కళాకారులకు గుర్తింపు ఇవ్వాలి
యాచారం : గ్రామీణ కళాకారులకు గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి బోడ జగన్ అన్నారు. మంగళవారం యాచారంలోని సుందరయ్య భవన్లో జరిగిన సంఘం మహాసభ జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ టీవీలు, సీనిమాలు వచ్చిన ఈ రోజుల్లో కళాకారుల ప్రాముఖ్యత తగ్గిందన్నారు. అయినా కళాకారులు తమ బతుకు బాట కోసం కళారూపాలను ప్రదర్శిస్తూనే ఉన్నారని అన్నారు. తెలంగాణ ఉధ్యమంలో కళాకారులు తమ కళల ద్వారా చేసిన పోరాట గుర్తింపును పరిగణనలోకి తీసుకుని తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా యాచారం మండల ప్రజానాట్యమండలి కమిటీని ఎన్నుకున్నారు. సంఘం గౌరవాధ్యక్షులుగా వి.భూషణ్, అధ్యక్షుడిగా వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా ఎంజే వినోద్‌కుమార్, సహాయ కార్యదర్శులుగా స్వామి, నర్సింహ, ఉపాధ్యక్షులుగా పెంటయ్య, శ్రీను, కమిటీ సభ్యులుగా అనంద్, పెంటయ్య, ప్రవీణ్, శ్రీను తదితరులను ఎన్నుకున్నారు.