రెస్క్యూ రోబో !
కురబలకోట: బోరు బావిలో చిన్నారులు పడిపోవడం.. ప్రాణాలు పోగొట్టుకోవడం..హృదయాన్ని కలచివేసే విదారక సంఘటనలు చూస్తూనే ఉన్నాం.. ఇలాంటి ప్రమాదాల నుంచి చిన్నారులను రక్షించడానికి చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ విభాగం చివరి సంవత్సరం విద్యార్థులు హరికృష్ణ, నరేష్, రమణప్ప, మనోహర్ రెడ్డి ‘రెస్క్యూ రోబో’ అనే పరికరాన్ని కనుగొన్నారు. బుధవారం ప్రిన్సిపాల్ యువరాజ్ విలేకరులకు ఆ పరికరం వివరాలను వెల్లడించారు.
వారి సమాచారం మేరకు... ఈ పరికరం పైభాగం స్టెపర్ మోటార్ లింకుల ద్వారా అమర్చి ఉంటుంది. కింది భాగంలో 20 మెగా ఫిక్సెల్ వాటర్ ప్రూఫ్ కె మెరా ఏర్నాటు చేస్తారు. ప్రమాదం జరిగిన బోరు బావిలోకి ఈ పరికరాన్ని పంపి కెమెరా ద్వారా లోపలి పరిస్థితులను పరిశీలిస్తూ, గ్రిపర్ ద్వారా పైభాగాన ఉన్న స్టెపర్ మోటార్‌తో కిందికి పంపుతారు. ఆతర్వాత ల్యాప్‌టాప్‌కు కనెక్షన్ ఇచ్చుకుని పరిశీలిస్తూ ఈ పరికరాన్ని లోన చిన్నారి ఉన్న ప్రదేశం వరకు పంపి గ్రిప్పర్తో రక్షించవచ్చని తెలిపారు. భూకంపాల శిధిలాల్లో ఇరుక్కున్న వారిని కూడా రక్షించవచ్చని అన్నారు.