reporter dead
-
సునీల్ మృతికి మంత్రి జగదీశ్‌రెడ్డి సంతాపం
సాక్షి, సూర్యాపేటరూరల్ : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వీ6 రిపోర్టర్ సునీల్ భౌతికకాయాన్ని శుక్రవారం మండలంలోని యర్కారం గ్రామంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో ఎంపీ బడుగుల లింగయ్యయా దవ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు, సూర్యాపేట ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. సునీల్ మృతి చెందడం బాధాకరం.. రోడ్డు ప్రమాదంలో కోదాడ వీ6 రిపోర్టర్ సునీల్ మృతి చెందడం బాధకరమని తెంజు రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో నిర్వహించిన సునీల్ అంతిమయాత్రలో సంఘం జిల్లా అధ్యక్షుడు వజ్జె వీరయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. సునీల్ భౌతికకాయంపై పుష్ఫగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సహకారంతో సునీల్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే నేతలు ఎండీ.రియాజుద్దీన్, కారింగుల్ అంజన్‌గౌడ్, గోలి విజయ్, గుండేలి శ్రీధర్, శ్రీను, రఘు పాల్గొని సంతాపం తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వీ6 రిపోర్టర్ మృతి
గజ్వేల్/గజ్వేల్‌రూరల్ : ఉమ్మడి మెదక్ జిల్లా వీ6 న్యూస్ చానల్ స్టాఫ్ రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రసన్నకుమార్ శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాల ప్రకారం..శుక్రవారం సాయంత్రం ప్రసన్న కుమార్ తన కారులో హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గజ్వేల్ మండలం కొడకండ్ల సమీపంలో అతను ప్రయాణిస్తున్న కారు డివైడర్‌కు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు 108 అంబులెన్స్‌లో గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న మంత్రి హరీష్‌రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉన్న ప్రసన్నకుమార్ మృతదేహాన్ని మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ మడుపు భూంరెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, తహసీల్దార్ నిర్మల, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు శ్రీనివాస్, జర్నలిస్టు సంఘాల నేతలు పరిశీలించారు. ప్రసన్న కుమార్ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తానని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ప్రభుత్వపరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
లారీ ఢీకొని పాత్రికేయుడి మృతి
అనపర్తి (బిక్కవోలు) : సీనియర్ పాత్రికేయుడు సూరిశెట్టి రామకృష్ణ (38) విధి నిర్వహణలో భాగంగా ద్వారపూyì వెళ్లి తిరిగి వస్తూ అనపర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాయవరం గ్రామానికి చెందిన రామకృష్ణ పదేళ్లుగా వివిధ పత్రికలు న్యూస్ చానళ్లలో పాత్రికేయుడిగా పనిచేశారు. శుక్రవారం తను పని చేస్తున్న స్యూస్ చానల్‌కు వార్తా సేకరణకు ద్వారపూడి వెళ్లిన ఆయన మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి వస్తూ అనపర్తి గ్యాస్ గొడౌన్ల వద్దకు వచ్చేసరికి అనపర్తి వైపు వేగంగా వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొనడంతో రామకృష్ణ రోడ్డుపై పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అనపర్తి ఎస్సై కె.కిషోర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రాపురం ఏరియా అసుపత్రికి తరలించినట్టు ఆయన తెలిపారు. రామకృష్ణకు భార్య 3 ఏళ్ల కుమారుడు, ఏడేళ్ళ కుమార్తె ఉన్నారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే మండపేట, అనపర్తి నియోజకవర్గాల పాత్రికేయ సంఘ సభ్యులంతా ఘటనా స్థలానికి వచ్చి ఆయన మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు.