Reliance Jios offer
-
తెలుగు రాష్ట్రాల్లో జియో నెట్వర్క్ సామర్ధ్యం విస్తరణ
సాక్షి,హైదరాబాద్: వినియోగదారులకు మరింత మెరుగైన 4G సేవలను అందించేందుకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ అంతటా 20 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను అదనంగా జోడించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జియోకు ప్రస్తుతం ఉన్న 40 MHz స్పెక్ట్రం లభ్యత ఇప్పుడు 50 శాతం పెరిగి 60 MHz వరకు చేరుకుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ఇటీవల నిర్వహించిన వేలంలో, ఏపీ టెలికాం సర్కిల్ కోసం 850MHz బ్యాండ్ లో 5 MHz ను; 1800MHz బ్యాండ్ లో 5MHz; 2300 MHz బ్యాండ్ లో 10 MHz స్పెక్ట్రమ్ ను జియో చేజిక్కించుకుంది. ఈ అదనపు స్పెక్ట్రమ్ విస్తరణ ప్రాజెక్ట్ ను రెండు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న తన అన్ని టవర్ సైట్లలో జియో విజయవంతంగా అమలు చేసింది. ఫలితంగా, ఈ ప్రాంతంలోని వినియోగదారులందరికీ ఇక నుంచి మరింత మెరుగైన వేగవంతమైన 4G సేవలు అందుబాటులోకి రానున్నాయి. నెట్వర్క్ సామర్థ్యం 50 శాతం పెరగడంతో పాటు డేటా వేగం రెట్టింపు కానుంది. ఏపీ టెలికాం సర్కిల్ (తెలంగాణ & ఏపీ)లో 3.16 కోట్లకు పైగా మొబైల్ చందాదారులతో పాటు దాదాపు 40% కస్టమర్ మార్కెట్ వాటాతో జియో నెంబర్ వన్ స్థానం లో కొనసాగుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా మహమ్మారి, లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ఇంటి నుంచే సురక్షితంగా ఆఫీస్ పనిచేసే వారికి, ఆన్లైన్ క్లాస్ లు హాజరయ్యే విద్యార్థులకు, ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ ఉద్యోగులకు డేటా అవసరం మరింత ఉంది. నెట్వర్క్ సామర్ధ్యం పెరగడం వల్ల ఈ వర్గాల వారందరికీ మెరుగైన, నాణ్యమైన కనెక్టివిటీని అందించేందుకు జియో కృషి చేస్తోంది. చదవండి: మరో సంచలన ప్రాజెక్టుకు రిలయన్స్ జియో శ్రీకారం -
జియో ఉచిత ఆఫర్‌పై మిట్టల్ ఘాటైన వ్యాఖ్య
రిలయన్స్ జియో ఉచిత సేవా ఆఫర్లు ఇతర టెలికాం దిగ్గజాలకు విసుగెత్తిస్తున్నాయి. 4జీ మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో జీవితకాల ఉచిత వాయిస్ కాల్ ఆఫర్‌పై ట్రాయ్ ఇచ్చిన క్లీన్చీట్పై టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ విభేదిస్తోంది. ఏది ఎప్పటికీ ఉచితం కాదని, జియో ఉచిత వాయిస్ కాల్ ఆఫర్‌పై ట్రాయ్ పునఃసమీక్షించాల్సిందేనని ఎయిర్టెల్ చైర్మన్ సునిల్ మిట్టల్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జీఎస్ఎమ్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ ఈవెంట్లో పాల్గొన్న సునిల్ మిట్టల్ జియో ఆఫర్ చేస్తున్న ఉచిత వాయిస్ కాల్ ఆఫర్లపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. రిలయన్స్ జియో ఉచిత టారిఫ్‌ల సమస్యను వెంటనే పరిష్కరించాలని, ఏది కూడా జీవితకాలం పాటు ఉచితం ఉండదని మిట్టల్ పేర్కొన్నారు. జియో టారిఫ్ ప్లాన్స్ ప్రస్తుత నిబంధనలకు ఆమోదయోగ్యంగా ఉన్నాయని, ఎలాంటి వివక్షపూరితమైన ఉద్దేశ్యం లేవని పేర్కొంటూ ట్రాయ్ ఇటీవలే ఆ కంపెనీకి క్లీన్ చీట్ ఇచ్చింది. కానీ జియో జీవితకాల ఉచిత వాయిస్ కాల్ ఆఫర్ దోపిడీ పద్దతులకు తెరతీసేలా ఉందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా జియోకు ఇంటర్కనెక్షన్ ఇవ్వడం లేదని ఎయిర్‌టెల్‌తో పాటు, ఇతర టెలికాం కంపెనీలకు ట్రాయ్ విధించిన జరిమానాపై సునిల్ మిట్టల్ స్పందించారు. జియోకు ఆఫర్ చేస్తున్న ఇంటర్కనెక్షన్ పాయింట్లలో ట్రాయ్ కచ్చితంగా కొంత తికమక పడి ఉంటుందని మిట్టల్ ఆరోపించారు. అక్టోబర్ 21న ట్రాయ్ రిలయన్స్ జియోకు అవసరమైన ఇంటర్కనెక్షన్ పాయింట్లు ఇవ్వడం లేదని భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్‌లకు రూ.3,050కోట్ల భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే.