Lay - out
-
పర్మిషన్ లేకుండా లే అవుట్ వేస్తే తప్పేంటి...?
సాక్షి, కృష్ణా జిల్లా: అనుమతులు లేకుండా వేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు చెందిన అక్రమ లే అవుట్‌ను అధికారులు ధ్వంసం చేశారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం గొల్లగూడెం గ్రామంలో కనీసం పంచాయతీ అనుమతులు కూడా తీసుకోకుండా లే అవుట్ వేసినట్లు అధికారులు తెలిపారు. అనధికార లే అవుట్‌పై బోడె ప్రసాద్‌ను అధికారులు ప్రశ్నించగా.. ఇక్కడ కొన్ని స్థలాలు అనుమతులు లేకుండానే ఉన్నాయని.. పర్మిషన్ లేకుండా వేస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. మహిళ అధికారి అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారు. నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని అధికారులు తెలిపారు. -
లే‘ఔట్’పై దృష్టి
ఖమ్మం : అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మం నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట అక్రమ లే అవుట్లు, నిబంధనలకు విరుద్ధంగా కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలతో..బాధ్యులపై చర్యలకు అవినీతి నిరోధక శాఖ ( ఏసీబీ) అధికారులు నిఘా పెట్టారు. రాష్ట్రంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మంలో ఒక వైపు సుడా ఏర్పాటు మరోవైపు ఐటీహబ్.. ఔటర్ రింగ్‌రోడ్ ఏర్పాట్లతో అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా భూ దందా సాగిస్తున్నారనే కోణంలో దృష్టి సారిస్తున్నారు. నగరం చుట్టూ పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న లే అవుట్లతో పాటు అక్రమాల నివారణ లక్ష్యంగా కసరత్తు జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో హెచ్ఎండీఏ పట్టణ ప్రణాళిక విభాగంలో ఓ అధికారి ఏసీబీకి దొరకడంతో ఇప్పుడు ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చురుగ్గా సాగుతున్న నగరాలపై దృష్టి సారించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే లే అవుట్లు.. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ప్లాట్ల ధరలకు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ లే అవుట్లు వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లే అవుట్ ఏర్పాటు చేయాలంటే రెవెన్యూ శాఖ నుంచి ల్యాండ్ కన్వర్షన్ అనుమతులు తీసుకోవాలి. పట్టణ ప్రణాళిక విభాగం నుంచి అంగీకారం కావాలి. అయితే ఇవేమీ పట్టనట్లు కొందరు అక్రమార్కులు..అనుమతులు లేకుండానే లే అవుట్లను చేసి కొనుగోలుదారులకు అంటగడుతున్నారు. ఇటీవల ధంసలాపురం ఆర్వోబీ నిర్మాణ సమయంలో భూసేకరణకు సంబంధించి అక్రమంగా ఏర్పాటు చేసిన లే అవుట్లు బయటకు రావడం గమనార్హం. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఇలా అక్రమ లే అవుట్లు విచ్చలవిడిగా వెలుస్తున్నట్లు తెలుస్తోంది. గ్రీన్‌బెల్ట్ ఏరియాకు తప్పనిసరిగా స్థలాన్ని వదిలేయాల్సి ఉంటుంది. మొత్తం లే అవుట్లో 10 శాతం ప్రాంతాన్ని గ్రీన్‌బెల్ట్ కేటాయించాలి. ప్రస్తుత డిమాండ్ నేపథ్యంలో పట్టించుకోవట్లేదు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో వీటి జారీ వెనుక జరుగుతున్న అక్రమాలపై అవినీతి శాఖ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో నిర్మించిన లే అవుట్లలో 50 శాతం మేరకు గ్రీన్‌బెల్ట్ స్థలాలు మాయమైనట్లు సమాచారం. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే తీరుపై నిఘా పెట్టనున్నారు. భవన నిర్మాణ అనుమతులకు తూట్లు.. అక్రమ లే అవుట్లతోపాటు భవన నిర్మాణ అనుమతులపై అవినీతి నిరోధక శాఖ దృష్టి సారించినట్లు సమాచారం. ప్రధాన రహదారుల వెంబడి అనుమతులకు తిలోదకాలిచ్చి అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. సాధారణంగా పట్టణాల్లో వెయ్యి గజాలపైబడి ఉన్న స్థలాల్లోనే సెల్లార్లు నిర్మించాలి. రైల్వే ట్రాక్‌ల వెంబడి సెల్లార్ల నిర్మాణాలకు అనుమతులు లేవు. ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇష్టారాజ్యంగా సెల్లార్ల నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే వీటి అనుమతులపైన అవినీతి శాఖ దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాలతోపాటు, గత మూడేళ్ల నుంచి వచ్చిన అనుమతులపై సైతం పరిశీలన చేయనున్నారని గుసగుస. ఇప్పటికే హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏపై దృష్టి సారించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు మరికొద్ది రోజుల్లో ఖమ్మంలో సైతం అక్రమ నిర్మాణాలు, లే అవుట్లపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. విచారణతో బాగోతం బయటపడే అవకాశాలు ఉన్నాయి. -
‘రియల్’ దోపిడీ..!
