Relaxation of rules
-
Gujarat: లిక్కర్ బ్యాన్ సడలింపు..కాంగ్రెస్ ఫైర్
అహ్మదాబాద్: రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి గుజరాత్లో అమలులో ఉన్న లిక్కర్ నిషేదంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పరిమిత సడలింపు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఆ పార్టీ ఎంపీ శక్తిసింగ్ గొహిల్ ఈ విషయమై ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. లిక్కర్ బ్యాన్ సడలింపులు రాష్ట్రంపై నెగెటివ్ ప్రభావాన్ని చూపుతాయని గొహిల్ హెచ్చరించారు.ఈ సడలింపుల వల్ల ప్రభుత్వం ఎలాంటి లాభం పొందాలనుకుంటోందో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. గాంధీనగర్‌లోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ(గిఫ్ట్ సిటీ)లో లిక్కర్ అందుబాటులో ఉంటుందని స్టేట్ ఎక్సైజ్ శాఖ తాజాగా ప్రకటించింది. చాలా కాలం పాటు బ్యాన్ కొనసాగించి సడెన్‌గా గిఫ్ట్ సిటీలో లిక్కర్ అమ్మకాలు అనుమతించడానికి బలమైన కారణాలున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. ‘భారీగా పన్ను రాయితీలున్న అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం కావడంతో గిఫ్ట్ సిటీలో దేశీయ, విదేశ కంపెనీల నుంచి పెట్టుబడులు వస్తాయి. ఈ కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగులు, సందర్శకులకు లిక్కర్ అమ్మేందుకు తాత్కాలిక ప్రాతిపదికన హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులకు అనుమతిచ్చినట్లు గుజరాత్ స్టేట్ నార్కొటిక్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలిపింది. సింగపూర్ లాంటి గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీస్ కేంద్రాలతో పోటీ పడి ఆర్థిక సేవల రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం గిఫ్ట్ సిటీని ఏర్పాటు చేసింది. ఇక్కడ పెట్టుబడులు పెట్టే ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీలకు సులభతర రెగ్యులేటరీ నిబంధనలతో పాటు భారీ పన్ను రాయితీలను ప్రభుత్వం కల్పించింది. ఇదీచదవండి..మళ్లీ మాస్క్ తప్పనిసరి.. ఆదేశాలు జారీ! -
కశ్మీరంలో సడలుతున్న ఆంక్షలు
జమ్మూ/శ్రీనగర్: కశ్మీర్లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. జమ్మూ, కశ్మీర్‌లోయలో ప్రజల రాకపోకలపై విధించిన ఆంక్షలను కేంద్రం శనివారం పాక్షికంగా సడలించింది. దీంతో పలువురు కశ్మీరీలు పక్క గ్రామాల్లోని తమ బంధువులు, కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఆంక్షలను సడలించినా భద్రతాబలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. కశ్మీర్‌లోని 35 పోలీస్స్టేషన్ల పరిధిలో ఆంక్షలను అధికారులు సడలించారు. కశ్మీర్ బయట ఉండే కుటుంబ సభ్యులతో ప్రజలు మాట్లాడేందుకు వీలుగా 17 టెలిఫోన్ ఎక్సే్ఛంజీల్లో సేవలను పునరుద్ధరించారు. ఈ విషయమై జమ్మూకశ్మీర్ ప్రభుత్వ అధికార ప్రతినిధి రోహిత్ కన్సాల్ మాట్లాడుతూ..‘కశ్మీర్ లోయలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాథమిక పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి’ అని తెలిపారు. కాగా, ప్రభుత్వం ఆంక్షలు సవరించినా పలు పెట్రోల్ బంకులు, ఇతర మార్కెట్లు శనివారం కూడా మూతపడ్డాయి. ఇంటర్నెట్, టెలిఫోన్ సేవల పునరుద్ధరణ జమ్మూలో శనివారం 5జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. ఈ విషయమై రాష్ట్ర డీజీపీ మాట్లాడుతూ..‘2జీ ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించాం. ఈ సందర్భంగా ఇంటర్నెట్ సేవలను ఎవరైనా దుర్వినియోగం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు. ప్రస్తుతానికి త్రీజీ, 4జీ సేవలపై ఆంక్షలను సడలించడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఉగ్రవాదులు త్వరలోనే దాడిచేసే అవకాశముందని నిఘావర్గాల నుంచి తమకు సమాచారం అందిందని జమ్మూకశ్మీర్ సీఎస్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. పాక్ కాల్పుల్లో జవాన్ మృతి కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో సరిహద్దులోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట ఉన్న గ్రామాలు, భారత ఆర్మీ పోస్టులు లక్ష్యంగా పాక్ బుల్లెట్ల వర్షం కురిపించింది. ఈ దుర్ఘటనలో డెహ్రాడూన్‌కు చెందిన జవాన్ లాన్స్‌నాయక్ సందీప్ థాపా(35) తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన భారత ఆర్మీ పాక్ దుశ్చర్యను దీటుగా తిప్పికొట్టిందని ఆర్మీ అధికార ప్రతినిధి శనివారం మీడియాకు చెప్పారు. -
‘ప్రైవేటు’కు తలొగ్గిన ఎంసీఐ?
