కాపు ఉద్యమానికి ఊపు
ఉధృతమవుతున్న ఆందోళన
పలుచోట్ల ర్యాలీలు, దీక్షలు
విశాఖపట్నం: జిల్లాలో కాపు ఉద్యమం రోజు రోజుకూ ఊపందుకుంటోంది. కాపులకు రిజర్వేషన్ కల్పించాలంటూ ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ దీక్షకు సర్వత్రా మద్దతు పెరుగుతోంది. పాయకరావుపేట, నక్కపల్లి, యలమంచిలి, బుచ్చయ్యపేట, నర్సీపట్నం, గొలుగొండ తదితర మండలాల్లో నిరాహారదీక్షలు, ర్యాలీలు, అర్ధ నగ్న ప్రదర్శనలు, మధ్యాహ్న భోజన సమయంలో కంచాలను గరిటెలతో వాయిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కాపులను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు కొమ్ముకాస్తున్న వలస కాపు నేతలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పాయకరావుపేట మండలం అర ట్లకోటలో న ల్లల రాజు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఆదివారం అధికారులు ఆయనకు వైద్య పరీక్షలకు యత్నించగా నిరాకరించాడు. అరట్లకోటలో రాజు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మరోవైపు జిల్లాలో కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దీక్షల్లో పాల్గొంటున్నారు. పాయకరావుపేట మండలం శ్రీరాంపురంలో చేపట్టిన నిరాహారదీక్షల్లో టీడీపీ కాపు నేతలు పాల్గొన్నారు. జిల్లా టీడీపీ నాయకుడు గెడ్డం బుజ్జి పాయకరావుపేట దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. నక్కపల్లి మండల కేంద్రంలో కాపులు మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు.
అక్కడ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, సీఈసీ సభ్యుడు వీసం రామకృష్ణ తదితరులు వారికి మద్దతు పలికారు. చినదొడ్డిగల్లులో నిరాహారదీక్షా శిబిరంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. య లమంచిలి పట్టణంలో కాపు నాయకులు పెద్దసంఖ్యలో నిరసనదీక్షలు చేపట్టారు. వీరికి మాజీ ఎంపీపీ బొద్దపు యర్రయ్యదొర తదితరులు సంఘీభావం తెలిపారు. నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట మీసాల సుబ్బన్న నే తృత్వంలో దీక్షలు కొనసాగుతున్నాయి. బు చ్చయ్యపేట మండలం వడ్డాదిలో పలువురు కాపు నా యకులు అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు.గ్రా మంలో ర్యాలీ తీ శారు. కాపు నేత దొండా నారాయణమూర్తి మద్దతు తెలిపారు.