుకుంటూ వెళితే తిరుగుండదు. మన ఆలోచనని అమలులో పెట్టేటప్పుడు కూడా మార్కెట్‌కు తగినట్టు మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి’’ అని వివరిస్తుంది కీర్తిప్రియ. – నిర్మలారెడ్డి -
మన తిండి మారిపోతోంది!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రజల జీవన విధానం, ఆహార అభిరుచుల్లో భారీగా మార్పులు తెచి్చంది. గతంలో మన ఆలోచనా విధానాన్ని బట్టి అంతగా ఉపయోగించని వాటిని ఇప్పుడు అనివార్యంగా అలవాటు చేసుకోక తప్పడం లేదు. కొత్త జీవనశైలిని, అలవాట్లను ఆహా్వనించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్డౌన్ కారణంగా గతేడాదిలో ఎక్కువ భాగం నిత్యావసర సరుకులు, వర్క్‌ఫ్రంహోం పని విధానానికి అవసరమైన వస్తువులకు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే క్రమంగా కరోనాని ఎదుర్కొనేందుకు పరిశుభ్రతా చర్యలు, జాగ్రత్తల పట్ల ప్రజల్లో అప్రమత్తత పెరిగింది. ‘రెడీ టు ఈట్’డిమాండ్ 200 శాతం.. పెద్దగా శ్రమ పడకుండానే తాము కోరుకున్న ఆహారపదార్థాలు తయారు చేసుకునేందుకు ఉద్దేశించిన ‘రెడీ టు ఈట్ మీల్స్’కు డిమాండ్ దాదాపు 200 శాతం పెరిగింది. ఇవేకాకుండా రోజువారి ఉపయోగించే వివిధ నిత్యావసర వస్తువులు, కాస్త ఆకలి అనిపించగానే లేదా ఏదైనా లైట్‌గా తినేందుకు వీలుగా వివిధ రకాల స్నాక్స్ ఐటెమ్స్‌కు డిమాండ్ పెరిగింది. బేకింగ్, ఇంట్లోనే పిజ్జా తయారీ, ఇతర చిరుతిండికి కావాల్సిన వస్తువుల అమ్మకాలు ఎన్నో రెట్లు పెరిగాయి. పౌష్టికాహారంపై కూడా ప్రజల్లో ధ్యాస పెరిగింది. రోగనిరోధకశక్తి పెంచుకోవడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. రుచి, పోషకాలు.. రెండింటిపై దృష్టి.. బ్రాండెడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ సేఫ్ అనే అభిప్రాయంతో ప్రజలున్నారు. మనరాష్ట్రంలో రెడీ టు కుక్ సెగ్మెంట్ అనేది బాగా పెరుగుతోంది. సులభంగా తయారు చేసుకోవడంతో పాటు అనేక రకాల రుచులు అందుబాటులోకి వచ్చాయి. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో ఇళ్లలోనే ఇష్టమైన ఆహారం తయారు చేసుకునే అవకాశంతో పాటు శుభ్రత, రక్షణకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. మెంతికూర చపాతీ, రాగి చపాతీ, మునగాకు చపాతీ (మొరింగా), హోల్ వీట్ పూరీ, మసాలా పరోటా వంటి వాటిపై మేము ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము. ఫైబర్ రిచ్, ఆయిల్ తక్కువ పీల్చే ప్రొడక్ట్‌లకు డిమాండ్ ఉంది. భౌతిక దూరం పాటించడంకోసం ఆన్లైన్ ఆర్డర్లపై వినియోగదారులు ఆధారపడుతున్నారు. ఆన్లైన్ సెగ్మెంట్‌తో పాటు రెడీ టు కుక్ ప్రొడక్ట్స్‌కు డిమాండ్ పెరిగింది. – ప్రతిమ విశ్వనాథ్, ఎండీ, మంగమ్మ ఫుడ్స్ నాన్ వెజ్ ఫుడ్‌కు భారీ డిమాండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్‌కు ప్రస్తుతం డిమాండ్ పెరిగింది. బిర్యానీ, పలావ్, చికెన్ కర్రీ ఇతర వేరియెంట్లను జనం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మా ప్రొడక్ట్ లైనప్‌లో బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా దాల్ కిచిడీ, పొంగల్, రవ్వ ఉప్మా వంటివి ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. దీంతో పాటు హైదరాబాద్‌లో ‘రెడీ టు ఈట్’ఫుడ్ ఐటెమ్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. కేవలం