the real estate firm
-
‘రియల్’ దోపిడీ..!
లే- అవుట్లలోనిపార్కు స్థలాలు కబ్జా ఆ స్థలాలతో ట్ల వ్యాపారానికి శ్రీకారం అక్రమాలకు టీడీపీ నేత వెన్నుదన్ను మచిలీపట్నం టౌన్ : పట్టణంలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కనుసన్నల్లో భూమి దోపిడీ జరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న వెంచర్లలో మునిసిపాలిటీకి అప్పగించిన పార్కు స్థలాలను ఈ సంస్థ మింగేస్తోంది. నిబంధనల ప్రకారం వెంచర్ లే అవుట్ మంజూరు కావాలంటే సంబంధిత ప్రదేశంలో రోడ్ల నిర్మాణం, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం, పార్కులో మొక్కల పెంపకం వంటి పనులు పూర్తిచే యాలి. పట్టణంలోని పలు వెంచర్లలో ఇవి కని పించకున్నా సంబంధిత అధికారులు మామూళ్లకు తలొగ్గి అనుమతులు ఇచ్చేశారు. పార్కు స్థలాలను ప్లాట్లుగామార్చి విక్రయిస్తున్న వైనం పై ఓ వెంచర్లో ప్లాట్లు కొన్నవారు ఇటీవల జరిగిన ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. అయినా అధికారులు స్పందించిన దాఖ లాలు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక బైపాస్ రోడ్లో ఓ బిల్డర్స్ సంస్థ ఆధ్వర్యంలో వెంచర్ వేశారు. ఈ వెంచర్లో రోడ్లు అభివృద్ధి చేయకుండానే, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించకుండానే అధికరాలు అనుమతులు ఇచ్చేశారు. ఈ లే అవుట్ ప్లానులో పార్కు స్థలంగా దాదాపు అర ఎకరం చూపారు. అయితే ఆ పార్కు స్థలాన్ని వెంచర్ యజమాని ఆక్రమించి, ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారని కాలనీ వాసులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ పార్కు స్థలం చుట్టూ మచిలీపట్నం మునిసిపల్ కౌన్సిల్ (ఎంఎంసీ) పేరిట ఏర్పాటుచేసిన సిమెంట్ దిమ్మెలను తొలగిం చిన వెంచర్ యజమాని మూడు అడుగుల ఎత్తున ప్రహరీ నిర్మిచాడు. స్థానికులు గురువారం తమ ప్రాంతానికి వచ్చిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు ఈ అక్రమాలపై వినతి పత్రం అందజేశారు. అదే బిల్డర్ స్థానిక పరాసుపేట సెయింట్ప్రాన్సిస్ స్కూల్ ఎదురుగా వేసిన మరో వెంచర్లో పార్కు స్థలాన్నీ స్వాధీనం చేసుకున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఈ సంస్థ యజమాని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్సీకి అనుచరుడిగా ఉంటూ ఈ అక్రమ వ్యవహారాలకు పాల్పడుతున్నందునే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రిగా పని చేసిన కాలంలో ఈ సంస్థ యజమాని స్థానిక పరాసుపేటలోని ఆంజనేయస్వామి గుడికి సంబంధిం చిన ఎకరం స్థలానికి బీ ఫారం పట్టా పొంది అక్రమంగా దక్కించుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రజాతీయ కళాశాల సమీపాన ఉన్న రెండు వెంచర్లలోని పార్కు స్థలాలను కూడా పై సంస్థ యజమానే కొనుగోలు చేసి ప్లాట్లు వేసి విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. లే అవుట్ సంస్థకు టీడీపీ నేత వెన్నుదన్ను పట్టణంలోని పలు లే అవుట్ల్లోని పార్కు స్థలాలను నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లుగా మార్చివిక్రయాలు జరుపుకునేందుకు సహకరి స్తానని ఆ వెంచర్ సంస్థకు పట్టణానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు హామీ ఇచ్చారని సమాచారం. తాను మునిసిపల్ చైర్మన్ అయితే ఈ అక్రమాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తానని ఆ నాయకుడు మునిసిపల్ ఎన్నికల సందర్భంలో ఈ వెంచర్ సంస్థ యజమాని నుంచి లక్షలాది రూపాయలను తీసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్కు స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం జరిగింది పట్టణంలోని బైపాస్‌రోడ్‌లో ఉన్న సాయినగర్ కాలనీ లే అవుట్‌ను శుక్రవారం మునిసిపల్ కమిషనర్ ఎ.మారుతిదివాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ లే అవుట్‌కు మునిసిపాలిటీ అనుమతి ఉన్నం దున పార్కు స్థలం ఉంటుందన్నారు. ఈ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం జరిగిందని, స్వాధీనం చేసుకుంటామని స్పష్టంచేశారు. అయితే పార్కుకు స్థలం లేదని వెంచర్ ప్రతినిధులు చెప్పగా కమిషనర్ విభేదించారు. చర్యలు తీసుకుంటా పట్టణంలోని పలు లే అవుట్లలోని పార్కుల స్థలాలను ఆక్రమించి ప్లాట్లుగా విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు అందాయి. ఈ లే అవుట్ల స్థలాలను, పార్కు స్థలాలను నేనే స్వయంగా పరిశీలిస్తా. ఈ పరిశీనలో స్థలాలు ఆక్రమణకు గురైనట్లు తేలితే తక్షణం వాటిని స్వాధీనం చేసుకునేందకు చర్యలు తీసుకుంటా. - ఎ.మారుతిదివాకర్, కమిషనర్ -
డ్రైవరే సూత్రధారి
మరో ముగ్గురితో కలిసి రూ. 10.90 లక్షల దోపిడీ పోలీసుల ముసుగులో ఎత్తుకెళ్లిన నిందితులు ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు మెహిదీపట్నం, న్యూస్‌లైన్: ఎల్లారెడ్డిగూడ వద్ద నకిలీ పోలీసులు ఈనెల 21వ తేదీ రాత్రి ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన రూ.10.90 లక్షలు దోచుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. ఆ సంస్థ కారు డ్రైవరే ఈ దోపిడీకి సూత్రధారిగా తేల్చారు. ఇతడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... యూసుఫ్‌గూడ శ్రీరాంనగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఇస్తియాక్ అలీ (26) టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ రిత్విక్ కన్స్రక్షన్స్లో కొన్ని రోజులుగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మహబూబ్‌నగర్ సింగాటం గ్రామానికి కారు డ్రైవర్ పుట్ట రాము (25), అదే గ్రామానికి చెందిన హోంగార్డు ఎం.నాగరాజు(34), జియాఉద్దీన్ ఇతనికి స్నేహితులు. ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అరికట్టేందుకు పోలీసులు చేస్తున్న సోదాలను ఆసరా చేసుకొని భారీగా డబ్బు తరలించేవారిని దోచుకోవాలని ఇస్తియాక్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి పథకం వేశాడు. ఇందులో భాగంగా మొదట తాను పని చేస్తున్న సంస్థనే టార్గెట్ చేశాడు. రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా రిత్విక్ సంస్థ వారు ఈనెల 21వ తేదీ రాత్రి బషీర్‌బాగ్‌లోని ఆమ్వే కన్స్ట్రక్షన్స్ నుంచి రూ.25 లక్షలు తీసుకొని కారులో బంజారాహిల్స్ బయలుదేరారు. ఇదే అదనుగా భావించిన డ్రైవర్ మహ్మద్ ఇస్తియాక్ డబ్బు తరలిస్తున్న విషయాన్ని తమ ముఠాకు సమాచారం ఇచ్చాడు. వెంటనే వారు ఎల్లారెడ్డిగూడ వద్ద మాటు వేశారు. డబ్బు తరలిస్తున్న కారు రాగానే రాము, నాగరాజు, జియా ఉద్దీన్ ఆపారు. తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని, వాహన తనిఖీలు చేస్తున్నామని కారులో ఎక్కారు. సంస్థ మేనేజర్ ఏసుబాబును బెదిరించి వెనుకాల ఉన్న డబ్బు బ్యాగులోంచి రూ.10 లక్షల 90 వేలు తీసుకొని వెళ్లిపోయారు. ఈ ఘటనపై రిత్విక్ సంస్థ యాజమాన్యం మరునాడే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ దోపిడీకి సూత్రధారుడైన మహ్మద్ ఇస్తియాక్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. కాగా, అతడి తీరుపై పోలీసులకు అనుమానం వచ్చి.. అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. అతను ఇచ్చిన సమాచారంతో నిందితులు పుట్టా రాము, నాగరాజులను శనివారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 7.95 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు జియా ఉద్దీన్ పరారీలో ఉన్నాడు. నిందితుల్లో ఒకడైన నాగరాజు మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు ఠాణాలో హోంగార్డ్‌గా పని చేస్తున్నాడని, అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామని డీసీపీ తెలిపారు. దోపిడీ చేసే స్థలంలో కేవలం నిలబడితేనే రూ.40 వేలు ఇస్తామనడంతో అతను అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇస్తియాక్పై గతంలో జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు కార్ల దొంగతనాలు ఉన్నాయన్నారు. అలాగే జియాఉద్దీన్పై కూడా మహబూబ్‌నగర్, వనపర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో చీటింగ్ కేసు, రాముపై కూడా మహబూబ్‌నగర్, నల్లగొండజిల్లాల్లో పలు పోలీస్‌స్టేషన్‌లో కిడ్నాప్, చోరీ వంటి నేరాలున్నాయన్నారు. నిందితులు ముగ్గురినీ రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో అడిషినల్ డీసీపీ నాగరాజు, పంజగుట్ట ఏసీపీ రవివర్మ, డీఐ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.