టాటా కమ్యూనికేషన్స్ కొత్త ఛైర్మన్
ముంబై: టాటా కమ్యూనికేషన్స్ కీలక నియామకాన్ని చేపట్టింది. ప్రముఖ పారిశ్రామివేత్త, బోర్డు డైరెక్టర్‌ను రేణుకా రాంనాధ్‌ను తన కొత్త చైర్ పర్సన్‌గా నియమించింది. ఈ మేరకు బోర్డు ఆమోదించిందని బుధవారం ప్రకటించింది.
టాటా కమ్యూనికేషన్స్ బోర్డ్ కు నాయకత్వం వహించడం సంతోషంగా భావిస్తున్నానని రాంనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒక బలమైన అభివృద్ధి పథంతో ఉన్నసంస్థకు నాయకత్వం వహించడనానికి , బోర్డుతో పనిచేయడానికి ఎదురు చూస్తున్నానన్నారు.
టాటా కమ్యునికేషన్స్ గ్రోత్ లో ఈ నియామకం సానుకూల ప్రభావం చూపుతుందని టాటా కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ సీఈఓ వినోద్ కుమార్ చెప్పారు. తమ వినియోగదారులు, భాగస్వాములు, వాటాదారులతో సహా అన్ని వాటాదారులందరికీ ఈ విలువను అందజేస్తామని చెప్పారు.
కాగా డిసెంబరు, 2014నుంచి టాటా కమ్యూనికేషన్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. 2009 లో ప్రైవేట్ ఈక్విటీ ప్లాట్‌ఫాం మ్యాప్‌లు స్థాపించారు.