Registrar post
-
రిజిస్ట్రార్ గదికి తాళం.. తెయూలో వివాదం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ పదవి విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. సోమవారం రిజిస్ట్రార్ యాదగిరి గదికి తాళం వేసి ఉంచడంతో గందరగోళం నెలకొంది. దీనిపై రిజిస్ట్రార్ యాదగిరి ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ కమిషనర్ నవీన్‌మిట్టల్‌కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. వర్సిటీలో ఉదయం అన్ని విభాగాలు, చాంబర్లకు సెక్యూరిటీ సిబ్బంది తాళాలు తెరిచారు. రిజిస్ట్రార్ చాంబర్ మాత్రం తెరవద్దని వైస్ చాన్స్‌లర్ పీఏ సవిత చెప్పడంతో తెరవకుండానే ఉంచారు. అక్కడకు వచ్చి న రిజిస్ట్రార్ విషయాన్ని పాలకమండలి సభ్యులకు చెప్పడంతో వారు వీసీకి ఫోన్ చేశారు. దీంతో మధ్యాహ్నం 1.30 గంటలకు తాళం తీయడంతో సిబ్బంది వెళ్లి కూర్చున్నారు. రిజిస్ట్రార్ మాత్రం చాంబర్‌కు రాలేదు. ప్రభుత్వం చెబితేనే రిస్ట్రాస్టార్‌గా వచ్చా.. ప్రభుత్వం, పాలకమండలి చెబితేనే రిస్ట్రాస్టార్‌గా వచ్చానని, సమస్య పరిష్కారం చేస్తేనే బాధ్యతలు స్వీకరిస్తానని యాదగిరి ‘సాక్షి’కి తెలిపారు. తనను లొంగదీసుకునే ఉద్దేశంతోనే వీసీ ఇలా చేశారని ఆరోపించారు. కాగా తాళం వేసిన విషయమై వీసీ రవీందర్‌గుప్తాను ‘సాక్షి’ప్రశ్నించగా, తాను తాళం వేయించలేదని, అలా చేస్తే తాళానికి సీల్ వేసి, లెటర్ విడుదల చేసేవాడినన్నారు. వీసీ గా ఉన్న తన అనుమతి లేకుండానే ఈసీ సభ్యులు యాదగిరిని రిజిస్ట్రార్‌గా నియమించ డం చెల్లదన్నారు. తాను రిజిస్ట్రార్‌గా పెట్టిన విద్యావర్థినిని బయటకు పంపి యాదగిరిని ఎలా నియమిస్తారన్నారు. తెయూలోనూ ఇతర ప్రొఫె సర్లు ఉన్నప్పటికీ తనకు నచ్చని యాదగిరిని నియమించారని, తాను ఆర్డర్ ఇవ్వకుండా యాదగిరి ఎలా బాధ్యతలు తీసుకుంటారని వీసీ అన్నారు. తెయూ వీసీని సస్పెండ్ చేయాలని గవర్నర్‌కు ఫిర్యాదు తెయూ వీసీపై వచ్చి న ఆరోపణలపై విచారణ కమిషన్ లేదా రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ నేత దినేశ్ కులాచారితో పాటు పలువురు వర్సిటీ విద్యార్థులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత వీసీ 2021మేలో పదవి చేపట్టాక పరిపాలన, ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు సోమ వారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైకి వినతిపత్రం సమర్పించారు. -
తాను తవ్వుకున్న గోతిలో తానే.. విద్యార్థినిపై లైంగిక వేధింపులు, ఆపై
సాక్షి, చెన్నై: పెరియార్ వర్సిటీ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ గోపీని సోమవారం సాయంత్రం సేలం సూర మంగళం పోలీసులు అరెస్టు చేశారు. ఓ విద్యార్థిని లైంగికంగా వేధించడమే కాకుండా, ఆమెకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసి ఆయన అడ్డంగా బుక్కయ్యాడు. వివరాలు.. సేలం పెరియార్ వర్సిటీలో ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా గోపీ పనిచేస్తున్నారు. ఆదివారం పరిశోధక ఓ విద్యార్థినిని వర్సిటీలోని తన చాంబర్‌కు రావాలని ఆయన ఆదేశించాడు. అక్కడికి వచ్చిన ఆ విద్యార్థిని కాసేపటి తర్వాత మౌనంగా బయటకు వెళ్లి పోయింది. అయితే, ఆ విద్యార్థినిపై సాయంత్రం ఆయన సూర మంగళం పోలీసు స్టేషన్లో ఓ ఫిర్యాదు చేశాడు. అధిక మార్కులతో పాటుగా త్వరితగతిన డిగ్రీ దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తన బంధువుల ద్వారా ఆ విద్యార్థిని దాడి తనపై చేయించినట్టు ఆరోపించాడు. అంతే కాకుండా, రాత్రి ఓ ప్రైవేటు ఆస్పత్రిలోనూ అడ్మిట్ అయ్యాడు. సోమవారం ఉదయాన్నే పోలీసులు సంబంధిత విద్యార్థిని పిలిపించి విచారించగా రిజిస్ట్రార్ బండారం బయట పడింది. చాంబర్‌కు పిలిపించి తనపై లైంగిక దాడికి ప్రయత్నించినట్లు, తాను బయటకు చెప్పుకోలేక మౌనంగా ఉండి పోయినట్లు ఆ విద్యార్థిని ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు. ఆ విద్యార్థినితో పోలీసులే ఫిర్యాదు చేయించారు. అలాగే, గోపీతో పాటుగా ఆదివారం వర్సిటీలో విధుల్లో ఉన్న సిబ్బంది, సహచర విద్యార్థుల్ని పోలీసులు విచారించారు. గోపీ బండారం బయట పడడంతో ఆయన్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. కాగా, చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు పోలీసుల్ని ఆశ్రయించిన నాటకం ఆడిన రిజిస్ట్రార్ గోపీ.. చివరకు తాను తవ్వుకున్న గోతిలోనే పడ్డారని పలువురు వాఖ్యానించారు. -
నేనే రాణి–నేనే మంత్రి
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్న తిరుపతిలోని ఎస్వీయూలో ఒక మహిళకు ఉన్నత పదవి దక్కింది. అయితే ఆ అరుదైన అవకాశం పొందిన ఆ అధికారి అనతి కాలంలోనే తన ప్రవర్తన, అహంకారం, అధికార దర్పంతో వర్శిటీ ప్రతిష్ట మసకబారేలా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె అధికార పార్టీ మాజీ ఎమ్మెల్యే కోడలు కావడం, ఆర్థిక, సామాజిక, రాజకీయ బలం తోడు కావడంతో ఎస్వీయూలో ఆమెకు ఎదురులేకుండా పోయింది. అనేక ఆరోపణల నడుమ మాజీ రిజిస్ట్రార్ దేవరాజులు పదవి కోల్పోవడంతో 2017లో అప్పటి వీసీ దామోదరం హోంసైన్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆర్కే అనురాధకు రిజిస్ట్రార్ పదవిని కట్టబెట్టారు. ఆమె రిజిస్ట్రార్ అయిన తొలిరోజుల్లో బాగా పని చేసినా అనంతరం పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దొడ్డిదారిన అందలం... శ్రీ వెంకటేశ్వరా యూనివర్శిటీ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ ఆర్కే అనురాధ 2007లో హోంసైన్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. 