'నిందితులకు తప్పకుండా శిక్ష పడుతుంది'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు నుంచి ఎవరూ తప్పించుకోలేరని.. నిందితులకు తప్పకుండా శిక్ష పడుతుందని రవాణా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మంత్రి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని.. ఏపీ మంత్రులే రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీటీసీలను ఏపీలో టీడీపీ కిడ్నాప్ చేయలేదా అని మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. అదే విధంగా తెలంగాణలో టీఆర్ఎస్ తప్ప ఏ పార్టీకి ఉనికి ఉండదని ఆయన చెప్పారు.