Rent Allowance
-
ఇంటి అద్దె చెల్లిస్తున్నారా.. ప్లాన్ చేసుకోండి..
మీరు ఉద్యోగస్తులైతే, మీకిచ్చే జీతభత్యాల్లో బేసిక్, డీఏ, ఇంటద్దె అలవెన్సులు, ఇతర అలవెన్సులు ఉంటాయి. గవర్నమెంటు, పబ్లిక్ సంస్థల్లో అయితే, వారివారి రూల్స్/ఒప్పందం ప్రకారం ఉంటాయి. అలాగే చెల్లిస్తారు. మీ ప్రమేయమే ఉండదు. ఇచ్చింది.. ఇచ్చినట్లు తీసుకోవాలి. ప్రైవేట్ సంస్థల్లో కొంచెం వెసులుబాటు ఉండొచ్చు. అక్కడ కూడా బలమైన ఉద్యోగ సంస్థలుంటే మన పప్పులుడకవ్! మీరు ఆ సంస్థలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులైతే, ఉద్యోగిగానే కొనసాగుతుంటే బేరసారాలతో పాటు అలవెన్సుల సంగతిలోనూ వెసులుబాటు అడగవచ్చు. ఆ గొడవలన్నీ పక్కన పెడితే, యజమాని ఇచ్చే ‘ఇంటద్దె అలవెన్సు’ జీతంలో ఒక అంశం. మొత్తం జీతభత్యాలతో కలిసి ఉంటుంది. ఈ అలవెన్సును ఆదాయంగా పరిగణిస్తారు. పన్నుకి గురి అవుతుంది. అయితే, అద్దె ఇంట్లో ఉంటూ, మీరు అద్దె ఇచ్చినట్లయితేనే చట్టప్రకారం మినహాయింపు లభిస్తుంది. ఈ అలవెన్సు ఉద్దేశం, మీరు ఆ మొత్తం ఇచ్చి అద్దె ఇంట్లో ఉండటం. అద్దె కోసం ఆ మొత్తాన్ని వినియోగించడం జరగాలి. ఈ మినహాయింపు పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి.మీరు ఆ సంస్థలో ఉద్యోగిగానే ఉండాలి.మీరు అద్దె ఇంట్లోనే ఉంటూ అద్దె చెల్లిస్తుండాలి.అద్దె చెల్లిస్తున్నట్లు కాగితాలు, రుజువులు ఉండాలి.సొంత వ్యాపారస్తులకు, వృత్తి ఉన్నవారికి ఇది వర్తించదు.అద్దె అంటే వసతి కోసం ఇచ్చే అద్దె, నిర్వహణ ఖర్చులు మాత్రమే. కరెంటు చార్జీలు, నీటి చార్జీలు మొదలైనవి కావు.సొంత ఇంట్లో ఉంటూ ఈ మినహాయింపు పొందకూడదు. కుటుంబ సభ్యులతో ఉంటూ అద్దె చెల్లించకపోతే ఈ మినహాయింపు ఇవ్వరు.ఇచ్చే జీతభత్యాల్లో ఈ అలవెన్సు లేకపోతే ఎటువంటి మినహాయింపు ఇవ్వరు.ఈ మూడింట్లో తక్కువ దాన్నే మినహాయిస్తారు. (a) వచ్చిన అలవెన్సు (b) చెల్లించిన అద్దెలో నుంచి 10 శాతం జీతం తీయగా, మిగిలిన మొత్తం (c) మెట్రో నగరాల్లో జీతంలో 50 శాతం, ఇతర ప్రాంతాల్లో జీతాల్లో 40 శాతంచెల్లించినట్లు రుజువు కావాలి. అవసరమైతే అగ్రిమెంటు, మీ బ్యాంకు అకౌంటు, ఓనర్ పాన్ కార్డు, ఓనర్ బ్యాంకు అకౌంటు, రశీదులు మొదలైనవి కావాలి.ఆ ప్రాంతంలో సొంత ఇల్లు ఉండకూడదు. మీరు ఎక్కడ పని చేస్తున్నారో ఆ ప్రాంతంలో అద్దె చెల్లించాలి.ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చుభార్యభర్తలు ఒకే ఇంట్లో కాపురం ఉంటూ ఇద్దరూ మినహాయింపు పొందకండి. ఇద్దరూ వేర్వేరు అగ్రిమెంటు ద్వారా పెద్ద ఇల్లు తీసుకుంటే ఎక్కువ అద్దె అయితే, అగ్రిమెంట్లు వేరు, చెల్లింపులు వేరు, రశీదులు వేరు, లెక్కలు వేరు.ఒక్కరే ఉద్యోగి అయి, మిగతావారు ఓనర్ అయితే, అగ్రిమెంటు రాసుకోండి. చెల్లింపులు సక్రమంగా చేయండి. పాన్ తీసుకోండి. అటు పక్క వ్యక్తికి సంబంధించిన ఇన్‌కంట్యాక్స్ లెక్కల్లో ఆదాయంగా చూపించండి.అలాగే తల్లిదండ్రుల దగ్గర ఉన్నా, మావగారింట్లో చూరు పట్టుకు వేళ్లాడుతున్నా.. అగ్రిమెంట్లు ముఖ్యం. చెల్లింపులు, రశీదులు, లెక్కలు పక్కాగా ఉండాలి.దొంగ ఇంటి నంబర్లు వేసి క్లెయిమ్ చేయకండి.మీ ఇంటికి మీరే ఓనర్ అని ఎడమ చేత్తో సంతకం పెట్టి క్లెయిమ్ చేయకండి.హైదరాబాదులాంటి మహానగరంలో స్వంత ఇల్లు ఉండగా అద్దె ఇంట్లో ఉండే పరిస్థితి ఏర్పడవచ్చు. స్వంత ఇల్లు మీద అద్దె ఆదాయంగా చూపిస్తూ, క్లెయిమ్ చేయండి.కె.సి.హెచ్.ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి, కె.వి.ఎన్.లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు -
ఇల్లు ఖాళీ చేయమంటే బెదిరిస్తున్నాడు
