‘రియల్’ దోపిడీ..! | 'Real' robbery ..! | Sakshi
Sakshi News home page

‘రియల్’ దోపిడీ..!

Published Sat, Jun 28 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM

‘రియల్’ దోపిడీ..!

‘రియల్’ దోపిడీ..!

  • లే- అవుట్లలోనిపార్కు స్థలాలు కబ్జా
  •   ఆ స్థలాలతో  ట్ల వ్యాపారానికి శ్రీకారం
  •   అక్రమాలకు టీడీపీ నేత వెన్నుదన్ను
  • మచిలీపట్నం టౌన్ : పట్టణంలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కనుసన్నల్లో భూమి దోపిడీ జరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న వెంచర్లలో మునిసిపాలిటీకి అప్పగించిన పార్కు స్థలాలను ఈ సంస్థ మింగేస్తోంది. నిబంధనల ప్రకారం వెంచర్ లే అవుట్ మంజూరు కావాలంటే సంబంధిత ప్రదేశంలో రోడ్ల నిర్మాణం, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం, పార్కులో మొక్కల పెంపకం వంటి  పనులు పూర్తిచే యాలి.

    పట్టణంలోని పలు వెంచర్లలో ఇవి కని పించకున్నా సంబంధిత అధికారులు మామూళ్లకు తలొగ్గి అనుమతులు ఇచ్చేశారు. పార్కు స్థలాలను ప్లాట్లుగామార్చి విక్రయిస్తున్న వైనం పై ఓ వెంచర్‌లో ప్లాట్లు కొన్నవారు ఇటీవల జరిగిన ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. అయినా అధికారులు స్పందించిన దాఖ లాలు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
     
    స్థానిక బైపాస్ రోడ్‌లో ఓ బిల్డర్స్ సంస్థ ఆధ్వర్యంలో వెంచర్ వేశారు. ఈ వెంచర్‌లో రోడ్లు అభివృద్ధి చేయకుండానే, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించకుండానే అధికరాలు అనుమతులు ఇచ్చేశారు. ఈ లే అవుట్ ప్లానులో పార్కు స్థలంగా దాదాపు అర ఎకరం చూపారు. అయితే ఆ పార్కు స్థలాన్ని వెంచర్ యజమాని ఆక్రమించి, ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారని కాలనీ వాసులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

    ఈ పార్కు స్థలం చుట్టూ మచిలీపట్నం మునిసిపల్ కౌన్సిల్ (ఎంఎంసీ) పేరిట ఏర్పాటుచేసిన సిమెంట్ దిమ్మెలను తొలగిం చిన వెంచర్ యజమాని మూడు అడుగుల ఎత్తున ప్రహరీ నిర్మిచాడు. స్థానికులు గురువారం తమ ప్రాంతానికి వచ్చిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు ఈ అక్రమాలపై వినతి పత్రం అందజేశారు. అదే బిల్డర్ స్థానిక పరాసుపేట సెయింట్‌ప్రాన్సిస్ స్కూల్ ఎదురుగా వేసిన మరో వెంచర్‌లో పార్కు స్థలాన్నీ స్వాధీనం చేసుకున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.

    ఈ సంస్థ యజమాని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్సీకి అనుచరుడిగా ఉంటూ ఈ అక్రమ వ్యవహారాలకు పాల్పడుతున్నందునే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రిగా పని చేసిన కాలంలో ఈ సంస్థ యజమాని స్థానిక పరాసుపేటలోని ఆంజనేయస్వామి గుడికి సంబంధిం చిన ఎకరం స్థలానికి బీ ఫారం పట్టా పొంది అక్రమంగా దక్కించుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రజాతీయ కళాశాల సమీపాన ఉన్న రెండు వెంచర్లలోని పార్కు స్థలాలను కూడా పై సంస్థ యజమానే కొనుగోలు చేసి ప్లాట్‌లు వేసి విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
     
    లే అవుట్ సంస్థకు టీడీపీ నేత వెన్నుదన్ను
     
    పట్టణంలోని పలు లే అవుట్‌ల్లోని పార్కు స్థలాలను నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లుగా మార్చివిక్రయాలు జరుపుకునేందుకు సహకరి స్తానని ఆ వెంచర్ సంస్థకు పట్టణానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు హామీ ఇచ్చారని సమాచారం. తాను మునిసిపల్ చైర్మన్ అయితే ఈ అక్రమాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తానని ఆ నాయకుడు మునిసిపల్ ఎన్నికల సందర్భంలో ఈ వెంచర్ సంస్థ యజమాని నుంచి లక్షలాది రూపాయలను తీసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  
     
    పార్కు స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం జరిగింది
     
    పట్టణంలోని బైపాస్‌రోడ్‌లో ఉన్న సాయినగర్ కాలనీ లే అవుట్‌ను శుక్రవారం మునిసిపల్ కమిషనర్ ఎ.మారుతిదివాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ లే అవుట్‌కు మునిసిపాలిటీ అనుమతి ఉన్నం దున పార్కు స్థలం ఉంటుందన్నారు. ఈ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం జరిగిందని, స్వాధీనం చేసుకుంటామని స్పష్టంచేశారు. అయితే పార్కుకు స్థలం లేదని వెంచర్ ప్రతినిధులు చెప్పగా కమిషనర్ విభేదించారు.
     
     చర్యలు తీసుకుంటా
     పట్టణంలోని పలు లే అవుట్లలోని పార్కుల స్థలాలను ఆక్రమించి ప్లాట్‌లుగా విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు అందాయి. ఈ లే అవుట్ల స్థలాలను, పార్కు స్థలాలను నేనే స్వయంగా పరిశీలిస్తా. ఈ పరిశీనలో స్థలాలు ఆక్రమణకు గురైనట్లు తేలితే తక్షణం వాటిని స్వాధీనం చేసుకునేందకు చర్యలు తీసుకుంటా.
     - ఎ.మారుతిదివాకర్, కమిషనర్
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement