విద్యుత్ ఉద్యోగుల రిలీవ్‌పై విచారణ వాయిదా
హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగుల రిలీవ్ అంశంపై హైకోర్టులో చేపట్టనున్న విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసుకోవాలని ఆ రాష్ట్రాలకు హైకోర్టు సూచించింది. 3 నెలల నుంచి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఉద్యోగుల రిలీవ్ విషయంపై సమగ్ర విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది.
ఏపీలో 3,100 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, 1242 మందిని నియమించుకోవడానికి ఇబ్బంది ఏంటని తెలంగాణ ఏజీ అన్నారు. కావాలనే ఏపీ ప్రభుత్వం ఇబ్బందులు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. స్థానికత మీదనే ఒత్తిడి తీసుకొస్తున్నారని ఏపీ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.