Reservation Facility
-
మహిళలకు అవకాశాలు అంతంతే
సాక్షి, ముంబై: మహారాష్ట్ర శాసన సభ చరిత్రలో మహిళలకు ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు అంతగా లభించలేదు. మహిళల కోసం 33 శాతం రిజర్వేషన్ అమలులో ఉన్నప్పటికీ రాష్ట్రంలో (52 సంవత్సరాల కాలంలో) కేవలం 114 మంది మహిళలకు మాత్రమే ఎమ్మెల్యేలయ్యే అవకాశం దక్కింది. ఈ సంఖ్య ఇది వరకు గెలిచిన మొత్తం ఎమ్మెల్యేలతో పోలిస్తే కేవలం 3.7 శాతంగా ఉంది. మొదటిసారి 13 మంది.. సంయుక్త మహారాష్ట్ర అవిర్భవించిన తరువాత రాష్ట్రంలో మొట్ట మొదటి శాసన సభ ఎన్నికలు 1962లో జరిగాయి. అప్పట్లో కాంగ్రెస్ టికె టుపై పోటీ చేసిన 13 మంది మహిళలు విజయఢంకా మోగించారు. తరువాత 1967లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో మొత్తం 9 మంది మహిళలు గెలిచారు. 1960-70 దశకంలో కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యధిక బలమైన పార్టీగా వెలుగొందింది. ఈ పార్టీ టికెట్‌పై పోటీచేసిన మహిళా అభ్యర్థులందరూ దాదాపు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ టకెట్ దొరికితే చాలు విజయం తధ్యమనే అభిప్రాయం ఉండేది. 1972లో జరిగిన ఎన్నికల్లో ఒక్క మహిళ అభ్యర్ధి కూడా ఎమ్మెల్యే కాలేకపోయారు. వారిలో ఆశలు కొంత సన్నగిల్లాయి. కానీ 1978లో 8 మంది మహిళలు విజయ కేతనం ఎగురవేయడంతో వారిలో కొంత ఆత్మస్థైర్యం వచ్చింది. 1980 లో జరిగిన శాసన సభ ఎన్నికలు మహిళ అభ్యర్థులకు మంచి ఫలితాలను తెచ్చిపెట్టాయి. ఏకంగా 19 మహిళలు ఎమ్మెల్యేలయ్యారు. అదే సమయలో జనతా పార్టీ బీజేపీగా అవతారమెత్తినప్పుడు ఇద్దరు మహిళలు విజయ కేతనం ఎగురువేశారు. 2009లో జరిగిన ఎన్నికల్లో 11 మంది మహిళలు గెలిచారు. ఇలా జరిగిన వివిధ శాసన సభ ఎన్నికల్లో అత్యధికంగా విమల్ ముందడా ఎమ్మెల్యేగా విజయ ఢంకా మోగించి రికార్డుకెక్కారు. ఆమె కేజ్ శాసన సభ నియోజక వర్గం నుంచి ఏకంగా ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొత్తం 3,108 మంది మహిళలు ఎమ్మెల్యేలయ్యారు. -
పోలింగ్‌కు తరలిన సీమాంధ్ర ఓటర్లు
- ప్రత్యేక బస్సులు నడిపిన ఏపీఎస్ ఆర్టీసీ - పలు బస్సులు ఎన్నికల విధులకు - ఉన్న బస్సుల్లోనే నిలబడి స్వస్థలాలకు బెంగళూరు, న్యూస్‌లైన్ : సీమాంధ్రలో బుధవారం పోలింగ్‌ను పురస్కరించుకుని ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో సొంత ఊర్లకు తరలి వెళ్లారు. మంగళవారం ఉదయం నుంచే గమ్య స్థానాల వైపు పయనమయ్యారు. మదనపల్లి, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, తంబళ్లపల్లి, పలమనేరు, శ్రీకాళహస్తి, హిందూపురం, కడప, ప్రొద్దుటూరు, కావలి, నెల్లూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులే ఎక్కువగా ఉన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ప్రొద్దుటూరుకు ఆరు (మూడు కడప మార్గం, మూడు కదిరి మార్గం), నంద్యాల -2, విజయవాడ-5, నెల్లూరు-5, ఒంగోలుకు-1 చొప్పున రిజర్వేషన్ సౌకర్యంతో ప్రత్యేక బస్సులను నడిపింది. వీటితో పాటే కదిరి, అనంతపురం, మదనపల్లి, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు తదితర ప్రాంతాలకు 40 ప్రత్యేక సర్వీసులు నడిపామని ఏపీఎస్ ఆర్టీసీ స్థానిక అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రవీంద్ర నాథ రెడ్డి తెలిపారు. ఎక్కువ బస్సులను ఎన్నికల విధులకు తరలించినందున ప్రయాణికులకు సరిపడా బస్సులను సమకూర్చడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. చాలా మంది నిలబడే వెళ్లారని చెప్పారు. ఎన్నికలు అదనుగా ప్రైవేట్ బస్సుల్లో ఛార్జీలను అమాంతం పెంచేశారు. ఆర్టీసీ బస్సులు తక్కువగా ఉండటం, ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు ఎక్కువ కావ డంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