2006లో ఎస్వీయూలో విడుదలైన అధ్యాపక పోస్టుల భర్తీకి ఆమె అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవంగా ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే సంబంధిత సబ్జెక్ట్‌లో ఎంఎస్సీ, పీహెచ్‌డీతో పాటు 5 సంవత్సరాల బోధన అనుభవం ఉండాలి. ఈ సర్వీసు రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసి ఉంటేనే చెల్లుబాటు అవుతుంది. అయితే ఆమె ఎస్వీయూ, మహిళా వర్శిటీలో తాత్కాలికంగా పనిచేసిన బోధన అనుభవానికి సంబంధించి నకిలీ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకున్నారని, ఈ నియామకాలకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన (స్క్రూటినీ)లో ఆమె దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు రాశారు. అయితే ఆమె చేసిన ఫైరవీలు ఫలించడంతో అదే దరఖాస్తుపై ఎలిజిబుల్ అని రాశారని అంతే కాకుండా దీనికి జతపరచిన బోధన అనుభవం సర్టిఫికెట్లో తేదీ లేకుండా జారీ చేశారు. ఈ ధృవ పత్రాలతో నేరుగా అసోసియేట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. 2013లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందటంతో పాటు 2017 నవంబర్ 30న ఎస్వీయూ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. ఆంతా ఆమె ఇష్టమే... ఎస్వీయూ రిజిస్ట్రార్ అనురాధ వీసీలను, వారి ఆదేశాలను పాటించకుండా, వారు ఆమోదించిన ఫైళ్లను పక్కన పెట్టి తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఆమె రిజిస్ట్రార్ అయ్యాక ఇద్దరు వీసీలు మారారు. ప్రొఫెసర్ దామోదరం వీసీగా ఉన్న సమయంలో ఉద్యోగుల బదిలీల ఫైళ్లను పక్కన పెట్టి అమలు చేయలేదు. ఆయన ఆమోదించిన రసాయన శాస్త్ర విభాగాధిపతి ఫైల్‌ను పెండింగ్‌లో ఉంచి నూతన వీసీ వచ్చాక తన సామాజిక వర్గ ప్రొఫెసర్‌కు ఆ పోస్టు కట్టబెట్టారు. రాజీవ్ గాంధి కాన్పరెన్స్ హాల్ నిర్మాణ టెండర్ల ఫైల్‌ను వీసీ ఓకే చేసినా ఇప్పటికీ అమలుచేయలేదు. అంబేడ్కర్ గ్లోబల్ లా కళాశాలకు శాశ్వత అనుబందానికి సంబంధించిన ఫైల్ వీసీ దామోదరం ఆమోదించినప్పటికీ .. రిజిస్ట్రార్ నేటికీ ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇన్చార్జ్ వీసీగా జానకి రామయ్య హయాంలో ఉద్యోగి ఫైల్ ట్యాంపరింగ్ కేసులో ఆయన వేసిన విచారణ కమిటీ ఇచ్చిన ఫైల్‌ను తొక్కిపెట్టారు. సైకాలజీ విభాగాధిపతిగా ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డికి ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చారు. వివాదాస్పద నిర్ణయాలు... ఎస్వీయూ రిజిస్ట్రార్‌గా తన 18 నెలల పాలనలో పలు వివాదస్పద నిర్ణయాలను తీసుకున్నారు. అకడమిక్ స్టాప్ కళాశాలలో అసోసియేట్‌గా పనిచేస్తున్న కోదండరామిరెడ్డికి ప్రొఫెసర్‌గా పదోన్నతి ఇవ్వలేదు. అదే విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వెంకటరమణకు మాత్రం పదోన్నతి కల్పించారు. ఏడుగురు టైం స్కేల్ ఉద్యోగులను తొలగిస్తూ గత నెలలో 22న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉద్యోగుల ఆందోళనతో వీసీ ఈ ఉత్తర్వులు రద్దు చేశారు. ఆంత్రొపాలజీ విభాగంలో ఒక అధ్యాపకుడికి 13 సంవత్సరాలు, అడల్ట్ ఎడ్యుకేషన్ విభాగంలో మరో అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు 6 సంవత్సరాలు పాత సర్వీసు కలిపారు. ఈ వ్యవహారంలో ఫైల్ ట్యాంపరింగ్ చేసిన ఉద్యోగిపై చర్యలు తీసుకోలేదు. ఎన్ఎంఆర్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఎంటీఎస్ ఇవ్వాలని ప్రభుత్వం జీఓ ఇచ్చినా అమలు చేయలేదు. అంతే కాకుండా వీరిని వచ్చే ఏడాదికి కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఉన్నత విద్యాశాఖ ఇటీవల రిజిస్ట్రార్ల సమావేశంలో ఆదేశించినా అమలు చేయలేదు. తన స్వంత సామాజిక వర్గానికి చెందిన కొందరు అధ్యాపకులకు పెద్ద ఎత్తున మేలు చేశారన్న విమర్శలు ఉన్నాయి. పట్టించుకోని వీసీ ఎస్వీయూ రిజిస్ట్రార్ అనురాధ వ్యవహారంలో అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రస్తుత వీసీ రాజేంద్రప్రసాద్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతే కాకుండా ఆమె ఎక్కువ సమయం వీసీ చాంబర్లోనే తిష్ట వేస్తుండటంతో చాలా మంది తమ సమస్యలు చెప్పుకోలేక పోతున్నారు. వీసీని నిర్ణయాలు తీసుకోకుండా పెత్తనం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. సమాచారహక్కు చట్టంతో రహస్యం బట్టబయలు... ఎస్వీయూ రిజిస్ట్రార్ నియామకంపై కొందరు విద్యార్థి నాయకులు సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరడంతో అమె అడ్డదారి నియామకం బయట పడింది. దీనిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘ నాయకులు గత నెల 30న అమరావతిలో సీఎంను కలిసి ఫిర్యాదు చేశారు. అంతకు ముందు వారు ఎస్వీయూ వీసీ రాజేంద్రప్రసాద్‌తో పాటు ఉన్నత విద్యామండలిలోని ముఖ్య అధికారులను కలసి ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఆమెపై చర్యలు తీసుకోలేదు. స్పందించని రిజిస్ట్రార్ ఎస్వీయూలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై రిజిస్ట్రార్ అనురాధను వివరణ కోరేందుకు సాక్షి ప్రయత్నించింది. అయితే ఆమె ఫోన్ తీయలేదు. వేరొక నెంబర్ నుంచి ఫోన్ చేసి సాక్షి రిపోర్టర్‌ను మాట్లాడుతున్నాను అని చెబుతుండగానే ఆమె ఫోన్ కట్ చేసేశారు. -
సమర్థతే గీటురాయి..!
ఎచ్చెర్ల : వర్సిటీలో రిజిస్ట్రార్ పోస్టు అనేది కీలకమైంది. రిజిస్ట్రార్లకు నితంతరం వత్తిళ్లు...పని భారం ఉంటుంది. ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి సమర్థత,నైపుణ్యం, సానుకూల ధృక్పథం, సమయానుకూల ఆలోచనా ధోరణి అవసరం. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వడ్డాది కృష్ణ మోహన్, తనదైన శైలిలో పని చేస్తూ సమర్థతే గీటురాయిగా మందుకు సాగుతూ గుర్తింపు పొందారు. రిజిస్ట్రార్‌గా ఐదేళ్లు పూర్తి చేసుకొని ఆరో ఏట అడుగుపెట్టారు కృష్ణ మోహన్.నలుగురు వైస్ ఛాన్సలర్లు దగ్గర పనిచేసిన ఘనత వర్సిటీలో 2008 జూన్ 25న ఏర్పడ గా, ఇప్పటి వరకు ఇక్కడ నలుగురు వీసీలు పని చేశారు. ఇందులో ఇద్దరు ఇన్‌ఛార్జి వీసీలు, మరో ఇద్దరు రెగ్యులర్ వీసీలు. రిజిస్ట్రార్‌ను ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయాల పర్యవేక్షణ అభివృద్ధి మండలి అనుమతితో వైస్ ఛాన్సలర్ నియమిస్తారు.వర్సిటీ ఏర్పడ్డాక మొదటి రిజస్ట్రార్‌గా మొదటి వీసీ ఎస్వీ సుధాకర్ ఏయూ సీనియర్ జువాలజీ ప్రొఫెసర్ జి.