Reserved category
-
అభ్యర్థులు దొరక్కుంటే అన్ రిజర్వుడే
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు రిజర్వు చేసిన పోస్టుల్లో సంబంధిత కేటగిరీల అభ్యర్థులు దొరకని సందర్భాల్లో ఆయా పోస్టులను అన్ రిజర్వుడుగా ప్రకటించాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)తాజా ప్రతిపాదిత మార్గదర్శకాలల్లో పేర్కొంది. ఈ మేరకు రూపొందించిన మార్గదర్శకాలను అభిప్రాయ సేకరణ కోసం ఆన్లైన్లో ఉంచింది. అయితే, యూజీసీ ప్రతిపాదించిన మేరకు ఉన్నత విద్యాసంస్థల్లోని రిజర్వుడు పోస్టులు వేటినీ కూడా డీ రిజర్వుడుగా మార్చడం లేదని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ స్పందిస్తూ ‘ఉన్నత విద్యా సంస్థల్లోని రిజర్వుడు పోస్టులను అన్ రిజర్వుడుగా ప్రకటించడమనే విధానం గతంలో లేదు, ఇకపై అమలు కాబోదు. రిజర్వుడు కేటగిరీలోని అన్ని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ అయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నత విద్యాసంస్థలదే’అని స్పష్టం చేశారు. -
సాధారణ టికెట్‌తోనే రిజర్వ్డ్ కోచ్‌లో ప్రయాణం
సాక్షి, రైల్వేస్టేషన్ (విజయవాడ): అన్ రిజర్వ్డ్ ప్రయాణికుల సౌకర్యం కోసం విజయవాడ డివిజన్ పరిధిలో నడిచే 50 రైళ్లలో కొన్ని రిజర్వ్డ్ కోచ్‌లను సాధారణ కోచ్‌లుగా మార్చి నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్వో నస్రత్ మండ్రూపక్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గూడురు– సికింద్రాబాద్, గూడురు–విజయవాడ, విజయవాడ–సికింద్రాబాద్, నర్సాపూర్–ధర్మవరం, తిరుపతి–కాకినాడ టౌన్, నర్సాపూర్–లింగంపల్లి, మచిలీపట్నం–బీదర్, విజయవాడ– లింగం పల్లి, తిరుపతి–ఆదిలాబాద్ రైళ్లతో సహా 50 రైళ్లలో గుర్తించిన కొన్ని రిజర్వ్డ్ కోచ్‌లలో సాధారణ ప్రయాణికులు ఎక్కేందుకు అవకాశం కల్పించినట్లు ఆమె తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. చదవండి: (‘అమ్మా ! నేను అందరిలా మళ్లీ బడికెళ్లగలనా..?') -
రిజర్వ్డ్ కేటగిరీ సీట్లపై జీవో 550 నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: ప్రతిభావంతుడైన రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థికి కేటాయించిన సీటు ఖాళీ అయితే, ఆ సీటును రిజర్వ్డ్ కేటగిరీకే చెందిన మరో అభ్యర్థితోనే భర్తీ చేయాలంటూ 2001లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 550 పేరా 5(2) అమలును ఉమ్మడి హైకోర్టు నిలుపుదల చేసింది. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రమేశ్‌రామ్ కేసులో సుప్రీం కోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని జీవో 550 అమలును నిలుపుదల చేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. జీవోపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వైస్ చైర్మన్, రిజిస్ట్రార్, 2017 నీట్ కన్వీనర్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 18కి వాయిదా వేస్తూ జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ తేలప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఆకుల వెంకట హర్షవర్దన్, మరో ఇద్దరు విద్యార్థులు ఈ పిటిషన్ వేశారు.