ఇలా చేయండి..బిల్లు తగ్గించండి
ప్రతి ఇంటా విద్యుత్ వినియోగం తప్పనిసరి. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు కరెంటు వాడకం ఎంతో అవసరం. దీంతో రోజురోజుకూ ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి పైసాను పొదుపు చేస్తే సంపాదించినట్లే. ఈ విషయం విద్యుత్‌కు కూడా వర్తిస్తుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎంతో విద్యుత్ ఆదా అవుతుంది. తద్వారా బిల్లుల భారంకూడా తగ్గుతుంది. - సాక్షి, ఆదిలాబాద్
ఫ్యాన్ వినియోగంలో ..
{బాండెడ్ కంపెనీల ఫ్యాన్లనే వాడాలి.
గదిలో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేయాలి.
ఫ్యాన్ తిరిగేటప్పుడు శబ్దం ఎక్కువగా వస్తే బేరింగులు దెబ్బతిన్నట్లు గమనించాలి. వెంటనే రిపేర్ చేయించాలి.
చౌక ధరలకు దొరికే ఫ్యాన్లను వాడకూడదు.
కిటికిటీలు, తలుపులు తెరిచి ఉంచితే ఫ్యాన్ల అవసరం అంతగా ఉందడు.
ఐరన్ బాక్స్ వాడకంలో..
టీవీ చూస్తూ, కబుర్లు చెపుతూ ఇస్త్రీ చేస్తే బిల్లు అధికంగా వచ్చే అవకాశం ఉంది.
ఐరన్ బాక్స్ కొనేటప్పుడు తక్కువ బరువు, ఆటోమెటిక్‌గా పని చేసే వాటిని ఎంపిక చేసుకోవాలి.
ఇస్త్రీ మధ్యలో ఆపి చేయటం వల్ల వేడి వృథా అవుతుంది.
ఎలక్ట్రిక్ కుక్కర్
వంట చేసేటప్పుడు వార్మ్లో పడగానే స్విచ్ ఆపేసిన అన్నం ఉడుకుతుంది.
విద్యుత్ కుక్కర్ కంటే గ్యాస్ స్టౌవ్‌పై అన్నం వండితే ఖర్చు తగ్గుతుంది.
కుక్కర్ మూత పగిలితే చాలా మంది ప్లేట్లు వాడతారు. ఆవిరి నష్టం ఎక్కువై కరెంటు వినియోగం అధికమవుతుంది. తద్వారా బిల్లు భారం అవుతుంది.
వాషింగ్ మిషన్ వాడకంలో..
{yయ్యర్ సౌకర్యాన్ని వాడకుండా బట్టలను బయట ఆరవేస్తే విద్యుత్ ఆదా అవుతుంది.
లోడ్‌కు సరిపడ బట్టలున్నప్పుడే వాషింగ్ మిషన్‌ను వాడాలి.
ఇంట్లో వాడే పరికరాలన్ని ఐఎస్ఐ మార్క్ కల్గి ఉండాలి.
లైట్ల వాడకంలో...
ట్యూబ్‌లైట్లు, కంపాక్ట్ ఫ్లూరోసెంట్ బలుబులే వాడాలి, పగలు వీలైనంత వరకు లైట్లను వినియోగించరాదు.
కిటికీలు తలుపులు తీసి ఉంచితే వెలుతురు వస్తుంది.
లైట్లను నెలకొక సారి తడిగుడ్డతో తుడిస్తే కాంతివంతంగా వెలుగుతాయి.
40 వాట్ల ఫిలమెంట్ బల్బు ఇచ్చే వెలుతురును 15 వాట్ల కంపాక్ట్ బల్బులు ఇస్తాయి.
గీజ ర్ వాడకంలో..
గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే కరెంటు వినియోగం తగ్గుతుంది.
గీజర్ కంటే సోలార్ వాటర్ హీటర్ వాడితే విద్యుత్ ఆదా చేసుకోవ చ్చు.
అందరు వెనువెంటనే స్నానం చేస్తే గీజ ర్ను ఎక్కువ సేపు ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు. కరెంటు వినియోగం తగ్గుతుంది.
ఫ్రిజ్ వాడకంలో
డోర్‌ను సాధ్యమైనంత వరకు తక్కువ సార్లు తీయాలి.
ఒక్కసారి డోర్ తెరిస్తే అరగంట కూలింగ్ పోతుంది.
{ఫిజ్ పై ఎండ పడకుండా చూసుకోవాలి.
{ఫిజ్ వెనక భాగానా గాలి తగిలేలా చూసుకోవాలి.
గది చల్లబరచడానికి కొందరు ఫ్రిజ్ డోర్ తీస్తారు. ఇది సరైంది కాదు.