వివాహితపై అత్యాచారం.. హత్య
చిత్తూరు జిల్లా మదనపల్లి రూరల్ పరిధిలోని పైరాసిపెంట గ్రామ పొలాల్లో ఓ వివాహిత అత్యాచారం, హత్యకు గురైంది. మృతదేహం దెబ్బతిన్న పరిస్థితుల్లో ఉండగా ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తెలిపిన సమాచారం మేరకు .. మృతురాలు.. పైరాసిపెంటకు చెందిన భాగ్యమ్మ (29)గా గుర్తించారు. చౌడేపల్లి మండలం మర్రిమాకులపల్లిలోని తల్లిగారింటికి వెళ్లిన ఆమె నాలుగు రోజుల క్రితం పైరాసిపెంటకు బయల్దేరగా... ఆమెకు సన్నిహితంగా ఉండే రెడ్డి రాజశేఖర్ ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.