సాక్షి, కర్నూలు : కిరణ్ అనే వ్యక్తి తన ఇంటిని అద్దె తీసుకున్నాడు. అద్దె ఇవ్వడంలేదు. ఖాళీ చేయమంటే దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని శ్రీశైలంకు చెందిన సయ్యద్ ఫర్వీన్‌బీ జిల్లా ఎస్పీకి విన్నవించింది. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్ప అధ్యక్షతన స్పందన (ఫిర్యాదుల దినోత్సవం) కార్యక్రమం నిర్వహించారు. పలువురు బాధితులు నేరుగా తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. సమస్యలపై ఆయన స్పందిస్తూ విచారణ జరిపి నిర్దేశించిన గడువులోపు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్పందన కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు గోపాలకృష్ణ, వెంకట్రామయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ వాసుకృష్ణ పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. తన భర్త చేసిన అప్పులకు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తన భర్త గుండెపోటుతో మృతి చెందాడని, ఇద్దరు కుమార్తెలున్న తనకు న్యాయం చేయాలని గడివేముల మండలం గని గ్రామానికి చెందిన లక్ష్మీదేవి ఫిర్యాదు చేశారు. ప్రవీణ్ అనే వ్యక్తి కారుకు లోన్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేశాడని కర్నూలు నరసింహారెడ్డి నగర్‌కు చెందిన కరుణాకర్ ఫిర్యాదు చేశారు. రూ.95 లక్షల ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా పరారైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బనగానపల్లె మండలం నందవరం గ్రామానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె ఫారిన్ వెళ్తుందని చెప్పి డబ్బులు అప్పుగా తీసుకొని 15 రోజుల్లో తిరిగి ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని కర్నూలు గణేశ్ నగర్‌కు చెందిన వైవీఎన్ రెడ్డి, ఈశ్వరమ్మ దంపతులు ఫిర్యాదు చేశారు. ఐస్‌క్రీమ్స్ తయారు చేయడానికి పెట్టుబడి పెట్టించి ఒక సంవత్సరం తర్వాత మాకు తెలియకుండానే ఖాళీ చేసి వెళ్లి పోయారని ఆదోనికి చెందిన ఉసేనప్ప ఫిర్యాదు చేశారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
న్యూఢిల్లీ: 7వ వేతన సంఘం అనుమతుల కమిటీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుకు తీపి కబురు అందించనుంది. మెట్రో నగరాల్లో నివసించే ఉద్యోగుల ఇంటి అద్దె అలవెన్స్ లేదా హెచ్ఆర్ఏ(హౌస్ రెంట్ అలవెన్స్ )ను 30 శాతం పెంచేందుకు సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సోమవారం సమర్పించనున్న తన నివేదికలో ఈ మేరకు సిఫారసు చేసిందట, 7వ వేతన సంఘం ఉద్యోగుల హెచ్ఆర్ఏపై అందించిన సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. బేసిక్ జీతంపై 30శాతం హెచ్ఆర్ఏ చెల్లించాలని పేర్కొన్న ట్టు తెలుస్తోంది. దీంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉద్యోగుల హెచ్ ఆర్ఏ పెంచేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఆర్థిక కార్యదర్శి అశోక్ ఉష్ణ ద్రవాల నేతృత్వంలోని అనుమతులు కమిటీ 7 వ వేతన సంఘం ఆధ్వర్యంలో అనుమతులను సమీక్షించింది. ఈ సిఫార్సులను ప్రకటించే అవకాశంఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డీఏ తప్ప మిగిలిన అలవెన్సులపై సమీక్షించే నిమిత్తం 2016 జూలైలోఈ కమిటీని ఏర్పాటు చేశారు. తొలుత ఈ కమిటీనివేదికను అందించేకు నాలుగు నెలలు సమయం ఇచ్చారు. అనంతరం ఈ గడువును ఫిబ్రవరి 22, 2017 వరకు పొడిగించారు. కాగా ఉద్యోగులకు చెల్లించే డీఏ 50శాతానికి చేరుకునప్పుడు ఇంటి అద్దె అలవెన్సు 27, 18, 9శాతానికి పెంచాలని ప్యానల్ గతంలో తన నివేదికలో పేర్కొంది. డీఏ 100 శాతానికి పెంచినపుడు హెచ్ఆర్ఏ 30శాతంగా ఉండాలని 7వ వేతన సంఘం పేర్కొంది. 30శాతం డీఏఅమలైతే వరుసగా X, Y, Z నగరాలకు 20, శాతం 10శాతంగా ఉండాలని తెలిపింది. దీంతో పాటు కొన్ని అలవెన్సులు రద్దుచేయడంతోపాటు, మరికొన్నింటిలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే.