బాలకృష్ణ... రెడ్డిగారు?
రజనీకాంత్ ‘నరసింహ’ దర్శకుడు కేఎస్ రవికుమార్‌తో ‘నరసింహనాయుడు’ బాలకృష్ణ చేయబోతున్న సినిమాకు ‘రెడ్డిగారు’ టైటిల్ కన్ఫర్మ్ చేసినట్టు ఫిల్మ్‌నగర్ టాక్. ‘సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి’... ఆల్రెడీ రెండుసార్లు రెడ్డిగా బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ రెండూ ఫ్యాక్షన్ సినిమాలే.
సి. కల్యాణ్ నిర్మించనున్న తాజా సినిమా కూడా ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందట. ఈ సినిమా సంగతి పక్కన పెడితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘భవ్య’ ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా చిత్రీకరణ నిమిత్తం ప్రస్తుతం బాలకృష్ణ పోర్చుగల్‌లో ఉన్నారు. గత గురువారం యూనిట్ అక్కడికి వెళ్లింది. నలభై రోజుల పాటు కీలక సన్నివేశాలు, పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్ తీయనున్నారు. ఈ గ్యాంగ్‌స్టర్ మూవీకి ‘ఉస్తాద్’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారట.