...ఆ సిఫారసు తిరస్కరించండి
కేపీసీసీ నియామకాలపై విపక్ష నేతల పట్టు
గవర్నర్కు వేర్వేరుగా విజ్ఞప్తి చేసిన శెట్టర్, కుమారస్వామి
బెంగళూరు : కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్సీ)కు అధ్యక్షుడితో పాటు సభ్యుల పేర్లను సిఫారసు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపి న నివేదికను తిరస్కరించాల్సిందిగా విపక్ష నేత లు జగదీష్ శెట్టర్, కుమారస్వామి వేర్వేరుగా డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సోమవారం గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాకు విజ్ఞ ప్తి చేశారు. రాజకీయ మూలాలు ఉన్నవారు, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారిని కేపీఎస్సీ వంటి సంస్థలకు అధ్యక్షులుగా, సభ్యులుగా నియమించకూడదని సుప్రీం కోర్టు నుం చి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు.
అయి తే ఇందుకు విరుద్ధంగా సిద్ధరామయ్య కేపీఎస్సీ సంస్థకు అధ్యక్షుడిగా కాంగ్రెస్పార్టీకు చెందిన సుదర్శన్తోపాటు సభ్యులుగా రాజకీయ మూ లాలతోపాటు క్రిమినల్ కేసులు ఉన్నవారి పేర్ల ను సిఫార్సు చేశారని ఆరోపించారు. వీరిని ఆ యా స్థానాల్లో నియమిస్తే కేపీఎస్సీలో అక్రమాలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశా రు. నియమాకాలకు సంబంధించి లోకాయుక్త లేదా మరేదైనా స్వతంత్రప్రతిపత్తి కలిగిన సంస్థ అధికారులతోకాని ప్రత్యేక ‘శోధనా కమిటీ’ వేయాలన్నారు. ఈ కమిటీ అందించే నివేదికను అనుసరించి కేపీఎస్సీ అధ్యక్షుడి నియామకాన్ని చేపట్టాలని సూచించారు.