వేడి నీటిలో ఉడకపెడితే ఫుడ్ రెడీ అయిపోయేలా మేము తయారు చేసిన రెడీ టు ఈట్ ఆహార ఉత్పత్తులపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా తర్వాత మేం మార్కెట్లోకి వచ్చినప్పటికీ మా అమ్మకాల పెరుగుదల, డిమాండ్‌ను బట్టి రెడీ టూ ఈట్ కేటగిరీ ప్రొడక్ట్స్‌ను మనవాళ్లు ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది. మార్కెట్లో రిటైలర్లు, బిజినెస్మెన్ల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ కూడా ఇదే. శుభ్రత, రుచి, నాణ్యతా ప్రమాణాలు ఇప్పుడు కీలకంగా మారాయి. బయటి ఫుడ్ ఆరోగ్యానికి మంచికాదన్న భయాల నుంచి మంచి రెడీ టు ఈట్ ఫుడ్ బ్రాండ్స్‌పై మొగ్గుచూపుతున్నారు. – రాజు వానపాల, ఫౌండర్ అండ్ సీఈవో, ద టేస్ట్ కంపెనీ -
నిమిషాల్లో వేడి ఆహారం ‘రెడీ’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్-19 కారణంగా ప్రతి ఇంటా ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రధానంగా ఆహారం విషయంలో ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో హోటళ్లకు వెళ్లడం తగ్గిపోయింది. స్విగ్గీ, జొమాటో ద్వారా ఫుడ్ తెప్పించే బదులు ఇంటి వంటకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే సౌకర్యం కోరుకునే యువత రెడీ టు ఈట్, రెడీ టు కుక్ ఉత్పత్తుల వైపు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. ఇంటి నుంచి విధులు నిర్వర్తించడం, ఆన్లైన్ క్లాసులు వెరశి ఈ ప్రొడక్ట్స్‌కు డిమాండ్‌ను పెంచుతున్నాయి. కంపెనీలు సైతం భారతీయ రుచులను అందిస్తూ కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. కోవిడ్–19 చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. అయితే రెడీ టు ఈట్, రెడీ టు కుక్ మార్కెట్‌కు మాత్రం ఇది కలిసి వచ్చింది. విమానాల్లో మాదిరిగా రైలు ప్రయాణికులకు సైతం బ్రాండెడ్ కంపెనీల రెడీ టు ఈట్ ఆహారం త్వరలో అందుబాటులోకి రానుంది. (వీడియోకాలింగ్ ఫీచర్‌తో సరికొత్త టీవీలు: ధర ఎంతో తెలుసా?) సౌకర్యవంతం కావడంతో..: కొన్నాళ్ళుగా వేగంగా పెరుగుతున్న పట్టణీకరణకుతోడు కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు, పనిచేసే మహిళల సంఖ్య పెరుగుదలతో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. లాక్డౌన్ కాలంలో రెడీ టు కుక్, రెడీ టు ఈట్ ఉత్పత్తులకు విపరీత డిమాండ్ వచ్చింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని అమ్మమ్మాస్ బ్రాండ్‌తో రెడీ టు కుక్ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ మంగమ్మ ఫుడ్స్ ఎండీ ప్రతిమ విశ్వనాథ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఇంటి వంట కోసం వినియోగదారుల వ్యయం 61% పెరిగిందని రెడ్‌సీర్ కన్సల్టింగ్ చెబుతోంది. అసోచాం సర్వే ప్రకారం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులుగా ఉన్న కుటుంబాల్లో సమయాభావం కారణంగా రెడీ టు ఈట్ ఆహారానికి 79% ప్రాధాన్యత ఇస్తున్నాయి. రుచిలో ఏమాత్రం తీసిపోని విధంగా ఉండడం, సులభంగా వండుకోవడానికి, తినడానికి సౌకర్యంగా ఉండడం ఈ ఉత్పత్తుల ప్రత్యేకత. పుట్టుకొస్తున్న కంపెనీలు: రెడీ టు ఈట్, రెడీ టు కుక్ రంగంలోకి కొత్త కొత్త కంపెనీలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే దాదాపు అన్ని