relief assistance
-
వరద సాయం.. కదిలిన ఎన్నారైలు
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. కడప జిల్లాలోనూ ఎంతో ఆస్తి నష్టం వాటిల్లింది. కొంతమంది జీవనోపాధి కోల్పోగా.. మరికొందరు ఆస్తినష్టం జరిగి కట్టుబట్టలతో మిగిలారు. ఈ పరిస్థితుల్లో తక్షణ సహాయంగా మౌలికమైన వసతులు కల్పించటం కోసం ఎన్నారైలు కదిలారు. అమెరికాలోని అట్లాంటా సిటీ నాటా అసోషియేషన్, వైఎస్సార్ అభిమానులు స్పందించి విరాళాలు అందించారు. దాతల్లో ఒకరైన నాటా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాసులరెడ్డి కొట్లూరు ఇక్కడే ఉండటం వల్ల స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు గ్రామాలకు వెళ్లి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. రాజంపేట మండలం మండపల్లిలో చెయ్యేరు ఉధృతికి రెండు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో తలా ఒక లక్ష రూపాయల సహాయం అందచేశారు. అలాగే ప్రొద్దుటూరు సమీపంలోని పెన్నా నది తీరాన ఉన్న మదర్ థెరిస్సా వృద్ధాశ్రమంలోని 35 మందికి దుప్పట్లు దోమతెరలు, దుస్తులు పంచిపెట్టారు. అలాగే మరో రెండు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు. ఈ సాయం అందించిన వెంకట రామ్ రెడ్డి చింతం, నంద గోపినాధ రెడ్డి, పంగ భూపాల్, ఉపేంద్ర రెడ్డి, కందుల కిరణ్, యర్రపురెడ్డి అనిల్ రెడ్డి, ఓజిలి పాండురంగారెడ్డి, గూడా కృష్ణమోహన్ రెడ్డి, హారతి శ్రీహరి, ఎద్దుల మోహన్ కుమార్, సగిలి రఘు రెడ్డి, నరాల సతీష్, చారుగండ్ల లక్ష్మీనారాయణ, తమ్మినేని శివ, బొమ్మిరెడ్డి రామిరెడ్డి, హరి హర రెడ్డి, ఆలూరి శ్రీనివాస్, బోరెడ్డి రవి కుమార్‌లకు.. సాయం అందుకున్న పలువురు ధన్యవాదాలు తెలిపారు. -
కేరళకు మరిన్ని సహాయక బృందాలు
సాక్షి, హైదరాబాద్: వరదలతో అతలాకుతలం అవుతోన్న కేరళకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని సహాయక బృందాలను పంపింది. ఇండియన్ ఆర్మీకి చెందిన 5 మెడికల్ టీంలు, 2 కాలమ్‌లు(ప్రతీ కాలమ్‌లో 50 నుంచి 60 మంది సిబ్బంది ఉంటారు), 2 అడ్వాన్స్డ్ లైట్ హెలికాఫ్టర్లు, 2 చేతక్ హెలికాఫ్టర్లు సహాయంగా పంపించారు. ఇండియన్ నేవీ నుంచి 10 రెస్క్యూ టీంలు, 10 మోటారు బోటులు, ఒక అడ్వాన్స్డ్ లైట్ హెలికాఫ్టర్, మరొక సీకింగ్ హెలికాఫ్టర్లు పంపారు. ఇండిన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి రెండు ఎంఐ-17 హెలికాఫ్టర్లు, ఒక అడ్వాన్స్డ్ లైట్ హెలికాఫ్టర్లు పంపారు.ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి 6 మోటారు బోట్లు, 4 సాధారణ బోట్లు, 21 హైర్డ్ బోట్లులు పంపించారు. అలాగే ఐసీజీఎస్ విజిత్ నౌక ద్వారా 40 టన్నుల సహాయక సామగ్రి పంపించారు. నౌక ముంబై నుంచి కొచ్చికి ఇదివరకే బయలుదేరింది. -
సూడాన్‌కు తక్షణం ఆర్థికసాయం అందించండి
సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ తన ఉధారతను మరోసారి చాటుకున్నారు. వరద తాకిడికి అతలాకుతమైన సూడాన్‌కు తక్షణమే రూ.10 మిలియన్ల అమెరికన్ డాలర్ల ఆర్థికసాయం అందజేయాలని అబ్దుల్ల బిన్ సౌదీ ఉన్నతాధికారులను ఆదేశించారని స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది. ఇటీవల సూడాన్ దేశంలో వరదలు పోటెత్తాయి. దీంతో ఆ దేశంలోని వివిధ రాష్ట్రాలు వరదల్లో చిక్కుకున్నాయి. దాంతో సూడాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయ పునరావాస చర్యలు కల్పించేందుకు సౌదీ ఆ నగదు మొత్తాన్ని సూడాన్‌కు అందజేయనుంది. అలాగే నిత్య ఘర్షణలతో ఈజిప్టు అతలాకుతలమవుతుంది. ఆ ఘర్షణలలో గాయపడిన వేలాది మంది ఈజిప్టులోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారికి వైద్య సాయం అందించేందుకు స్థానిక వైద్యులను త్వరలో ఈజిప్టు పంపేందుకు చర్యలు తీసుకోవాలని సౌదీ రాజు ఆదేశాలు జారీ చేశారని స్థానిక మీడియా తెలిపింది. అందుకోసం స్థానిక వైద్య బృందాలతోపాటు మందులు, ఔషధాలను ఈజిప్టు పంపేందుకు సౌదీ ఉన్నతాధికారులు ముమ్మర చర్యలు చేపట్టారని స్థానిక మీడియా వివరించింది.