కల్తీకి తావివ్వకుండా పాల సరఫరా
సాక్షి, బెంగళూరు : గత పదిహేనేళ్లుగా పాల సరఫరా రంగంలో సేవలందిస్తున్న తమ సంస్థ ఎటువంటి కల్తీకి తావివ్వకుండా పాలను సరఫరా చేస్తూ వస్తోందని దొడ్ల డెయిరీ సేల్స్ విభాగం రీజనల్ మేనేజర్ జే.డి.ఎజ్రా వెల్లడించారు. రాష్ట్రంలో పాలను సరఫరా చేస్తున్న కొన్ని ప్రైవేటు డెయిరీలు నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదంటూ కొన్ని పత్రికల్లో (సాక్షి కాదు) వచ్చిన కథనాలపై ఆయన పైవిధంగా స్పందించారు. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సవూవేశంలో పలమనేరులోని దొడ్ల డెయిరీ ప్లాంట్ మేనేజర్ విశ్వనాథ్ రెడ్డితో కలిసి జే.డి.ఎజ్రా వ ూట్లాడారు. నగరంలో పాలను సరఫరా చేస్తున్న ప్రైవేటు డెయిరీల్లో తమ సంస్థ నుంచే ఎక్కువ పాలు నగరంలో అమ్ముడవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 55 పాల చిల్లింగ్ కేంద్రాలను కలిగి ఉన్న తమ సంస్థ రోజుకు 8.5 లక్షల లీటర్ల పాలను ప్రాసెసింగ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పారు.