Red scandal workers
-
గరుడాద్రిలో పోలీసుల తనిఖీలు: 30 మంది అరెస్ట్
రేణిగుంట: గరుడాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఎర్రచందనం కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. అందిన ప్రాథమిక సమాచారం మేరకు గురువారం పోలీసులు గరుడాద్రి ఎక్స్‌ప్రెస్ రైల్లో రేణిగుంట వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 30 మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గుత్తిలో భారీగా ఎర్రచందనం స్వాధీనం
అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుత్తి టౌన్‌ప్లాజా వద్ద మంగళవారం ఉదయం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా టౌన్‌ప్లాజా వద్ద బెంగళూరుకు లారీలో అక్రమంగా తరలిస్తున్న భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు గుర్తించారు. అది గమనించిన 30 ఎర్రచందనం కూలీలు పోలీసులను చూసి పరారైనట్టు తెలుస్తోంది. ఎర్రచందనం కూలీలను వెంటాడి వారిలో 10 మందిని పోలీసులు పట్టుకున్నారు. ఎర్రచందనం లోడ్‌తో (కెఎ 07 7939) నెంబర్ గల లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శేషాచలంలో పోలీసులపై ‘ఎర్ర’ కూలీల దాడి
* తుంబురుతీర్థం మార్గంలో ఎనిమిది మంది కూలీల లొంగుబాటు * రూ.30 లక్షల విలువైన 20 దుంగల స్వాధీనం సాక్షి, తిరుమల : తిరుమల శేషాచలంలో శనివారం రెండు వేర్వేరు ఘటనల్లో ఎర్ర కూలీలు పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఈ సందర్భంగా కొందరు లొంగిపోగా మరికొందరు పరారయ్యారు. తుంబురు తీర్థం మార్గంలో.. తిరుమలలోని పాపవినాశం డ్యామ్ నుంచి ఉత్తరదిశలోని తుంబురు తీర్థం మార్గంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందన్న సమాచారంతో శనివారం టూటౌన్ పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులను చూసిన కూలీలు వారిపై రాళ్ల దాడికి దిగారు. ఎస్ఐ వెంకట్రమణ తన పిస్తోల్‌ను బయటకు తీయడంతో ఎనిమిది మంది కూలీలు లొంగిపోయారు. వారి నుంచి 300కిలోల బరువుగల 9 మేలిమి రకానికి చెందిన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.20 లక్షలు ఉంటుందని సీఐ రామలింగం తెలిపారు. లొంగిపోయిన వారిలో తమిళనాడుకు చెందిన సుందర్ (18), చంద్రశేఖర్ (18), తిరుపతి (18), దొరై (28), తంగరాజు (30), అశోక్ (28), కుమార్(28), శంకర్ (30) ఉన్నారు. కేపీ డ్యామ్.. మామిళ్లమంద ప్రాంతంలో.. తిరుమలలోని కేపీ డ్యామ్, మామిళ్ల మంద ప్రాంతంలో టాస్క్ఫోర్సు, అటవీశాఖ సిబ్బంది శుక్రవారం రాత్రి నుంచి కూంబింగ్ చేపట్టారు. శనివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను తీసుకెళుతున్న కూలీలను గమనించారు. వారిని పట్టుకునేందుకు టాస్క్ఫోర్సు సిబ్బంది ప్రయత్నించగా రాళ్లు, ఆయుధాలతో దాడికి ప్రయత్నించి అడవిలోకి పారిపోయారు. కూలీలు వాడిన ఆయుధాలు, రూ.10 లక్షల విలువ కలిగిన 11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ఫోర్సు ఆర్ఎస్ఐ లక్ష్మణ్, డీఆర్వో వెంకటస్వామి తెలిపారు. -
గిరిజనులకు అన్యాయం జరిగితే సహించం
► జాతీయ ఎస్టీ కమిషన్ వైస్ చైర్మన్ రవిఠాకూర్ ► ఎన్‌కౌంటర్‌పై అధికారులతో సమీక్ష ► రవిఠాకూర్కు వివరించిన ఉన్నతాధికారులు తిరుపతి తుడా : గిరిజనులకు అన్యాయం జరిగితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని జాతీయ ఎస్టీ కమిషన్ వైస్ చైర్మన్ రవిఠాకూర్ పేర్కొన్నారు. ఈ నెల 7న తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ఎస్టీలపై ఆయన సంబంధిత అధికారులతో ఆర్డీవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపినాథ్‌జట్టి, డీఎఫ్‌వో శ్రీనివాసులు, టాస్క్‌ఫోర్స్ ప్రతినిధి బీఎన్ మూర్తి, ఆర్డీవో వీరబ్రహ్మయ్య హాజరయ్యారు. ఎన్‌కౌం టర్లో చనిపోయిన ఎస్టీల తెగలకు చెం దినవారి కుటుంబాల ఫిర్యాదుల మేరకు అధికారులను ప్రశ్నల వర్షం కురిపించి నట్టు సమాచారం. ఎన్కౌంటర్ జరిగిన తీరుపై ఆయన ఆరాతీశారు. కూలీలు రాకుండా ఎలాంటి చర్యలు చేపట్టారని ఆరా తీశారు. బాధిత కుటంబాలను త మిళనాడు, ఏపీల నుంచి ఎలాంటి సహా యం అందించాలనే విషయంపై చర్చిం చారు. పోలీసులు, ఫారెస్ట్ అధికారులు రవిఠాకూర్ ప్రశ్నలకు కూలంకుషంగా వివరాలు చెప్పినట్టు తెలసింది. ఇప్పటి వరకు దాదాపుగా 10వేల మందిని అరె స్టు చేసినట్టు ఎస్పీ గోపినాథ్‌జట్టి చెప్పా రు. శేషాచలం ప్రాంతంలో ప్రవేశం నిషేధం ఉందని, ఎర్రచందనం స్మగ్లింగ్ పాల్పడితే చర్యలు ఉంటాయని తమిళనాడు ప్రాంతంలో ప్రచారం చేసినట్టు వివరించినట్టు సమాచారం. డీఎఫ్‌వో శ్రీనివాసులు వివరిస్తూ గతంలో ఎర్ర స్మగ్లర్లు, కూలీలు ఫారెస్ట్, పోలీసులపై దాడులక ు తెగబడ్డారని వివరించారు. అధికారులు వారి దాడుల్లో చనిపోయిన సంఘటలను వివరించారు. అప్పటి పే పర్ కటింగ్లను ఎస్టీ కమిషన్ వైస్ చైర్మన్‌కు చూపించారు. ఎర్ర కూలీలు రాకుండా చేపట్టిన చర్యలను వివరించారు. కూలీలు రాకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు రవిఠాకూర్ ఆదేశించారు. సాంఘిక సంక్షేమశాఖ డీడీ ధనంజయరావు, గిరిజన సంక్షేమాధికారి కృష్ణానాయక్ పాల్గొన్నారు. -
28మంది ఎర్రచందనం కూలీలు అరెస్ట్
చిత్తూరు: జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ యద్ధేచ్చగా కొనసాగుతోంది. స్మగ్లింగ్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉంది. ఈ చర్యలో భాగంగానే చిత్తూరు జిల్లా కుప్పంలో అక్రమంగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న 28మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపత్తూరు నుంచి బాకరాపేటకు వస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.