ఎర్రకోటపై దాడికేసులో వ్యాపారవేత్తకు బెయిల్
న్యూఢిల్లీ : ఎర్రకోటపై దాడి కేసులో కశ్మీరీ వ్యాపారవేత్తకు బెయిల్ మంజూరైంది. 2000 సంవత్సరంలో ఎర్రకోటపై దాడి కేసులో ప్రమేయం ఉందనే కారణంతో కశ్మీర్‌కు చెందిన అహ్మద్ కావా(37) అనే వ్యాపారవేత్తను ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఢిల్లీ పోలీసులు, గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళ అధికారులు కలిసి ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనకు అడిషనల్ సెషన్స్ జడ్జి సిద్ధార్థ్ శర్మ బెయిల్ మంజూరు చేశారు.
అలాగే రూ. 50 వేల సొంత పూచీకత్తు, ష్యూరిటీ సమర్పించాలని షరతు విధించారు. ఎర్రకోటపై దాడి చేసిన లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులకు అహ్మద్ ఖావా బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు బదిలీ అయ్యాయి. ఈ కారణంతోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.