టాటా కమ్యూనికేషన్స్ కొత్త ఛైర్మన్‌ | ata Communications Appoints Renuka Ramnath As Chairperson | Sakshi
Sakshi News home page

టాటా కమ్యూనికేషన్స్ కొత్త ఛైర్మన్‌

Published Wed, Apr 26 2017 2:19 PM | Last Updated on Tue, Sep 5 2017 9:46 AM

టాటా కమ్యూనికేషన్స్ కొత్త  ఛైర్మన్‌

టాటా కమ్యూనికేషన్స్ కొత్త ఛైర్మన్‌

ముంబై:  టాటా  కమ్యూనికేషన్స్  కీలక నియామకాన్ని   చేపట్టింది.   ప్రముఖ పారిశ్రామివేత్త,  బోర్డు డైరెక్టర్‌ను  రేణుకా రాంనాధ్‌ను  తన కొత్త  చైర్‌ పర్సన్‌గా  నియమించింది.  ఈ మేరకు బోర్డు ఆమోదించిందని బుధవారం   ప్రకటించింది.

టాటా కమ్యూనికేషన్స్ బోర్డ్ కు నాయకత్వం వహించడం సంతోషంగా భావిస్తున్నానని  రాంనాథ్‌  ఒక ప్రకటనలో తెలిపారు.  ఒక బలమైన అభివృద్ధి పథంతో ఉన్నసంస్థకు నాయకత్వం వహించడనానికి , బోర్డుతో పనిచేయడానికి ఎదురు చూస్తున్నానన్నారు.

టాటా కమ్యునికేషన్స్  గ్రోత్‌ లో  ఈ నియామకం  సానుకూల ప్రభావం చూపుతుందని  టాటా కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ సీఈఓ వినోద్ కుమార్ చెప్పారు. తమ వినియోగదారులు, భాగస్వాములు, వాటాదారులతో సహా అన్ని వాటాదారులందరికీ ఈ విలువను అందజేస్తామని  చెప్పారు.

 కాగా  డిసెంబరు, 2014నుంచి టాటా కమ్యూనికేషన్‌  బోర్డులో ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా  ఉన్నారు.  2009 లో ప్రైవేట్ ఈక్విటీ ప్లాట్‌ఫాం మ్యాప్లు స్థాపించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement