సాక్షి, ముంబై: మహారాష్ట్ర శాసన సభ చరిత్రలో మహిళలకు ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు అంతగా లభించలేదు. మహిళల కోసం 33 శాతం రిజర్వేషన్ అమలులో ఉన్నప్పటికీ రాష్ట్రంలో (52 సంవత్సరాల కాలంలో) కేవలం 114 మంది మహిళలకు మాత్రమే ఎమ్మెల్యేలయ్యే అవకాశం దక్కింది. ఈ సంఖ్య ఇది వరకు గెలిచిన మొత్తం ఎమ్మెల్యేలతో పోలిస్తే కేవలం 3.7 శాతంగా ఉంది.
మొదటిసారి 13 మంది..
సంయుక్త మహారాష్ట్ర అవిర్భవించిన తరువాత రాష్ట్రంలో మొట్ట మొదటి శాసన సభ ఎన్నికలు 1962లో జరిగాయి. అప్పట్లో కాంగ్రెస్ టికె టుపై పోటీ చేసిన 13 మంది మహిళలు విజయఢంకా మోగించారు. తరువాత 1967లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో మొత్తం 9 మంది మహిళలు గెలిచారు. 1960-70 దశకంలో కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యధిక బలమైన పార్టీగా వెలుగొందింది. ఈ పార్టీ టికెట్‌పై పోటీచేసిన మహిళా అభ్యర్థులందరూ దాదాపు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ టకెట్ దొరికితే చాలు విజయం తధ్యమనే అభిప్రాయం ఉండేది.
1972లో జరిగిన ఎన్నికల్లో ఒక్క మహిళ అభ్యర్ధి కూడా ఎమ్మెల్యే కాలేకపోయారు. వారిలో ఆశలు కొంత సన్నగిల్లాయి. కానీ 1978లో 8 మంది మహిళలు విజయ కేతనం ఎగురవేయడంతో వారిలో కొంత ఆత్మస్థైర్యం వచ్చింది. 1980 లో జరిగిన శాసన సభ ఎన్నికలు మహిళ అభ్యర్థులకు మంచి ఫలితాలను తెచ్చిపెట్టాయి. ఏకంగా 19 మహిళలు ఎమ్మెల్యేలయ్యారు. అదే సమయలో జనతా పార్టీ బీజేపీగా అవతారమెత్తినప్పుడు ఇద్దరు మహిళలు విజయ కేతనం ఎగురువేశారు.
2009లో జరిగిన ఎన్నికల్లో 11 మంది మహిళలు గెలిచారు. ఇలా జరిగిన వివిధ శాసన సభ ఎన్నికల్లో అత్యధికంగా విమల్ ముందడా ఎమ్మెల్యేగా విజయ ఢంకా మోగించి రికార్డుకెక్కారు. ఆమె కేజ్ శాసన సభ నియోజక వర్గం నుంచి ఏకంగా ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొత్తం 3,108 మంది మహిళలు ఎమ్మెల్యేలయ్యారు.
మహిళలకు అవకాశాలు అంతంతే
Published Mon, Sep 29 2014 11:21 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
Advertisement
Advertisement