Real Madrid Club
-
మొన్న 9వేల కోట్లు.. ఇవాళ 2700 కోట్లు; ఎవరికి అర్థంకాని ఎంబాపె!
ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్ కైలియన్ ఎంబాపె ఎవరికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం పారిస్ సెయింట్ జెర్మెన్(పీఎస్జీ క్లబ్‌కు) ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంబాపె కాంట్రాక్ట్ ఈ సీజన్ అనంతరం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎంబాపె ఏ క్లబ్లో చేరనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక సౌదీ క్లబ్ అల్ హిలాల్ ఎంబాపెకు ఏడాది కాంట్రాక్ట్ కోసం భారీగా ఆఫర్ చేసింది. అతనికి ఏకంగా 33.2 కోట్ల డాలర్లు (సుమారు రూ.2700 కోట్లు) చెల్లించడానికి ముందుకు వచ్చింది. ఈ డీల్ ఫైనల్ చేయడానికి అల్ హిలాల్ అధికారులు మంగళవారం పారిస్‌కు వెళ్లారు. అయితే ఎంబాపె మాత్రం సంతకం కాదు కదా.. కనీసం వాళ్లను కలవడానికి కూడా ఇష్టపడలేదు. తనకు అల్ హిలాల్ క్లబ్లో చేరే ఆసక్తి లేదని తేల్చిచెప్పాడు. వాస్తవానికి పీఎస్జీతో ఒప్పందం ముగిసిన తర్వాత ఎంబాపె కొంతకాలం ఫ్రీగా ఉండాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కొంతకాలం గ్యాప్ తర్వాత ఎంబాపె రియల్ మాడ్రిడ్ క్లబ్లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఫ్రీ ట్రాన్స్ఫర్ లో అతడు రియల్ మాడ్రిడ్ టీమ్ లోకి వెళ్తే 10 కోట్ల యూరోలు (సుమారు రూ.900 కోట్లు) సైనింగ్ ఆన్ ఫీగా లభిస్తాయి. ఒకవేళ పీఎస్‌జీతోనే కొనసాగాలని భావిస్తే సెప్టెంబర్ లో అతనికి బోనస్ గా 8 కోట్ల యూరోలు (సుమారు రూ.727 కోట్లు) వస్తాయి. మొదట ఎంబాపెను వదులుకోవడానికి ఇష్టపడని పీఎస్జీ క్లబ్ పదేళ్ల కాలానికి గానూ దాదాపు రూ.10వేల కోట్లు ఆఫర్ చేసింది. కానీ ఎంబాపె ఆ ఆఫర్‌ను తిరస్కరించడంతో పీఎస్జీ ఎంబాపెను ఇప్పుడే వదిలేసుకొని అతనిపై కాస్త డబ్బు సంపాదించాలని చూస్తోంది. ఏడాది కాలంలో కాంట్రాక్ట్ ముగిసన తర్వాత ఫ్రీగా వదిలేయడం కంటే.. ఇదే బెటరని ఆ క్లబ్ భావిస్తోంది. ట్రాన్స్ఫర్ ఫీజుపై ప్రస్తుతానికి పీఎస్జీ, అల్ హిలాల్ మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు. నిజానికి అల్ హిలాల్ టీమ్ గతంలో లియోనెల్ మెస్సీ కోసం గట్టిగానే ప్రయత్నించింది. కానీ ఇంటర్ మియామీ క్లబ్ రికార్డు ధరకు మెస్సీని కొనుగోలు చేసింది. దీంతో పీఎస్జీ తరపునే ఆడుతున్న ఫ్రాన్స్ స్టార్ ఎంబాపెను అయినా దక్కించుకోవాలని ఆరాటపడింది. కానీ తాజాగా ఎంబాపె ఆఫర్‌ను తిరస్కరించడంతో అల్ హిలాల్ క్లబ్‌కు నిరాశే మిగిలింది. ఇక ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె 2018లో ఫ్రాన్స్ ఫిపా వరల్డ్‌కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ తనదైన ముద్ర వేసిన ఎంబాపె ఫైనల్లో మెస్సీ సేనకు చెమటలు పట్టించాడు. ఓటమిని అంత సులువుగా ఒప్పుకోని ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు. అయితే పెనాల్టీ షూటౌట్లో ఎంబాపె మినహా మిగతా ఆటగాళ్లు గోల్స్ చేయడంలో విఫలం కావడంతో ఫ్రాన్స్ రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది. అయితే ఎంబాపె మాత్రం తన ప్రదర్శనతో అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. చదవండి: #KylianMbappe: 'పదేళ్ల కాలానికి తొమ్మిది వేల కోట్లు చెల్లిస్తాం'.. ఎంబాపె తిరస్కరణ క్యాచ్ విషయంలో నమ్మకం కోల్పోయిన వేళ.. గొడవకు దారి -
దిష్టిబొమ్మ దహనం.. ఐదు లక్షల జరిమానా; రెండేళ్ల నిషేధం
బ్రెజిల్ స్టార్, రియల్ మాడ్రిడ్ ఫుట్‌బాలర్ వినిషియస్ జూనియర్‌కు అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. స్పానిష్ లీగ్‌లో భాగంగా మే21న జరిగిన మ్యాచ్‌లో వినిషియస్‌కు వ్యతిరేకంగా కొంతమంది అభిమానులు దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు ''Go Back To Your Country'' అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ ఘటనపై స్పెయిన్ యాంటీ వయొలెన్స్ కమీషన్ సీరియస్ అయింది. లైవ్ మ్యాచ్ సమయంలో ఒక సాకర్ ప్లేయర్‌పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడంతో పాటు దిష్టిబొమ్మ దహనం చేసినందుకు 60,001 యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ. ఐదు లక్షల జరిమానా, రెండేళ్ల నిషేధం విధించింది. నల్లజాతీయుడైన వినిషియస్ జూనియర్ కు ఈ వివక్ష కొత్తేం కాదు. ఐదేళ్ల క్రితం బ్రెజిల్ నుంచి స్పెయిన్‌కు వచ్చినప్పటి నుంచి అతను జాతి వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో రియల్ మాడ్రిడ్, అట్లెటికో మాడ్రిడ్ మధ్య మ్యాచ్‌లోనూ జూనియర్ వినిషియస్ వివక్షకు గురయ్యాడు. స్పానిష్ క్లబ్ అయిన వెలెన్సియా నినాదాలు చేసిన ముగ్గురు అభిమానులకు జరిమానా విధించడంతో పాటు ఒక ఏడాది స్టేడియంలోకి అడుగుపెట్టకుండా నిషేధించింది. అయితే తాజాగా ఏడుగురు అభిమానులు జూనియర్ వినిషయస్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అతని కళ్ల ముందే దిష్టిబొమ్మను తగలబెట్టడం ఎంతో బాధించింది. Ya que los que deberían no te explican qué es y qué puede hacer @LaLiga en los casos de racismo, hemos intentado explicártelo nosotros, pero no te has presentado a ninguna de las dos fechas acordadas que tú mismo solicitaste. Antes de criticar e injuriar a @LaLiga, es necesario… https://t.co/pLCIx1b6hS pic.twitter.com/eHvdd3vJcb — Javier Tebas Medrano (@Tebasjavier) May 21, 2023 Vinicius Jr ALL GOALS AND ASSISTS so far this season, let me know if i missed anything.pic.twitter.com/QY3IMI6ygW — Druchk (@andruchk) May 28, 2023 చదవండి: వివాదంలో గుజరాత్ టైటాన్స్ క్రికెటర్ యష్ దయాల్ -