లే- అవుట్లలోనిపార్కు స్థలాలు కబ్జా ఆ స్థలాలతో ట్ల వ్యాపారానికి శ్రీకారం అక్రమాలకు టీడీపీ నేత వెన్నుదన్ను మచిలీపట్నం టౌన్ : పట్టణంలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కనుసన్నల్లో భూమి దోపిడీ జరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న వెంచర్లలో మునిసిపాలిటీకి అప్పగించిన పార్కు స్థలాలను ఈ సంస్థ మింగేస్తోంది. నిబంధనల ప్రకారం వెంచర్ లే అవుట్ మంజూరు కావాలంటే సంబంధిత ప్రదేశంలో రోడ్ల నిర్మాణం, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం, పార్కులో మొక్కల పెంపకం వంటి పనులు పూర్తిచే యాలి. పట్టణంలోని పలు వెంచర్లలో ఇవి కని పించకున్నా సంబంధిత అధికారులు మామూళ్లకు తలొగ్గి అనుమతులు ఇచ్చేశారు. పార్కు స్థలాలను ప్లాట్లుగామార్చి విక్రయిస్తున్న వైనం పై ఓ వెంచర్లో ప్లాట్లు కొన్నవారు ఇటీవల జరిగిన ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. అయినా అధికారులు స్పందించిన దాఖ లాలు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక బైపాస్ రోడ్లో ఓ బిల్డర్స్ సంస్థ ఆధ్వర్యంలో వెంచర్ వేశారు. ఈ వెంచర్లో రోడ్లు అభివృద్ధి చేయకుండానే, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించకుండానే అధికరాలు అనుమతులు ఇచ్చేశారు. ఈ లే అవుట్ ప్లానులో పార్కు స్థలంగా దాదాపు అర ఎకరం చూపారు. అయితే ఆ పార్కు స్థలాన్ని వెంచర్ యజమాని ఆక్రమించి, ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారని కాలనీ వాసులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ పార్కు స్థలం చుట్టూ మచిలీపట్నం మునిసిపల్ కౌన్సిల్ (ఎంఎంసీ) పేరిట ఏర్పాటుచేసిన సిమెంట్ దిమ్మెలను తొలగిం చిన వెంచర్ యజమాని మూడు అడుగుల ఎత్తున ప్రహరీ నిర్మిచాడు. స్థానికులు గురువారం తమ ప్రాంతానికి వచ్చిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు ఈ అక్రమాలపై వినతి పత్రం అందజేశారు. అదే బిల్డర్ స్థానిక పరాసుపేట సెయింట్ప్రాన్సిస్ స్కూల్ ఎదురుగా వేసిన మరో వెంచర్లో పార్కు స్థలాన్నీ స్వాధీనం చేసుకున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఈ సంస్థ యజమాని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్సీకి అనుచరుడిగా ఉంటూ ఈ అక్రమ వ్యవహారాలకు పాల్పడుతున్నందునే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రిగా పని చేసిన కాలంలో ఈ సంస్థ యజమాని స్థానిక పరాసుపేటలోని ఆంజనేయస్వామి గుడికి సంబంధిం చిన ఎకరం స్థలానికి బీ ఫారం పట్టా పొంది అక్రమంగా దక్కించుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రజాతీయ కళాశాల సమీపాన ఉన్న రెండు వెంచర్లలోని పార్కు స్థలాలను కూడా పై సంస్థ యజమానే కొనుగోలు చేసి ప్లాట్లు వేసి విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. లే అవుట్ సంస్థకు టీడీపీ నేత వెన్నుదన్ను పట్టణంలోని పలు లే అవుట్ల్లోని పార్కు స్థలాలను నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లుగా మార్చివిక్రయాలు జరుపుకునేందుకు సహకరి స్తానని ఆ వెంచర్ సంస్థకు పట్టణానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు హామీ ఇచ్చారని సమాచారం. తాను మునిసిపల్ చైర్మన్ అయితే ఈ అక్రమాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తానని ఆ నాయకుడు మునిసిపల్ ఎన్నికల సందర్భంలో ఈ వెంచర్ సంస్థ యజమాని నుంచి లక్షలాది రూపాయలను తీసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్కు స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం జరిగింది పట్టణంలోని బైపాస్‌రోడ్‌లో ఉన్న సాయినగర్ కాలనీ లే అవుట్‌ను శుక్రవారం మునిసిపల్ కమిషనర్ ఎ.మారుతిదివాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ లే అవుట్‌కు మునిసిపాలిటీ అనుమతి ఉన్నం దున పార్కు స్థలం ఉంటుందన్నారు. ఈ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం జరిగిందని, స్వాధీనం చేసుకుంటామని స్పష్టంచేశారు. అయితే పార్కుకు స్థలం లేదని వెంచర్ ప్రతినిధులు చెప్పగా కమిషనర్ విభేదించారు. చర్యలు తీసుకుంటా పట్టణంలోని పలు లే అవుట్లలోని పార్కుల స్థలాలను ఆక్రమించి ప్లాట్లుగా విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు అందాయి. ఈ లే అవుట్ల స్థలాలను, పార్కు స్థలాలను నేనే స్వయంగా పరిశీలిస్తా. ఈ పరిశీనలో స్థలాలు ఆక్రమణకు గురైనట్లు తేలితే తక్షణం వాటిని స్వాధీనం చేసుకునేందకు చర్యలు తీసుకుంటా. - ఎ.మారుతిదివాకర్, కమిషనర్