District Secretary
-
జాతీయ తైక్వాండో పోటీలకు లవకుమార్ ఎంపిక
కల్లూరు: జాతీయ తైక్వాండో పోటీలకు జిల్లాకు చెందిన వరిశెట్టి లవకుమార్ ఎంపికైనట్లు జిల్లా తైక్వాండో సంఘం ప్రధాన కార్యదర్శి శోభన్‌బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరంలో నిర్వహించిన 36వ రాష్ట్ర స్థాయి జూనియర్స్ తైక్వాండో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబచర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రం ఆనందపూర్సాహెబ్లో నిర్వహిస్తున్నట్లు 36వ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో లవకుమార్ పాల్గొంటారని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శిగా రాజునాయక్
వరంగల్ : కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శిగా ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామానికి చెందిన అజ్మీరా రాజునాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు నవీన్‌నాయక్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రాజునాయక్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ లేతాకుల సంజీవరెడ్డి, మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. -
వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శిగా రాంరెడ్డి నియామకం
సంగారెడ్డి టౌన్: వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శిగా బి.రాంరెడ్డిని నియమించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో ఆయన రాంరెడ్డికి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
కళాకారులకు గుర్తింపు ఇవ్వాలి
యాచారం : గ్రామీణ కళాకారులకు గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి బోడ జగన్ అన్నారు. మంగళవారం యాచారంలోని సుందరయ్య భవన్లో జరిగిన సంఘం మహాసభ జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ టీవీలు, సీనిమాలు వచ్చిన ఈ రోజుల్లో కళాకారుల ప్రాముఖ్యత తగ్గిందన్నారు. అయినా కళాకారులు తమ బతుకు బాట కోసం కళారూపాలను ప్రదర్శిస్తూనే ఉన్నారని అన్నారు. తెలంగాణ ఉధ్యమంలో కళాకారులు తమ కళల ద్వారా చేసిన పోరాట గుర్తింపును పరిగణనలోకి తీసుకుని తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా యాచారం మండల ప్రజానాట్యమండలి కమిటీని ఎన్నుకున్నారు. సంఘం గౌరవాధ్యక్షులుగా వి.భూషణ్, అధ్యక్షుడిగా వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా ఎంజే వినోద్‌కుమార్, సహాయ కార్యదర్శులుగా స్వామి, నర్సింహ, ఉపాధ్యక్షులుగా పెంటయ్య, శ్రీను, కమిటీ సభ్యులుగా అనంద్, పెంటయ్య, ప్రవీణ్, శ్రీను తదితరులను ఎన్నుకున్నారు. -
రుణమాఫీ కోరుతూ డ్వాక్రా మహిళల ధర్నా
ఆకివీడు : ఎటువంటి షరతులు లేకుండా డ్వా క్రా రుణాలను పూర్తిగా మాఫీ చేయూలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జిల్లా కార్యదర్శి జి.విజయలక్ష్మి డిమాండ్ చేశారు. మహిళా సంఘం ఆధ్వర్యంలో స్థానిక మండల సమాఖ్య కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలు గురువారం ధర్నా చేశారు. అనంతరం సమాఖ్య కార్యాలయంలో బైఠయించి చంద్రబాబు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. విజయలక్ష్మి మాట్లాడుతూ డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు హామీ ఇవ్వడంతో మహిళలు టీడీపీకి పట్టం కట్టారన్నారు. రుణమాఫీ చేస్తారని ఆశగా ఎదురుచూస్తే.. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. నేటికీ రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. సంక్షేమ, పెన్షన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారికి రుణమాఫీ వర్తించదనడం దుర్మార్గమన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీని అమలు చేయూలని డిమాండ్ చేశారు. ఐద్వా డివిజన్ శాఖ కార్యదర్శి డి.కల్యాణి మాట్లాడుతూ రుణమాఫీ కోసం ఆశతో ఎదురుచూస్తున్న డ్వాక్రా మహిళల పొదుపు ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయన్నారు. సభ్యులకు తెలియకుండానే పొదుపు సొమ్ముల్ని బ్యాం క్లు బకాయిలకు జమచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల అశలు వమ్ము అయితే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా మండల శాఖ అధ్యక్షులు దొడ్డి పద్మ, కార్యదర్శి బి.సత్యవతి, పట్టణ శాఖ అధ్యక్షులు యర్రా కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.