కంపెనీలు కూడా స్థానికంగా పాపులర్ అయిన ఉత్పత్తులను ఆఫర్ చేస్తుండడం విశేషం. ఎంటీఆర్, గిట్స్, టేస్టీ బైట్, ఐటీసీ కిచెన్స్ ఆఫ్ ఇండియా, టాటా క్యూ, ద టేస్ట్ కంపెనీ, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, అదానీ విల్మర్, లిషియస్, అమూల్, హల్దీరామ్స్ తదితర కంపెనీలు ప్రధానంగా ఈ రంగంలో పోటీపడుతున్నాయి. కాగా, దేశంలో 71 శాతం ప్రజలు మాంసాహారాన్ని ఇష్టపడతారని అంచనా. అయితే ప్రస్తుత ఇన్స్టంట్ ఫుడ్ సంస్థలు వీరి కోసం ఏమీ చేయలేకపోయాయి. ఈ విషయంలో హైదరాబాద్‌కు చెందిన ద టేస్ట్ కంపెనీ దేశంలోనే తొలిసారిగా మాంసాహార ఉత్పత్తులను అందిస్తోంది. వీటి తయారీకి ఎంతో శ్రమించామని, కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన ఉందని ద టేస్ట్ కంపెనీ వ్యవస్థాపకుడు రాజు వనపాల తెలిపారు. (ఐడీబీఐ బ్యాంక్‌కు భారీ ఊరట) ఫాస్ట్ ఫుడ్‌ను మించి.. రెడ్‌సీర్ ప్రకారం రెడీ టు కుక్ ఉత్పత్తుల మార్కెట్ 2019లో రూ.2,100 కోట్లుంది. సగటున 18 శాతం వార్షిక వృద్ధితో ఇది 2024 నాటికి రూ.4,800 కోట్లకు చేరనుంది. రూ.8,000 కోట్లున్న రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ విపణి వచ్చే అయిదేళ్లలో రెండింతలు కానుంది. ఇన్స్టాంట్ నూడుల్స్ మార్కెట్ విలువ రూ.10,000 కోట్లుగా ఉంది. స్విగ్గీ రిపోర్టు ప్రకారం 2019, 2020లో భారతీయులు పిజ్జా, పాస్తా, నూడుల్స్ బదులుగా ఎక్కువగా బిర్యానీ, మసాలా దోశ, దాల్మఖనీని ఆర్డర్ చేశారు. భారతీయ ఫుడ్‌తో ఇక్కడి కస్టమర్లకు అనుబంధం ఉండడంతో రెడీ టు ఈట్ బ్రేక్ ఫాస్ట్, మీల్ మార్కెట్ రానున్న కొన్ని ఏళ్లలో ఫాస్ట్ ఫుడ్ మార్కెట్‌ను మించిపోవడం ఖాయంగా కనపడుతోంది. (నగ్నంగా బైక్‌పై హల్చల్ : పోలీసుల వేట!) -
ముప్పు కూడా ఇన్స్టెంట్!
సాక్షి, హైదరాబాద్: చాక్లెట్ బార్స్, పిజ్జాలు, షుగర్ డ్రింక్స్, చికెన్ నగ్గెట్స్ వంటి వాటిని ఇష్టంగా లాగించేస్తున్నారా? ఇన్‌స్టాంట్‌గా వండుకునే ఆహార పదార్థాలను (రెడీ టూ ఈట్ మీల్స్) తింటున్నారా? ఇవన్నీ ఒక పరిధి వరకు తీసుకుంటే ఓకే. అంతకు మించితే రోగాల ముప్పు తప్పదంటున్నారు వైద్య నిపుణులు. రోజు వారీగా తీసుకునే అల్పాహారం, లంచ్, డిన్నర్లో వీటి మోతాదు 50% మించితే జీర్ణకోశ వ్యాధులు... మరీ శ్రుతి మించితే కేన్సర్ ముప్పు తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. ఇటీవల దేశంలోని పలు మెట్రో నగరాల్లో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం 10% మేర పెరిగినట్లు కాల్ హెల్త్ అనే సంస్థ అధ్యయనంలో తేలింది. శుద్ధి చేసి నిల్వ ఉండేందుకు సంరక్షకాలను కలిపిన ఆహార పదార్థాలను అల్ట్రా ప్రాసెస్ట్ ఫుడ్ అంటారు. ఇలాంటి ఆహారపదార్థాల వినియోగం పెరిగిందని అధ్యయనంలో తేలింది. వీటిని తినడం వల్ల రోగాలు వచ్చే ప్రమాదం కూడా 12% పెరిగినట్లు వెల్లడైంది. దేశంలో ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో అధికంగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. ఆదమరిస్తే అంతే.. ఐటీ, బీపీవో, కేపీవో, సేవా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, నిర్మాణ, రియల్టీ రంగాలకు నిలయంగా మారిన మెట్రో నగరాల్లో నెటిజన్లు క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. వీరు అల్పాహారం, లంచ్, స్నాక్స్, డిన్నర్ సమయాల్లో శుద్ధిచేసిన ప్రాసెస్డ్ ఆహార పదార్థాలనే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇంట్లో వండుకుని తీసుకొచ్చేందుకు సమయం చిక్కకపోవడంతోనే ఈ పరిస్థితి పునరావృతం అవుతోంది. అయితే ఇది ఒక పరిధి వరకు అయితే ఓకే కానీ.. రోజువారీగా తీసుకునే ఆహారంలో 50 శాతం కంటే మించితే అనర్థాలు తప్పవని వైద్యులు అంటున్నారు. ఆయా ఆహార పదార్థాలు చూసేందుకు శుచిగా.. రుచిగా చూడగానే నోరూరించేట్లు ఉనప్పటికీ.. జిహ్వా చాపల్యం అదుపులో ఉంచుకోకపోతే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ పదార్థాలివే.. ►ఫ్రోజెన్ రెడీ టూ ఈట్ మీల్స్. ఇవి అప్పటికప్పుడు తయారు చేసుకోవడానికి వీలుగా ఉండే ఆహార పదార్థాలు. వీటి ని ఫ్రిజ్‌లో నిల్వ చేయాల్సి వస్తుంది. ►చికెన్ నగ్గెట్స్, పిజ్జా ►అధిక మొత్తంలో నిల్వ చేసి ప్రాసెస్డ్ చేసిన బ్రెడ్ ►చక్కెరతో తయారుచేసిన డ్రింక్‌లు ►క్షణాల్లో రెడీ చేసుకునేందుకు వీలుగా ఉండే నూడుల్స్, సూప్స్ ►చక్కెర కలిపిన తృణ, పప్పు ధాన్యాలు (షుగర్ బ్రేక్‌ఫాస్ట్ సీరెల్స్) ►చక్కెర మోతాదు అధికంగా ఉన్న స్నాక్స్, చిప్స్ ►చాక్లెట్ బార్స్, స్వీట్స్ రోగాల ముప్పు ఇలా.. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తయారీలో భాగంగా ముడి ఆహార పదార్థాలను వివిధ రీతుల్లో అత్యధికంగా వేడి చేసి శుద్ధిచేస్తారు. ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు చక్కెర, ఇతర సంరక్షకాలు, టేస్టింగ్ పౌడర్స్, ఫ్లేవర్స్, రంగులను అధిక మోతాదులో కలుపుతారు. వీటిని వండుకునే సమయం లో ఆయా ఆహార పదార్థాల నుంచి జీర్ణకోశ వ్యాధులు, కేన్సర్‌కు కారణమయ్యే సోడియం నైట్రేట్, టిటానియం ఆక్సైడ్లు వృద్ధి చెందుతాయి. దీంతో వ్యాధుల ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మెట్రో నగరాల్లో ప్రాసెస్డ్ ఫుడ్ జోరు.. దేశంలోని పలు మెట్రో నగరాల్లో టిఫిన్, లంచ్, స్నాక్స్, డిన్నర్ కోసం అల్ట్రా ప్రాసెస్డ్ వంటకాలను సిటిజన్లు కుమ్మేస్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సిటిజన్లు ఆన్లైన్లోనే తమకు నచ్చిన బర్గర్స్, చికెన్ నగ్గెట్స్, చాక్లెట్ బార్స్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్ వెరైటీలను ఆర్డర్ చేస్తున్నట్లు ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తాజా సర్వేలోనూ తేలింది. ఆయా ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్డర్లను ఆన్లైన్లో ఆర్డర్ చేసే విషయంలో సిటిజన్లు స్విగ్గీనే ఆశ్రయిస్తున్నారని ఆ సంస్థ పేర్కొంది. ఈ ఆహార పదార్థాలైతే బెటర్.. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కంటే ఇళ్లలో తయారుచేసుకునే బ్రెడ్, బిస్కట్లు, వెన్న, నెయ్యి వంటి ఆహార పదార్థాలైతే మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రిఫ్రిజిరేటర్లలో నిల్వచేసిన ఆహార పదార్థాల కంటే తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను తీసుకుంటే కేన్సర్ మప్పును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అంటున్నారు. పప్పు దినుసులు, తాజా మాంసం కూడా తర చూ వినియోగిస్తే మంచిదని సూచిస్తున్నారు. పలు అంతర్జాతీయ వైద్య జర్నల్స్‌లోనూ పరిశోధకులు ఇవే అంశాలను తరచూ పేర్కొంటున్నారని వెల్లడించారు. -
రోగులకు రెడీమేడ్ ఆహారం!
ఉభయరాష్ట్రాల వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో త్వరలో అమలు పోషకాల సమతుల్యంతో కిచిడీ, ఉప్మా, హల్వా తయారీ రోజుకు 1,400 కేలరీలతో రోగికి ఆహార ం అంగన్వాడీల్లో సరికొత్త రుచులు! సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంటుగా ఉంటూ వైద్యం పొందుతున్న వారికి రెడీమేడ్ ఆహారం పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో స్థానిక కాంట్రాక్టర్లు వండిన భోజనం రోగులకు అందజేస్తున్నారు. దీనికి ఒక్కో రోగి నుంచి డైట్ చార్జీల కింద రోజుకు రూ. 40 ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇదే ధరను ఇకపై ఏపీ ఫుడ్స్ సరఫరా చేసే రెడీమేడ్ డైట్‌కు ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఈమేరకు ఏపీ ఫుడ్స్ అధికారులతో వైద్యాధికారులు చర్చలు జరుపుతున్నారు. ముందుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు ఈ ఆహారం అందివ్వాలనుకుంటున్నారు. ప్రస్తుతం కాంట్రాక్టర్లు పెట్టే భోజనం నాసిరకంగా ఉందని, సరిపడినన్ని కేలరీలు, పోషకాలు లేవని ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో వేడినీటిలో వేస్తే సిద్ధమైపోయే రెడీమేడ్ కిచిడి, హల్వా, ఉప్మా తదితర పదార్థాలను రోగులకు అందిస్తే ఉభయ రాష్ట్రాల్లో ఉన్న 16 వేల మంది ఇన్‌పేషెంట్లకు ఉపయుక్తంగా ఉంటుందని యోచిస్తున్నారు. ఈ పదార్థాలలో సమతుల పోషకాలు ఉండేలా చూస్తూ.. రోజూ ఇచ్చే ఆహారంలో 1,400 కేలరీలు ఉండేలా తయారు చేస్తారు. ఈ ఆహారంతో పాటు అరటిపండు, కోడిగుడ్డు విడిగా ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఇది సఫలమైతే మిగతా ఆస్పత్రుల్లోనూ అమలు చేయనున్నారు. రూ.100 కోట్లతో కొత్త యంత్రాలు.. ఉభయ రాష్ట్రాల్లో అంగన్వాడీ కేంద్రాలకు ఆహారం సరఫరా చేస్తున్న ఏపీఫుడ్స్ రూ.100 కోట్లతో కొత్త మెషినరీని ఏర్పాటు చేయబోతోంది. మరో మూడు మాసాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. వీటితో రోజుకు 450 మెట్రిక్ టన్నుల ఆహార పదార్థాలను తయారు చేస్తారు. ప్రస్తుతం అంగన్వాడీల్లో కుర్కురే, బాలామృతం పేరుతో ఆహారం తయారు చేస్తున్నారు. వీటి స్థానంలో కొత్త రుచులను అందించాలని భావిస్తున్నారు. అంతేగాకుండా సాంఘిక సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమశాఖ పరిధిలో ఉన్న హాస్టళ్ల విద్యార్థులకూ ఏపీ ఫుడ్స్ రెడీమేడ్ ఆహారం ఇవ్వాలనే ఆలోచన కూడా ఉన్నట్టు ఒక అధికారి పేర్కొన్నారు.