వక్కలిగల కల సాకారం
బీసీలుగా గుర్తించిన మహానేత వైఎస్ రిజర్వేషన్ సౌకర్యంతో లబ్ధిపొందిన వక్కలిగలు స్కాలర్షిప్లు, ఫీజురీయింబర్‌సమెంట్ వర్తింపు ఉద్యోగ, రాజకీయ రంగాల్లోనూ ప్రయోజనం మడకశిర, న్యూస్‌లైన్ : ఆర్థికంగా వెనుకబడిన వక్కలిగలు దశాబ్దాలుగా ఓసీ జాబితాలో ఉండి ఎటువంటి ప్రయోజనాలకూ నోచుకోలేకపోయారు. ఆ సామాజికవర్గం పిల్లలు ఉన్నత విద్యనభ్యసించడం చాలా కష్టంగా ఉండేది. ఎంతోమంది రాజకీయ పార్టీలు, నాయకులు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చి ఓటు బ్యాంకుగా వాడుకుని.. ఆ తర్వాత వారిని విస్మరించారు. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే బీసీల జాబితాలోకి చేరుస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వక్కలిగలను బీసీలుగా గుర్తించారు. ఫలితంగా వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన ఎంతోమంది రిజర్వేషన్ల ద్వారా లబ్ధిపొందారు. రాష్ర్టంలోనే వక్కలిగ లున్న నియోజకవర్గం మడకశిర. నియోజకవర్గంలో 1,86,053 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో వక్కలిగ సామాజిక వర్గం ఓటర్లు దాదాపు 70 వేల మంది ఉన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ వీరిదే నిర్ణయాత్మకశక్తి. వీరు ఎటువైపు మొగ్గుచూపితే ఆ అభ్యర్థి విజయం సాధించినట్టే. ఇలాంటి పరిస్థితుల్లో వక్కలిగ ఓటర్లను ఆకర్షించడానికి అన్ని రాజకీయ పార్టీలూ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈ సామాజికవర్గం వారు తమను బీసీలుగా గుర్తించాలని కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనూ అనేకసార్లు విన్నవించుకున్నారు. చంద్రబాబు మాత్రం వీరిని ఒక ఓటుబ్యాంకుగా వినియోగించుకున్నారు. అవసరం తీరాక వారి గురించి పట్టించుకోలేదు. వక్కలిగల సమస్యలను తెలుసుకునేందుకూ ప్రయత్నించలేదు. 2004లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పల్లెబాట-2లో భాగంగా వైఎస్ మడకశిర నియోజకవర్గంలో పర్యటించినపుడు వక్కలిగ సంఘం నాయకులు కలిసి తమను బీసీలుగా గుర్తించాలని కోరారు. ఇందుకు వైఎస్ సానుకూలంగా స్పందించి బీసీలుగా గుర్తించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బీసీ కమిషన్‌ను మడకశిర ప్రాంతానికి పంపించి వక్కలిగల స్థితిగతులపై సర్వే చేయించారు. వక్కలిగలు చాలా వెనుకబడి ఉన్నారని బీసీ కమిషన్ సీఎం వైఎస్‌కు నివేదిక సమర్పించారు. ఆ తర్వాత వైఎస్ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి వక్కలిగలను బీసీలుగా గుర్తించాలని నిర్ణయం తీసుకున్నారు. 35 ఏళ్ల వక్కలిగల కల వైఎస్ చొరవతో సాకారమైంది. బీసీలుగా గుర్తించడంతో ఎన్నో అవకాశాలు వారి దరిచేరాయి. ఎంతోమంది సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఎంపీటీసీ. జెడ్పీటీసీలుగా ఎన్నిక కావడానికి అవకాశం ఏర్పడింది. విద్యార్థులకు స్కాలర్షిప్లు లభించాయి. ఫీజు రీయింబర్‌సమెంట్‌తో ఉన్నతవిద్యనభ్యసించడానికి మార్గం సుగమమైంది. ఎంతోమంది వక్కలిగ విద్యార్థులకు ఉద్యోగవకాశాలు లభించాయి.ఇలా నియోజకవర్గంలో వక్కలిగ సామాజిక వర్గం అభివృద్ధికి వైఎస్ చేసిన కృషి మరువలేనిది. దీంతో ఆ సామాజిక వర్గం ఓటర్లు ఈసారి వైఎస్ తనయుడి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌ను బలపరచడానికి నిర్ణయించుకున్నారు.