కళాకారులకు గుర్తింపు ఇవ్వాలి | Recognition should be given to artists | Sakshi
Sakshi News home page

కళాకారులకు గుర్తింపు ఇవ్వాలి

Published Tue, Jul 19 2016 7:22 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

Recognition should be given to artists


యాచారం : గ్రామీణ కళాకారులకు గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి బోడ జగన్‌ అన్నారు. మంగళవారం యాచారంలోని సుందరయ్య భవన్‌లో జరిగిన సంఘం మహాసభ జరిగింది. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ టీవీలు, సీనిమాలు వచ్చిన ఈ రోజుల్లో కళాకారుల ప్రాముఖ్యత తగ్గిందన్నారు. అయినా కళాకారులు తమ బతుకు బాట కోసం కళారూపాలను ప్రదర్శిస్తూనే ఉన్నారని అన్నారు. తెలంగాణ ఉధ్యమంలో కళాకారులు తమ కళల ద్వారా చేసిన పోరాట గుర్తింపును పరిగణనలోకి తీసుకుని తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా యాచారం మండల ప్రజానాట్యమండలి కమిటీని ఎన్నుకున్నారు. సంఘం గౌరవాధ్యక్షులుగా వి.భూషణ్‌, అధ్యక్షుడిగా వెంకటేష్‌, ప్రధాన కార్యదర్శిగా ఎంజే వినోద్‌కుమార్‌, సహాయ కార్యదర్శులుగా స్వామి, నర్సింహ, ఉపాధ్యక్షులుగా పెంటయ్య, శ్రీను, కమిటీ సభ్యులుగా అనంద్‌, పెంటయ్య, ప్రవీణ్‌, శ్రీను తదితరులను ఎన్నుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement