remand accuse
-
వైఎస్సార్సీపీ నేత హత్య కేసు: రిమాండ్ ఖైదీ పరార్
సాక్షి, ఏలూరు: వైఎస్సార్సీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో నిందితుడు ఒకడు పరారయ్యాడు. కేసులో 8వ నిందితుడిగా ఉన్న కోడూరి రవితేజ.. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పారిపోయాడు. గురువారం అర్దరాత్రి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రవితేజ తప్పించుకున్నాడు. ఏలూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కోడూరి రవితేజ.. నడుంనొప్పితో ఈ నెల 14వ తేదీన ఆస్పత్రిలో చేరాడు. అయితే.. అర్ధరాత్రి పోలీసుల కళ్లుగప్పి ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. తినే టైంలో.. బేడీలు తొలగించడంతోనే పరారైనట్లు సెంట్రీ సిబ్బంది వెల్లడించారు. ప్రస్తుతం రవితేజ కోసం గాలింపు చేపట్టారు. -
సంకెళ్లతో ఖైదీ పరారీ
డిచ్పల్లి (నిజామాబాద్): పోలీసుల కళ్లుగప్పి ఓ ఖైదీ సంకెళ్లతో పరారయ్యాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో కలకలం సృష్టించింది. విశ్వసనీయ సమాచారం మేరకు... రెంజల్ మండలం దండిగుట్టకు చెందిన నేరస్థుడు రెడ్యా రెండు రోజుల క్రితం డిచ్పల్లి మండలం గన్నారం గ్రామంలోని ఓ ఆలయంలో దొంగతనానికి పాల్పడగా, గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రెడ్యాను రెండురోజుల పాటు విచారించిన పోలీసులు రిమాండ్కు తరలించేందుకు అతడికి సంకెళ్లు వేసి స్టేషన్లోనే ఉంచారు. మంగళవారం రాత్రి సమయంలో పోలీసులు వేరే కేసు విషయంలో ఉన్న సమయంలో రెడ్యా చాకచక్యంగా పరారయ్యాడు. దీంతో అతడి కోసం పోలీసులు అన్వేషణ ప్రారంభించారు.