వైద్య కళాశాలల నిబంధనల్లో సడలింపు పడకల కనీస పరిమితి 700 నుంచి 300కు తగ్గించడంపై విమర్శలు హైదరాబాద్: వైద్య విద్యలో ప్రైవేటు కళాశాలల ఆధిపత్యం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లను పెంచుకోవడం, వాటి భర్తీకి సొంతంగా ప్రవేశపరీక్షకు అంగీకరింపజేసుకోవడం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా భారత వైద్య మండలి (ఎంసీఐ) కూడా ప్రైవేటు వైద్య కళాశాలల ఒత్తిడికి తలొగ్గిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పడకల సంఖ్య, బోధనా సిబ్బంది తదితర మౌలిక సదుపాయాలపై నిబంధనలను ఎంసీఐ సడలించడమే దీనికి కారణం. ఎంసీఐ తాజా నిర్ణయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనివల్ల వైద్య విద్య ప్రమాణాలు పడిపోతాయని వైద్య విద్యార్థులు పేర్కొంటున్నారు. పాత నిబంధనల ప్రకారం 150 మంది ఎంబీబీఎస్ విద్యార్థులున్న వైద్య కళాశాల ప్రారంభించాలంటే 700 పడకల ఆసుపత్రి ఉండాలి. కానీ దీనిని 300కు కుదించారు. బోధనా సిబ్బంది సంఖ్యను కూడా ప్రస్తుతమున్న సంఖ్య కంటే మూడొంతులు తగ్గించినట్లు తెలిసింది. ఈ నిబంధనల సవరింపును అడ్డం పెట్టుకొని వైద్య కళాశాలలు ప్రస్తుతమున్న సీట్లను రెండింతలు చేసుకునే అవకాశముంది. ‘బిర్లా’లో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు హైదరాబాద్: జి.పి. బిర్లా ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్మెట్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో బిజినెస్ మేనేజ్మెంట్లో ఏడాది డిప్లొమా కోర్సు సెప్టెంబర్ నుంచి నిర్వహిస్తున్నట్లు జి.పి. బిర్లా సైన్స్ సెంటర్ డెరైక్టర్ బి.జి.సిద్దార్థ్ వెల్లడించారు. ఈ కోర్సులపై అవగాహనకు 22 నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు 9866082945/ 23241061/ 23235081 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ‘ఎస్ఎస్సీ బోర్డు నిర్లక్ష్యం లేదు’ సాక్షి, హైదరాబాద్: జూన్‌లో జరిగిన టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల్లో శిరీష అనే విద్యార్థినికి నిబంధనల ప్రకారమే ఈ-2 గ్రేడ్ ఇచ్చినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ శేషుకుమారి తెలిపారు. ‘ఎస్ఎస్సీ’ నిర్వాకంతో ఆమెకు నష్టం జరిగిందంటూ మంగళవారం పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆమె స్పందించారు. ఆ విద్యార్థిని లెక్కలు-1 పరీక్షకు హాజరు కాలేదని, లెక్కలు-2 పరీక్ష రాసి సీ-2 గ్రేడ్ సాధించినప్పటికీ ఈ-2 గ్రేడ్ ఇవ్వాలని నిబంధనలున్నట్లు తెలిపారు.