శరద్ జేడీయూ దరఖాస్తు తిరస్కరణ’
పట్నా: శరద్ యాదవ్ వర్గానికి జేడీయూ పార్టీ గుర్తును కేటాయించేందుకు ఎన్నికల కమిషన్ నిరాకరించిందని బిహార్ సీఎం నితీశ్ వర్గానికి చెందిన జేడీయూ పార్లమెంటరీ పక్షనేత ఆర్సీపీ సింగ్ తెలిపారు. శరద్ వర్గం తగిన సాక్ష్యాధారాలను సమర్పించలేకపోవడంతో వారి దరఖాస్తును ఈసీ తిరస్కరించిందని వెల్లడించారు. ఈ మేరకు ఈసీ కార్యదర్శి రాసిన లేఖను విడుదల చేశారు. ఈసీ నిర్ణయంపై తగిన నిర్ణయం తీసుకుంటామని శరద్ యాదవ్ తెలిపారు.