ప్రెసిడెంట్ ఆడియో టేప్ లీక్.. రొనాల్డోపై తీవ్ర వ్యాఖ్యలు
లిస్బన్: క్రిస్టియానో రొనాల్డో ఆటతోనే కాదు.. తన మేనరిజంతో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్న పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు. అయితే తాజాగా క్రిస్టియానో రొనాల్డో, మేనేజర్ జోస్ మౌరిన్హోలను రియల్ మాడ్రిడ్ అధ్యక్షుడు ఫ్లోరెంటినో పెరెజ్ ఎగతాళి చేసిన ఆడియో టేపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ ఆడియోక టేపులో క్రిస్టియానో రొనాల్డో ఓ ఇడియట్, జబ్బు మనిషి అంటూ విమర్షించారు. ‘‘రొనాల్డో ఓ వెర్రివాడు. ఇడియట్, జబ్బు మనిషి. అందరూ అతడు సాధారణంగా ఉన్నాడు అనుకుంటారు. కానీ అతను చేయాల్సిన పనులు చేయరు. అతను ఏదో చేస్తాడని మీరు అనుకుంటారు. కానీ ఏమీ చేయడు.’’ అంటూ విమర్షించారు. మెండిస్‌కు , మేనేజర్ జోస్ మౌరిన్హో ఇద్దరికీ రొనాల్డోపై నియంత్రణ లేదు. వారిద్దరికీ చాలా అహంకారం ఉంది. డబ్బులు ఎక్కువగా సంపాదించవచ్చు. మనం ఈ రోజు డబ్బులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దాంతో వారు గొప్ప వాళ్లుగా కనిపిస్తారు.’’ అంటూ పెరెజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
రియల్ మాడ్రిడ్ క్లబ్ మాజీ అధ్యక్షుడు లొరెంజో మృతి
మాడ్రిడ్ (స్పెయిన్): ప్రపంచ ఫుట్‌బాల్‌లో విఖ్యాత క్లబ్‌గా పేరొందిన రియల్ మాడ్రిడ్ క్లబ్‌కు ఐదేళ్లపాటు అధ్యక్షుడిగా వ్యవహరించిన లొరెంజో సాంజ్ మృతి చెందారు. కొన్నిరోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చిక్సిత తీసుకుంటూ ఆదివారం కన్నుమూశారని లొరెంజో కుమారుడు లొరెంజో సాంజ్ జూనియర్ తెలిపాడు. 76 ఏళ్ల లొరెంజో 1995 నుంచి 2000 వరకు రియల్ మాడ్రిడ్ క్లబ్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన హయాంలో రియల్ మాడ్రిడ్ జట్టు 1998, 2000లో ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 118 ఏళ్ల చరిత్ర ఉన్న రియల్ మాడ్రిడ్ క్లబ్ స్పెయిన్ దేశవాళీ ఫుట్‌బాల్ టోర్నీ లా లీగాలో 33 సార్లు... యూరోప్ దేశాల్లోని క్లబ్ జట్ల మధ్య జరిగే చాంపియన్స్ లీగ్ టోర్నీలో 13 సార్లు విజేతగా నిలిచింది. కోవిడ్–19 ప్రస్తుతం యూరోప్‌లో విజృంభిస్తోంది. ఒక్క స్పెయిన్‌లోనే ఇప్పటివరకు 1,320 మంది కరోనాతో మృతి చెందారు. -
టిప్ 16 లక్షలు!
