లారీ ఢీకొని పాత్రికేయుడి మృతి
Published Fri, Dec 23 2016 11:01 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM
అనపర్తి (బిక్కవోలు) :
సీనియర్ పాత్రికేయుడు సూరిశెట్టి రామకృష్ణ (38) విధి నిర్వహణలో భాగంగా ద్వారపూyì వెళ్లి తిరిగి వస్తూ అనపర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాయవరం గ్రామానికి చెందిన రామకృష్ణ పదేళ్లుగా వివిధ పత్రికలు న్యూస్ చానళ్లలో పాత్రికేయుడిగా పనిచేశారు. శుక్రవారం తను పని చేస్తున్న స్యూస్ చానల్‌కు వార్తా సేకరణకు ద్వారపూడి వెళ్లిన ఆయన మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి వస్తూ అనపర్తి గ్యాస్ గొడౌన్ల వద్దకు వచ్చేసరికి అనపర్తి వైపు వేగంగా వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొనడంతో రామకృష్ణ రోడ్డుపై పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అనపర్తి ఎస్సై కె.కిషోర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రాపురం ఏరియా అసుపత్రికి తరలించినట్టు ఆయన తెలిపారు. రామకృష్ణకు భార్య 3 ఏళ్ల కుమారుడు, ఏడేళ్ళ కుమార్తె ఉన్నారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే మండపేట, అనపర్తి నియోజకవర్గాల పాత్రికేయ సంఘ సభ్యులంతా ఘటనా స్థలానికి వచ్చి ఆయన మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement