సంకెళ్లతో ఖైదీ పరారీ | Remandaed accuse escaped from police station | Sakshi
Sakshi News home page

సంకెళ్లతో ఖైదీ పరారీ

Published Wed, Mar 25 2015 8:41 AM | Last Updated on Thu, Jul 11 2019 7:49 PM

Remandaed accuse escaped from police station

డిచ్‌పల్లి (నిజామాబాద్):  పోలీసుల కళ్లుగప్పి ఓ ఖైదీ సంకెళ్లతో పరారయ్యాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో కలకలం సృష్టించింది. విశ్వసనీయ సమాచారం మేరకు... రెంజల్ మండలం దండిగుట్టకు చెందిన నేరస్థుడు రెడ్యా రెండు రోజుల క్రితం డిచ్‌పల్లి మండలం గన్నారం గ్రామంలోని ఓ ఆలయంలో దొంగతనానికి పాల్పడగా, గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

రెడ్యాను రెండురోజుల పాటు విచారించిన పోలీసులు రిమాండ్‌కు తరలించేందుకు అతడికి సంకెళ్లు వేసి స్టేషన్‌లోనే ఉంచారు. మంగళవారం రాత్రి సమయంలో పోలీసులు వేరే కేసు విషయంలో ఉన్న సమయంలో రెడ్యా చాకచక్యంగా పరారయ్యాడు. దీంతో అతడి కోసం పోలీసులు అన్వేషణ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement