Reliance Jio free data
-
త్వరపడండి: జియో బంపర్ ఆఫర్!
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరోసారి సంచలనానికి సిద్ధమైంది. ఇప్పటికే కాల్స్, డేటా, ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను చవక ధరలకే అందిస్తూ మిగతా టెలికాం సంస్థల పోటీదారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. సామాన్యుడి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్ ఉండాలనే ఉద్దేశంతో జియోఫోన్లు ప్రవేశపెట్టగా వాటిని వినియోగించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దసరా, దీపావళి పండగలను దృష్టిలో పెట్టుకుని జియో మరో భారీ ఆఫర్‌తో ముందుకొచ్చింది. రూ.1500 విలువ చేసే జియో ఫోన్‌ను కేవలం రూ.699కే అందించనుంది. దీనికోసం పాత ఫోన్‌ను తిరిగి ఇచ్చేయాల్సిన పనిలేకుండా నేరుగా రూ.699కే కొత్త ఫోన్‌ను పొందవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు జియో సంస్థ మంగళవారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. పండగ సీజన్‌ను పురస్కరించుకుని జియోఫోన్ దివాళి ఆఫర్‌ను ప్రకటించగా.. ఫోన్ ధరను సగానికి పైగా తగ్గించింది. అంతేకాకుండా నూతనంగా కొనుగోలు చేసే జియోఫోన్‌పై రూ.700 విలువ చేసే డాటాను అందించనుంది. ఇందులో భాగంగా వినియోగదారుడి చేసుకునే ఒక్కో రీచార్జ్‌కు అదనంగా రూ.99 విలువైన డాటాను జియో అందిస్తుంది. ఇది మొదటి ఏడు రీచార్జ్‌లకు వర్తిస్తుంది. ఫోన్ కొనుగోలుపై రూ.800, ఏడు రీచార్జీల డేటా విలువ రూ.700 కలిపి వినియోగదారుడు రూ.1500 ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ దసరా నుంచి దీపావళి వరకు మాత్రమే వర్తిస్తుంది. -
జియో బ్రాడ్‌బ్యాండ్‌తో సెట్‌టాప్ బాక్స్ ఉచితం!
న్యూఢిల్లీ: డీటీహెచ్, కేబుల్ టీవీ కస్టమర్లను ఆకర్షించే దిశగా టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ప్రతి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌పై ఉచితంగా సెట్‌టాప్ బాక్స్ కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. ‘జియోఫైబర్ కస్టమర్లందరికీ కాంప్లిమెంటరీ సెట్‌టాప్ బాక్స్ కూడా లభిస్తుంది‘ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే, పేరొందిన ఎంటర్టైన్మెంట్ మొబైల్ యాప్స్‌లోని వీడియో కంటెంట్, సినిమాలు మొదలైనవన్నీ కూడా జియోఫైబర్ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. వీటి సబ్స్క్రిప్షన్ ఫీజు కూడా కలిపే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ చార్జీలు ఉంటాయి. ప్రత్యేకంగా కంటెంట్‌కు చెల్లించనక్కర్లేదు. ఇక సెట్‌టాప్‌కు కెమెరాను అమర్చుకుంటే టీవీ ద్వారా వీడియో కాలింగ్ సేవలు కూడా పొందవచ్చని సమాచారం. నేటి నుంచి (సెప్టెంబర్ 5) ఆప్టికల్ ఫైబర్ ఆధారిత జియోఫైబర్ సర్వీసులను జియో ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. జియోఫైబర్ కస్టమర్లకు ల్యాండ్‌లైన్ నుంచి జీవితాంతం ఉచిత వాయిస్ కాల్స్, సెకనుకు 100 మెగాబిట్ నుంచి 1 గిగాబిట్ దాకా స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందనున్నాయి. దీని చార్జీలు నెలకు రూ. 700 నుంచి ప్రారంభమవుతాయి. వార్షిక ప్లాన్ తీసుకున్న వారికి ఉచితంగా హెచ్డీ టీవీ సెట్ కూడా అందిస్తామంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ గతంలో వెల్లడించారు. మొత్తం మీద జియోఫైబర్ రాకతో చాలామటుకు డైరెక్ట్ టు హోమ్ సేవలందించే సంస్థల వ్యాపారాలకు గట్టి దెబ్బే తగిలే అవకాశాలు ఉన్నాయని పరిశమ్రవర్గాలు భావిస్తున్నాయి. దీన్ని తట్టుకునేందుకు ఆయా సంస్థలు ఇప్పటికే వివిధ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. జీ5, హుక్ వంటి పలు వీడియో స్ట్రీమింగ్ మొబైల్ యాప్స్ కంటెంట్ అందుబాటులోకి తెస్తూ భారతీ ఎయిర్టెల్ కొత్తగా రూ. 3,999కి సెట్ టాప్ బాక్స్‌ను ఆవిష్కరించింది. తొలి ఏడాది తర్వాత రూ. 999 వార్షిక ఫీజుతో సబ్‌స్క్రిప్షన్‌ను కొనసాగించవచ్చు. -
జియోని ఏ1 ధర కోత, పలు ఆఫర్లు
జియోని తన స్మార్ట్‌ఫోన్ ఏ1 ధరను తగ్గించింది. పండుగ సీజన్‌కు ముందస్తుగా ఏ1 స్మార్ట్‌ఫోన్ ధరను 3వేల రూపాయల ధర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ 16,999 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. అసలు ఈ ఫోన్ ధర 19,999 రూపాయలు. అంతేకాక పలు ఆఫర్లను, డీల్స్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. రిలయన్స్ జియో నెట్‌వర్క్‌ను ఏ1 స్మార్ట్‌ఫోన్‌లో యాక్టివేట్ చేసుకుంటే, రూ.309 రీఛార్జ్ లేదా ఆపై రీఛార్జ్‌లపై అదనంగా 60జీబీ వరకు 4జీ డేటాను ఆఫర్ చేయనుంది. పేటీఎంతో జియోని భాగస్వామ్యం ఏర్పరుచుకున్న నేపథ్యంలో కనీసం రూ.350 కొనుగోళ్లపై రూ.250తో రెండు క్యాష్‌బ్యాక్ ఓచర్లను పేటీఎం ఈ మొబైల్ కొనుగోలుదారులకు అందిస్తోంది. జియోని ఏ1 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు... 5.5 అంగుళాల హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే మెటల్ యునిబాడీ డిజైన్ ముందువైపు కర్వ్డ్ గ్లాస్ కోటింగ్ ఫ్రంట్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆండ్రాయిడ్7.0 నోగట్ 16ఎంపీ ఫ్రంట్ కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ 256జీబీ వరకు విస్తరణ మెమరీ 4010ఎంఏహెచ్ బ్యాటరీ గ్రే, బ్లాక్, గోల్డ్ రంగుల్లో అందుబాటు