Rehana Begam
-
AP : సమాచార హక్కు కొత్త కమిషనర్ల ప్రమాణం
విజయవాడ, 11 మార్చి: రాష్ట్ర సమాచార కమీషన్‌కు నియమించబడిన ముగ్గురు నూతన కమీషనర్లు చావలి సునీల్, రెహానా బేగం, అల్లారెడ్డి ఉదయ భాస్కర్ రెడ్డిలచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్. జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ మేరకు విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో నూతన సమాచార కమీషనర్లచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమీషన్ ముఖ్య సమాచార కమీషనర్ మెహబూబ్ భాషా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సమాచార కమీషనర్లు ఐలాపురం రాజా, శామ్యూల్ జొనాతన్, కాకర్ల చెన్నారెడ్డి, సమాచార కమీషన్ లా సెక్రటరీ జీ. శ్రీనివాసులు, ప్రభుత్వ సలహాదారు నేమాని భాస్కర్, నూతన సమాచార కమీషనర్ల కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెహానా గురించి.. రెహానా స్వస్థలం కృష్ణా జిల్లా, ఉయ్యూరు. జర్నలిస్టుగా 20 ఏళ్ళ అనుభవం. జర్నలిజంలో పరిశోధనాత్మక కథనాలు, సాహసోపేత ప్రయాణాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలికలతో అరబ్ షేకుల కాంట్రాక్ట్ వివాహాలు, 2008 ముంబాయి మారణహోమం లైవ్ కవరేజ్, ఉత్తరాఖండ్ వరదల రిపోర్టింగ్, సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఉగ్రదాడి కవరేజ్ వంటివి వీటిలో కొన్ని.. దక్షిణాన తమిళనాడు మొదలు ఉత్తరాన జమ్ము-కాశ్మీర్, పశ్చిమాన గుజరాత్ మొదలు తూర్పున త్రిపుర వరకు 17 రాష్ట్రల నుంచి వివిధ అంశాలపై రిపోర్ట్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి గెలిచినప్పుడు నరేంద్ర మోదీతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది ముఖ్యమంత్రుల ఇంటర్వ్యూలు రెహానా ఖాతాలో ఉన్నాయి. భారత భూభాగంలో భారత-పాక్, భారత-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ప్రయాణం చేసి ప్రత్యేక కథనాలు అందించారు. గత ఏడాది టర్కీలో జరిగిన భూకంప ప్రళయాన్ని సాహసోపేతంగా కవర్ చేశారు రెహాన. రెహానా రాసిన పుస్తకాలు అంతర్జాతీయ సరిహద్దుల్లో చేసిన పాత్రికేయ ప్రయాణ అనుభవాలతో "సరిహద్దుల్లో.." పేరుతో పుస్తకం తెచ్చారు. ఈ పుస్తకం "ఫ్రాంటియర్" పేరుతో ఇంగ్లీషులో అనువాదం అయ్యింది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై రాసిన వ్యాసాల సంకలనాన్ని "పెన్ డ్రైవ్" పేరుతో వెలువరించారు. టర్కీ భూకంప కవరేజ్ అనుభవాలతో టర్కీ @7.8 టైటిల్ తో పుస్తకం తెచ్చారు. అవార్డులు-రివార్డులు.. తెలంగాణ ప్రభుత్వ బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు, తెలంగాణా ప్రెస్ అకాడమీ అరుణ్ సాగర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, వివిధ సంస్థల పురస్కారాలు, అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. గత ఏడాది మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ మహిళా జర్నలిస్టు పురస్కారంతో సత్కరించింది. ఏపీ మీడియా అకాడమీ కూడా బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా పురస్కారం అందజేసింది. నిర్వర్తించిన ఇతర బాధ్యతలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ సభ్యురాలు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ సభ్యురాలిగా, ఏపీ మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇవి చదవండి: మనబడి ‘ఐబీ’కి అనుకూలం! -
దెబ్బతింటున్న మైనారిటీ మనోభావాలు
గత సంవత్సర కాలంగా దేశవ్యాప్తంగా ముస్లింల పై ఆర్ఎస్ఎస్, బీజేపీ తదితర పార్టీల నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తు న్నారు. ముస్లిం సమాజం పై ఎందుకు ఇలా వరుస దాడి జరుగుతోంది. ము స్లింలు, క్రిస్టియన్లు వేరు.. హిందువులు వేరు అనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే కుట్రవెనుక కారణాలు ఏమిటి? మైనా రిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా, వారిలో తమ అస్తిత్వానికి సంబంధించిన ఆందోళన పెంచే విధంగా సంచలన వ్యాఖ్యలు చేయడం.. మీడియాలో అనివార్యం కావడం పథకం ప్రకారం జరుగుతోంది. ఈ వ్యాఖ్యలకు తోడుగా ఘర్‌వాపసీ, లవ్ జిహాద్ వంటి కొత్త నినాదాలు, కొత్త ప్రయ త్నాలు చాపకింద నీరులా సాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా గుజరాత్ గడ్డపై నాకు ఎదు రైన ఒక సంఘటన గుర్తుకొస్తోంది. 2012 డిసెం బర్లో గుజరాత్ రాష్ట్ర ఎన్నికల కవరేజీ కోసం ఆ రాష్ట్రంలో రెండువారాలపాటు ఉన్నాను. ఎన్నిక పూర్తై సాయంత్రం నేను ఉంటున్న హోటల్‌కు చేరు కున్నాను. ఆ హోటల్ రూమ్‌బాయ్‌ని ఏ పార్టీకి ఓటే శావు అని అడిగాను. కమలానికి ఓటు వేశానని చెప్పాడు. ఎందుకు కమలానికే.. మోడీసర్కారు పని తీరు నచ్చిందా అనడిగాను. అతని నుంచి వచ్చిన సమాధానం ఇప్పటికీ నాలో తీవ్ర ఆలోచనను రేపు తుంటుంది. ‘మేము (హిందువులం) అధికారంలో లేకపోతే వాళ్లు (ముస్లింలు) మాపై దాడులు చేస్తా రు’. పాతికేళ్లు నిండని, పదోతరగతి కూడా ఉత్తీ ర్ణుడు కాని ఆ యువకుడు ఓటు వేసినప్పుడు చూసింది పాలనా దక్షతో, మరొకటో కాదు నాయకు డు హిందువు అయి ఉండాలి. అందులోనూ హిం దూత్వ భావజాలం జాస్తిగా ఉండే మోడీ వంటి అధి నాయకుడు అయి ఉండాలి. గుజరాత్‌లోనే కాదు గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఒక వర్గం లేదా కొంత శాతం ఓటర్లు ఇదే ప్రాతిపదికన ఓటేశారనేది సత్యం. ఈ మేరకు తెరవెనుక ఆర్ఎస్ ఎస్ పథకం విజయవంతం అయిందనే చెప్పాలి. దేశం కోసం త్యాగాలు చేయడానికి భారతీయ ముస్లింలు వెనకాడరంటూ వ్యాఖ్యానించి, మోదీ వారి మీద వ్యతిరేకత లేదని చెప్పే ప్రయత్నం చేశా రు. కానీ ముస్లింల దేశభక్తి గురించి ఎవరూ కితా బులు ఇవ్వనవసరం లేదు. చరిత్రే ఇందుకు సాక్ష్యం. అబుల్ కలాం ఆజాద్, హకీం అజ్మల్ ఖాన్, రఫీ అహ్మద్ కిద్వాయ్ వంటి యోధులు దేశ స్వాతం త్య్రం కోసం పోరాడారు. ‘సరిహద్దు గాంధీ’ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ తన 95 ఏళ్ల జీవితంలో 45 ఏళ్లు కారాగారంలోనే గడిపారు. అది కూడా భారత స్వాతంత్య్రోద్యమం కోసమే. పరదా వెనకే ఉన్నప్ప టికీ హజ్రత్ మహల్, అస్ఘరీ బేగం, బీ అమ్మా వంటి వారు కూడా దేశ స్వాతంత్య్రం కోసం పాటుపడ్డారు. వీరి గురించి మాట్లాడే హక్కు ఈ నేతలకు ఉందా? ముస్లింలు, క్రిస్టియన్లు రాముడి సంతానమేనని ఒక నేత సూత్రీకరించారు. అన్ని మతాలు హిందూ మతం నుంచే వచ్చాయని ఆయన భావన. మరి సింధు నాగరికత గురించి, ఆర్య సంస్కృతి గురించి వీరు విస్మరించదలిచారా? ఈ మధ్య తరచు వినిపి స్తున్న వ్యాఖ్య ఎక్కువ మంది పిల్లలను కని, హిం దూ జాతి మనుగడను కాపాడడం. ముస్లింలు ఎక్కు వ మందిని కంటున్నారు కాబట్టి హిందువులు కనా లని వారి వాదన. కానీ ఇటువంటి ఆలోచనతో ముస్లింలు అధికంగా పిల్లలను కనడం లేదు. నిజా నికి 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 78 శాతం హిందువులే. ముస్లింలు, క్రైస్తవులు మైనారి టీలు. అయినా హిందూ జాతి ప్రమాదంలో పడిం దంటూ అధిక సంతానం పొందండంటూ చెప్పడం ఏమిటి? వీటన్నిటికీ కారణం అధిక సంతానం ప్రగ తికి నిరోధమనే చైతన్యం కొరవడడమే. అలాగే పుట్టెడు సంతానాన్ని సాకలేక బాలికలను ముసలి షేక్‌లకు ఇచ్చి పెళ్లి చేయడం మనం చూడడం లేదా? ముస్లింల మాదిరిగా హిందువులు కూడా ఇంటికి నలుగురిని కనమని చెప్పి, వారి వలెనే చదువులకు దూరంగా ఉండమని సలహా ఇస్తారా? ఒక భారత పౌరునిగా రాజ్యాంగం ద్వారా వచ్చిన ఓటు హక్కు ను తొలగించమని ఎవరైనా ఎలా అడుగుతారు? హిందుత్వ భావనతో నిండిపోయిన నేతలకు ప్రతి సారి ముస్లిం ఎందుకు లక్ష్యంగా మారుతున్నాడు? ఇక్కడ అందరికీ గౌరవంగా జీవించే హక్కు సమా నమే. బాధ్యతాయుత స్థానాలలో ఉన్నవారు ప్రజ లను పెడతోవ పట్టించే ప్రచారాలు మానుకోవాలి. (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు మొబైల్: 94925 27352)