ఏథెన్స్: రెస్టారెంట్లలో బిల్‌తో పాటు టిప్ ఇవ్వడం సర్వసాధారణం. మనకు హోటల్ సిబ్బంది సర్వీస్ ఎంత నచ్చితే అంత ఎక్కువ టిప్ ఇవ్వాలనిపిస్తుంది. కానీ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో ఓ హోటల్ సిబ్బందికి ఏకంగా 16 లక్షల భారీ టిప్ ఇచ్చాడు. ఈ ఊహకందని భారీ మొత్తం చూడటంతో సిబ్బందే ఆశ్చర్యానికి గురయ్యారు. రొనాల్డో మాత్రం వారి సేవకు మెచ్చే ఇచ్చానని పేర్కొన్నారు. ప్రస్తుతం రొనాల్డో ఇచ్చిన టిప్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. పోర్చుగల్ జట్టు రౌండ్-16లో ఉరుగ్వేపై ఓటమి చెందడంతో ఫిఫా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. దీంతో దొరికిన ఖాళీ సమయంలో ఆటగాళ్లు సేదతీరుతున్నారు. పోర్చుగల్ కెప్టెన్ మాత్రం తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి గ్రీస్‌లో సందడి చేస్తున్నాడు. సన్నిహితులతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన రోనాల్డో అక్కడి సిబ్బంది మర్యాదలు నచ్చి భారీ మొత్తంలో టిప్ ఇచ్చాడు. ఇటీవలే స్పెయిన్‌కు చెందిన రియల్ మాడ్రిడ్ క్లబ్ నుంచి ఇటలీకి చెందిన విఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ యువెంటస్‌కు రొనాల్డో బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ కొత్త ఒప్పదం ప్రకారం నాలుగేళ్ల పాటు యువెంటస్‌కు ఆడతాడు. చదవండి: ఆ మాజీ క్రికెటర్ రెస్టారెంట్ బిల్లు ఏడు లక్షలు -
ఆ ప్లేయర్ గ్రహాంతరవాసా!.. వైరల్ వీడియో
మాడ్రిడ్ : ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మైదానంలో చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కాదు. అతడు మ్యాచ్‌లో ఉన్నాడంటే జట్టు హాయిగా నిద్రపోవచ్చు. రియాల్ మాడ్రిడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డో జువెంటస్ తో జరిగిన మ్యాచ్‌లో చేసిన గోల్ హాట్ టాపిక్‌గా మారింది. గాల్లోకి పక్షిలా ఎగురుతూ చేసిన ఆ గోల్‌ను సైకిల్ కిక్ గోల్ అని ప్రశంసిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో జువెంటస్‌పై 3-0తో నెగ్గిన రియల్ మాడ్రిడ్ జట్టు ఛాంపియన్స్ లీగ్ సెమీఫైనల్స్‌లో ప్రవేశించింది. రొనాల్డో చేసిన గోల్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కామెంటేటర్ లెబ్రాన్ జేమ్స్ రొనాల్డోపై ప్రశంసల జల్లులు కురిపించాడు. ఈ ఫుట్‌బాల్ ప్లేయర్ ఏ గ్రహం నుంచి వచ్చాడు. అతడు గ్రహాంతరవాసి. లేకపోతే అతడికి ఈ విన్యాసాలు ఎలా సాధ్యమని అభిప్రాయపడ్డారు. గోల్‌కు సంబంధించి ఓ వీడియోను పోస్ట్ చేశారు. రొనాల్డోను 'డి స్టెఫానో 2.0'గా అభివర్ణిస్తున్నారు. దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ స్టెఫానో రాణించడంతో రియల్ మాడ్రిడ్ వరుసగా ఐదుసార్లు యూరోపియన్ కప్ సొంతం చేసుకుంది. మూడు యూరోపియన్ టోర్నీ ఫైనల్లో గోల్ చేసిన ఆటగాడిగానూ రొనాల్డో నిలిచాడు. గతంలో పక్షిలా గాల్లోకి ఎగురుతూ ఎన్నో కీలక మ్యాచ్‌ల్లో తన జట్టుకు గోల్స్ అందించిన విషయం తెలిసిందే. -
రొనాల్డో చేసిన గోల్ వీడియో..వైరల్!
-
యూరోప్ కింగ్స్
ప్రతిష్టాత్మక ‘చాంపియన్స్ లీగ్’ ఫుట్‌బాల్ టైటిల్‌ను రియల్ మాడ్రిడ్ క్లబ్ 11వ సారి సొంతం చేసుకుంది. ఇటలీలోని మిలాన్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో రియల్ మాడ్రిడ్ (స్పెయిన్) క్లబ్ ‘పెనాల్టీ షూటౌట్’లో 5-3తో అట్లెటికో మాడ్రిడ్ (స్పెయిన్) క్లబ్‌పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన రియల్ మాడ్రిడ్ జట్టుకు కోటీ 50 లక్షల యూరోలు (రూ. 111 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించింది. యూరోప్ దేశాల్లోని ఫుట్‌బాల్ క్లబ్ జట్ల మధ్య ఈ లీగ్ జరుగుతుంది.