జ్ఞానమణిని 2008 ఆగస్టు 25న నియమించారు. 2009 ఆగస్టు 25కి ఏడాది ముగిసిన తరువాత మరో సారి ఆయనను కొనసాగించకపోవడంతో రిలీవ్ అయ్యారు.అనంతరం అప్పటి ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్యకు ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా అవకాశం ఇచ్చారు. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఈయన ఇన్ఛార్జిగా కొనసాగారు.అనంతరం 2 009 సెప్టెంబర్ 16న ఆంధ్రాయూనివర్సిటీలోని కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్‌ను రిజిస్ట్రార్‌గా అప్పటి వీసీ ఎస్వీ సుధాకర్ సిఫారసుతో ప్రభుత్వ నియమించింది. అప్పటి నుంచి ఈయన కొన సాగుతున్నారు. ఎస్వీ సుధాకర్ తరువాత ఇన్‌ఛార్జి వీసీలు వై.సత్యనారాయణ, ఆర్జీబీ భగవత్ కుమార్ సైతం ఈయననే కొనసాగించారు.ఒక దశలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి రిజిస్ట్రార్‌గా వెళ్లిపోతున్నారన్న ప్రచారం జరిగింది. ప్రస్తుత వీసీ హెచ్.లజపతిరాయ్ కృష్ణమోహన్ సమర్థతను గుర్తించి ప్రోత్సహించడంతో ఐదేళ్లు రిజిస్ట్రార్‌గా పూర్తి చేసుకుని ఘనత వహించారు. అడ్డంకులను,రాజకీయ వత్తిళ్లను అధిగమించి కృష్ణమోహన్ రిజిస్ట్రార్‌గా మంచి పనితీరుతో అందరి ప్రశంసలు పొందుతున్నారు. 2011 సెప్టెంబర్ 16న పదవీకాలం మూడేళ్లు పూర్తి కావడంతో ఇక్కడి నుంచి రిజిస్ట్రార్‌ను సాగ నంపాలని, స్థానికులకు అవకాశం ఇవ్వాలని కొందరు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు.అయినా అప్పటి ఇన్‌ఛార్జి వీసీ వై.సత్యనారాయణ రిజస్ట్రార్‌గా కృష్ణ మోహన్‌ను తాత్కాలిక ఉత్తర్వులతో కొనసాగించారు. 2012 ఆగస్టు 29న మాకుమ్మడిగా స్థానికులు రిజస్ట్రార్‌ను మార్పు చేయాలని అప్పటి ఇన్‌ఛార్జి వీసీ భగవత్ కుమార్‌కు వినతి పత్రం ఇచ్చినా ఇన్‌ఛార్జి హోదాలో మార్పు చేయనని స్పష్టం చేశారు. 2011లో ఉత్తమ అధ్యాపక అవార్డు వర్సిటీ విభాగంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ తరుఫున 2011లో ఉత్తమ అధ్యాపక అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి కూడా కృష్ణమోహన్ కావటం గమనార్హం. 2012లో జి.తులసీరావు, 2013లో ఎం.చంద్రయ్య, 2014లో పి.చిరంజీవులు ఈ అవార్డులు స్వీకరించారు. ఆనందంగా ఉంది వర్సిటీ అభివృద్ధిలో భాగస్వామిని అయినందుకు ఆనందంగా ఉంది. వర్సిటీని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యం.ఇప్పటికే ప్రభుత్వం కావల్సినంత స్థలం కేటాయించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రూ.18 కోట్ల భవనాలు నిర్మాణం పూర్తయితే వసతి కొరత పూర్తిగా తీరిపోతుంది.కొత్త కోర్సులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. వన్ జీబీ ఇంటర్నెట్ వంటి సౌకర్యాం అందుబాటులోకి వచ్చింది. వర్సిటీలోని అన్ని విభాగాలను బలోపేతం చేయటమే లక్ష్యం. - ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్,రిజిస్ట్రార్