Red carpet welcome
-
ఫ్రాన్స్‌లో మోదీకి రెడ్‌కార్పెట్
పారిస్: ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో రెడ్‌కార్పెట్ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన పారిస్ చేరుకున్నారు. ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బార్నీ ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి పూర్తి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. శుక్రవారం ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా మోదీ పాల్గొంటారు. అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో సమావేశమవుతారు. ‘‘పారిస్ చేరుకున్నా. భారత్–ఫ్రాన్స్ మధ్య మరింత సంబంధాలు బలపడేందుకు నా పర్యటన దోహదపడుతుందని భావిస్తున్నా’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్‌లోని భారతీయులతో భేటీ కాబోతున్నానని వెల్లడించారు. వారంతా ఆయన బస చేసిన హోటల్ బయట గుమికూడి ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. వారితో మోదీ ముచ్చటించారు. ప్రవాస భారతీయులు తమ నైపుణ్యాలు, కష్టించే తత్వంతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారని ప్రశంసించారు. ఈ పర్యటన నాకెంతో ప్రత్యేకం భారత్–ఫ్రాన్స్ ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి తన పర్యటనతో మరింత ఊపొస్తుందని మోదీ ఆశాభావం వెలిబుచ్చారు. ఫ్రాన్స్ బయల్దేరే ముందు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. రక్షణ భాగస్వామ్యంతోపాటు కీలక అంశాలపై ఆయనతో చర్చించబోతున్నానని వివరించారు. రాబోయే పాతికేళ్లలో ఇరు దేశాల బంధాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చిస్తామన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మాక్రాన్‌తో కలిసి పనిచేస్తామన్నారు. ఫ్రాన్స్ పర్యటన తనకెంతో ప్రత్యేకమని ఉద్ఘాటించారు. నేషనల్ డే పరేడ్‌లో 269 మంది జవాన్ల భారత బృందం పాలుపంచుకోనుంది. తర్వాత మోదీ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని అబూదాబీలో పర్యటిస్తారు. 26 రఫేల్ జెట్లు, 3 స్కారి్పన్ సబ్మెరైన్లు న్యూఢిల్లీ: నావికా దళం కోసం 26 రఫేల్ యుద్ధ విమానాలు, 3 స్కార్పిన్ జలాంతర్గాములను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసే ప్రతిపాదనలకు రక్షణ శాఖ గురువారం ఆమోద ముద్ర వేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని రక్షణ ఆయుధాల సేకరణ మండలి (డీఏసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుల విలువ రూ.85,000 కోట్ల దాకా ఉంటుందని అంచనా. వీటి రాకతో నావికాదళం మరింత బలోపేతం కానుంది. ప్రధాని మోదీ శుక్రవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీఅలో ద్వైపాక్షిక వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతంలో భాగంగా రఫేల్, స్కారి్పన్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంటారని సమాచారం. వైమానిక దళం కోసం ఫ్రాన్స్ నుంచి 36 ఫైటర్ జెట్లను భారత్ ఇప్పటికే కొనుగోలు చేసింది. -
ఆస్కార్ అకాడమీ సంచలన నిర్ణయం.. 60 ఏళ్ల సంప్రదాయానికి గుడ్‌బై
మరికొన్ని గంటల్లో ప్రపంచ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేడుక జరగబోతోంది. అయితే ఈ వేడుకపై టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆతృత కనబరుస్తున్నారు. దర్శకధీరుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ పేరు విశ్వవేదికపై మార్మోగనుంది. అయితే ఆస్కార్ వేదికపై నడవాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. ఎందుకంటే రెడ్ కార్పెట్‌పై నడవడాన్ని అరుదైన అవకాశంగా భావిస్తారు. కానీ ఈ ఏడాది ఆ రెడ్ కార్పెట్ వేదికపై కనిపించకపోవడం ఆశ్చర్యం కలిస్తోంది. 60 ఏళ్ల సంప్రదాయానికి చెక్ అయితే ఈసారి ఆస్కార్ వేడుకల్లో రెడ్ కార్పెట్ కనిపించడం లేదు. తొలిసారి రెడ్ కార్పెట్ కలర్‌ను మార్చేస్తున్నారు నిర్వాహకులు. ఈ ఏడాది షాంపైన్ కలర్లో స్వాగతం పలకనున్నారు. దాదాపు 60 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని ఈసారి బ్రేక్ చేయడం విశేషం. దీనికి కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. రంగు మార్చడం వెనుక ఉద్దేశంపై ఓ సీరియస్ జోక్ వేసింది అకాడమీ. ఓసారి అదేంటో తెలుసుకుందాం. విల్‌స్మిత్ చెంపదెబ్బే కారణం అయితే గతేడాది జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆస్కార్ అవార్డు వేడుకల్లో అత్యంత వివాదాస్పద ఘటన విల్‌స్మిత్ చెంపదెబ్బ. గతేడాది జరిగిన ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా వ్యాఖ్యాత క్రిస్‌రాక్ వ్యవహారశైలికి మండిపడ్డ విల్‌స్మిత్ వేదికపైనే ఆయనపై చేయి చేసుకున్నారు. ఆ సమయంలో వేదికపై ఉన్నవారితో పాటు, కోట్లాది మంది అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆ ఘటనను గుర్తు చేస్తూ కలర్ మార్చడంపై అకాడమీ వ్యంగ్యంగా స్పందించింది. అయితే ఈ ఏడాది ఆస్కార్ వేడుకకు హోస్ట్‌గా అమెరికన్ కామెడియన్ జిమ్మీ కిమ్మెల్ వ్యవహరిస్తున్నాడు. రెడ్ కార్పెట్ కలర్ మార్పుపై మాట్లాడుతూ. 'గత ఏడాది హాస్యనటుడు క్రిస్ రాక్‌ను విల్ స్మిత్ చెంపదెబ్బ కొట్టడంతో ఆస్కార్ అకాడమీ ఒక్కసారిగా ఎరుపెక్కింది. అందుకనే ఈ సంవత్సరం 60 ఏళ్ల సంప్రదాయాన్ని రెడ్ నుంచి షాంపైన్కు మారుస్తున్నాం. దీనివల్ల ఇక అలాంటి చెంపదెబ్బలు ఉండవని భావిస్తున్నాం.' అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. అప్పుడు అసలేం జరిగిందంటే.. కాగా గతేడాది విల్ స్మిత్ భార్య హెల్త్ గురించి హాస్యనటుడు క్రిస్ రాక్ జోక్ చేస్తూ మాట్లాడడం వివాదానికి దారితీసింది. దీంతో విల్‌స్మిత్ స్మిత్ కోపం వచ్చి క్రిస్ రాక్‌పై చెంపదెబ్బ వేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అకాడమీ.. విల్ స్మిత్‌పై పదేళ్లు బ్యాన్ కూడా విధించింది. అందువల్లే ఈ ఏడాది ఎలాంటి సంఘటనలు జరగకుండా అకాడమీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. (ఇది చదవండి: వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే..) నేనేమీ ఏడవడం లేదు: క్రిస్ రాక్ ఆ సంఘటన ఇప్పటికీ తనని బాధిస్తోందని ఇటీవల క్రిస్ రాక్ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ..'ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఏడాది కిందట నేను చెంపదెబ్బ తిన్నా. అందరి ముందు విల్ స్మిత్ నన్ను కొట్టాడు. ఆ సంఘటన మిమ్మల్ని బాధించిందా’ అని కొంతమంది నన్ను అడిగారు. ఇప్పటికీ నేను బాధపడుతున్నా. అయితే అందుకు నేనేమీ ఏడవడం లేదు.' క్రిస్ రాక్ చెప్పుకొచ్చాడు. -
బంగ్లాలో భారత రాష్ట్రపతికి ఘనస్వాగతం
ఢాకా: బంగ్లాదేశ్ స్వతంత్య్ర స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు ఢాకా వచ్చిన భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌కు బుధవారం ఘనస్వాగతం లభించింది. మూడురోజుల ఈ పర్యటనలో ఆయన బంగ్లా ప్రెసిడెంట్‌తో చర్చలు జరపనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌తో పాటు ఆయన సతీమణి, కూతురు, ఇతర అధికారులు బంగ్లా పర్యటనకు వచ్చారు. కోవింద్‌కు 21 తుపాకుల సెల్యూట్‌తో బంగ్లా ఆర్మీ స్వాగతం పలికింది. ఆ దేశ అధ్యక్షుడు సతీసమేతంగా విమానాశ్రయానికి వచ్చి కోవింద్‌కు ఆహా్వనం పలికారు. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లా విముక్తి పొందింది. చదవండి: మంత్రి మిశ్రా రాజీనామా ప్రసక్తే లేదు: బీజేపీ బంగ్లా విముక్తి యుద్ధంలో అసువులు బాసిన వీరులకు కోవింద్ నివాళులర్పించారు. అనంతరం ఆయన ముజిబుర్ రహ్మన్ మ్యూజియంను దర్శించారు. కోవిడ్ కల్లోలం తర్వాత రాష్ట్రపతి జరుపుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. డిసెంబర్ 16న కోవింద్ గౌరవార్ధం నేషనల్ పెరేడ్ గ్రౌండ్లో గెస్ట్ ఆఫ్ ఆనర్ నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని హసీనాతో రాష్ట్రపతి చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సహా పలు అంశాలను ఈ సందర్భంగా చర్చించారు. -
ఏపీ గవర్నర్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: జిల్లాల పర్యటన సందర్భంగా తనకు ఎర్ర తివాచీ స్వాగతం పలికే సంప్రదాయాన్ని పాటించవద్దని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించారు. ఈమేరకు మంగళవారం ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. బ్రిటిష్ వలసపాలనకు చిహ్నమైన ఎర్ర తివాచీ స్వాగతం సంప్రదాయాన్ని విడనాడాలని చెప్పారు. గవర్నర్ ఇటీవల శ్రీశైలం వెళ్లినప్పుడు సంప్రదాయం ప్రకారం జిల్లా అధికారులు ఆయనకు ఎర్ర తివాచీ స్వాగతం పలికారు. రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సిన కొన్ని అధికారిక కార్యక్రమాల్లో మినహా తన పర్యటనల్లో ఎక్కడా ఎర్రతివాచీ స్వాగత సంప్రదాయాన్ని పాటించవద్దని సూచించారు. -
కాన్స్‌లో మన క్వీన్స్
కాన్స్ ఫెస్టివల్ మళ్లీ తిరిగొచ్చింది. ఫ్రెంచ్ రివెరా నదీ తీరాన 72వ కాన్స్ చలన చిత్రోత్సవాలు మొదల య్యాయి. ప్రపంచవ్యాప్తంగా సినిమాలను సెలబ్రేట్ చేసుకునే పండగే కాన్స్. ఈ ఏడాది మే 14 నుంచి 25 వరకూ ఈ ఫెస్టివల్ జరుగుతుంది. సినిమాలతో పాటు కాన్స్ మెయిన్ అట్రాక్షన్ ఎర్ర తివాచీపై కనిపించే పొడుగు గౌన్లు. అందుకే దీన్ని పొడుగు గౌన్ల పండగ అని కూడా అనుకోవచ్చు. ‘ఐ కేన్’ అంటూ కాన్స్‌లో ప్రతీ హీరోయిన్ మీటర్ల కొద్దీ గౌన్లను ధరించడానికి రెడీ అవుతుంటారు. ఈ ఏడాది కాన్స్‌లో ఎర్ర తివాచీపై పొడవు గౌన్లతో దీపికా పదుకోన్, కంగనా రనౌత్, ఐశ్వర్యారాయ్, సోనమ్ కపూర్ కనిపించడానికి రెడీ అవుతున్నారు. తొలిసారి అందాల ప్రదర్శన చేయడానికి ప్రియాంకా చోప్రా, డయానా పెంటీ, హీనా ఖాన్ సిద్దమయ్యారు. వీరిలో దీపికా, కంగనా, ప్రియాంకలు కాన్స్ ఎర్రతివాచీపై హోయలొలికించారు. దీపికా, ప్రియాంక గౌనుల్లో దర్శనమిస్తే కంగనా మాత్రం కంచి పట్టు చీరలో కనువిందు చేశారు. -
ఒబామా భారత పర్యటన ప్రారంభం
-
ఒబామాకు.. మోడీ ఘన స్వాగతం
-
భారత్ చేరుకున్న ఒబామా దంపతులు
-
భారత్ వచ్చిన బరాక్ ఒబామా దంపతులు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా దంపతులు భారతదేశ పర్యటనకు వచ్చారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఉదయం 9.40 గంటల సమయంలో అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్ ల్యాండయింది. ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికేందుకు అధికారులు సర్వ సన్నాహాలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు ఎర్రటి శాలువా కప్పుకొని వచ్చారు. ద బీస్ట్ వాహనాన్ని నేరుగా విమానం వద్దకు తీసుకొచ్చారు. ఆ వెంటే ఒబామా భద్రతాధికారుల వాహనం కూడా ఉంది. భారతదేశంలో మూడు రోజుల పర్యటన కోసం అమెరికా ప్రథమపౌరుడు వచ్చిన విషయం తెలిసిందే. ఒకే పదవీ కాలంలో రెండుసార్లు భారత దేశ పర్యటనకు వచ్చిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. అలాగే, గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా వస్తున్న మొదటి అమెరికా అధ్యక్షుడు కూడా ఈయనే. -
కార్పొరేట్ లీడర్స్.. సైకిలింగ్
CEO RIDE: బయట అడుగు పెట్టాలంటే కారు.. అడుగడుగునా రెడ్‌కార్పెట్ స్వాగతాలు... ఎండ కన్నెరుగని జీవితాలు. వందల వేల కోట్ల రూపాయల టర్నోవర్ చేసే కంపెనీలకు సీఈఓలు. సైకిలింగ్‌కే సై అంటున్నారు. చమురు ధరలు పెరుగుతున్నాయనేమో అని భ్రమపడిపోకండి. వారు పైడిల్‌పై కాలెడుతున్నది సిటీలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు. నగరవాసులకు ఆరోగ్యంపై అవగాహను పెంచేందుకు. ఒక్కరు కాదు ఇద్దరు 200 మంది సీఈఓలు 45 నిమిషాల పాటు చేసే ఈ రేర్ సైకిల్ రైడ్‌కు నగరం వేదిక కాకనుంది. దీన్ని అట్లాంటా ఫౌండేషన్ నిర్వహిస్తోంది. కార్పొరేట్ లీడర్స్ ఇంత పెద్ద సంఖ్యలో ఒక ఈవెంట్లో పాల్గొనడం దేశంలోనే ప్రథమం కావడంతో ఈ ఈవెంట్‌కు క్రేజ్ ఏర్పడింది. హైటెక్ సిటీలోని రహేజా మైండ్‌స్పేస్ దగ్గర ఉన్న వెస్టిన్ హోటల్ నుంచి ఈ రైడ్‌ను శనివారం ఉదయం ఐటి శాఖా మంత్రి కెటిఆర్ ప్రారంభిస్తారు. దేశంలోనే వినూత్నంగా రూపొందిన ‘రైడ్ ఫర్ లైఫ్’ మేగ్‌జైన్‌ను ఆవిష్కరిస్తారు. రాజసాన్ని వీడి రహదారుల బాట పట్టిన సీఈఓల సైక్లింగ్ రైడ్ సూపర్‌హిట్ కావాలని, మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుందాం. - ఎస్బీ