Reserve Bank of India policy
-
నాణేల చెలామణీ..ప్రోత్సహకాల్ని పెంచిన ఆర్బీఐ
ముంబై: ‘క్లీన్ నోట్ పాలసీ’లో భాగంగా నాణేల చెలామణీపై బ్యాంకులకు ప్రోత్సహకాలు పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రటించింది. ఇప్పటి వరకూ బ్యాగ్‌కు రూ.25 ప్రోత్సాహకం ఉంటే దీనిని రూ.65కు పెంచుతున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. గ్రామీణ, చిన్న స్థాయి పట్టణాల విషయంలో అదనంగా మరో రూ.10 ప్రోత్సాహకంగా లభిస్తుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమలవుతుందని ఆర్బీఐ పేర్కొంది. నాణేల పంపిణీ విషయంలో తమ బిజినెస్ కరస్పాండెంట్ల సేవలను మరింత వినియోగించుకోవాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. చదవండి : బ్యాంకింగ్ రుణ వృద్ధి 6.55 శాతం -
మార్కెట్లను సర్ప్రైజ్ చేసిన ఆర్బీఐ
ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశ్చర్యకరమైన ప్రకటన చేసింది. విశ్లేషకుల అంచనాలన్నింటికీ చెక్ పెడుతూ.. కీలక వడ్డీరేటు రెపోను యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో రెపో రేటును 6.5 శాతంగానే ఉంది. బ్యాంక్ రేటును 6.75 శాతంగా ఉంచింది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఆర్బీఐ పరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే మెజార్టీ విశ్లేషకులు, మార్కెట్లు ఈ సారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతుందని అభిప్రాయపడ్డాయి. కానీ మార్కెట్లను, విశ్లేషకులను ఆర్బీఐ ఆశ్చర్యపరిచింది. ఆర్బీఐ ఈ ప్రకటన తర్వాత మార్కెట్లు భారీగా కిందకి పడ్డాయి. సెన్సెక్స్ 550 పాయింట్లు పతనమైంది. మొట్టమొదటిసారి రూపాయి విలువ భారీగా పడిపోయి, చారిత్రాత్మక కనిష్ట స్థాయి 74 మార్కును తాకింది. రూపాయి విలువను కాపాడటానికైనా ఆర్బీఐ రెపో రేటును పెంచుతుందని విశ్లేషకులు భావించారు. కానీ ఆ మేరకు నిర్ణయం తీసుకోకపోవడంతో, రూపాయి అంతకంతకు క్షీణిస్తోంది. మార్కెట్లు కూడా అదే స్థాయిలో కిందకు పడుతున్నాయి. ఆర్బీఐ నిర్ణయాన్ని పలువురు విశ్లేషకులు స్వాగతిస్తున్నారు. రేట్లను పెంచకపోవడం చాలా మంచి నిర్ణయమని పీఎంఈఏసీ మెంబర్ అశిమా గోయల్ అన్నారు. ఇది వేచిచూడాల్సిన సమయం అని చెప్పారు. -
ఖాతాదారులకంటే బ్యాంకులకే లాభం
వడ్డీ రేట్ల తగ్గింపు తీరుపై ఇండియా రేటింగ్స్ వ్యాఖ్య న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్ల కోత ప్రయోజనాలను ఖాతాదారులకు పూర్తి స్థాయిలో బదలాయించడానికి బ్యాంకులు ఇష్టపడటం లేదని, తమ సొంత ప్రయోజనాలకే దీన్ని ఉపయోగించుకుంటున్నాయని ఇండియా రేటింగ్స్ ఆక్షేపించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఆర్బీఐ మొత్తం మీద 125 బేసిస్ పాయింట్ల మేర పాలసీ రేట్లను తగ్గించగా.. బ్యాంకులు మాత్రం రుణాలపై వడ్డీ రేట్లను సగటున 50 బేసిస్ పాయింట్లే తగ్గించాయి. కానీ ఏడాది కాల వ్యవధి ఉండే డిపాజిట్ల రేట్లలో మాత్రం ఏకంగా 130 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టాయి. గృహ రుణాలపై ‘స్ప్రెడ్’ పెంచిన ఐసీఐసీఐ బ్యాంకు: కాగా ఎస్బీఐ తరహాలోనే ఐసీఐసీఐ బ్యాంకు గృహ రుణాల రేట్లపై ‘స్ప్రెడ్’ను 0.10 శాతం మేర పెంచింది. ఇప్పటిదాకా 0.15 శాతంగా ఉన్న స్ప్రెడ్ .. ఇకపై 0.25 శాతంగా ఉండనుంది. దీని ప్రకారం బ్యాంకు బేస్ రేటు 9.35 శాతంగా ఉండగా.. రూ. 5 కోట్ల కన్నా తక్కువ రుణం తీసుకునే మహిళలు 9.60 శాతం, ఇతర వేతన జీవులు 9.65 శాతం వడ్డీ రేటు కట్టాల్సి ఉంటుంది. గతంలో ఐసీఐసీఐ బ్యాంకు వడ్డీ రేటు 9.70 శాతంగా ఉన్నప్పుడు మహిళలకు 9.85 శాతానికి రుణం లభించేది. అంటే బేస్ రేటుపై 0.15 శాతం మాత్రమే అధికంగా వడ్డీ రేటు కట్టాల్సి వచ్చేది. తాజా మార్పు ప్రకారం బేస్ రేటుపై 25 శాతం ఎక్కువ కట్టాల్సి రానుంది. బ్యాంకు బేస్ రేటు, కొన్ని విభాగాల్లో అది వసూలు చేసే కనిష్ట వడ్డీ రేటు మధ్య వ్యత్యాసాన్ని స్ప్రెడ్‌గా వ్యవహరిస్తారు. సదరు విభాగంలోని రిస్కును బట్టి బ్యాంకు నిర్ణయిస్తుంది. స్ప్రెడ్‌ను పెంచడం వల్ల బ్యాంకులు తమ నికర వడ్డీ మార్జినల్ను కాపాడుకోవచ్చు.