సరికొత్త థ్రిల్
సాయిరామ్ శంకర్, రేష్మిమీనన్ జంటగా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నేనో రకం’. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీధర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ చిత్రం కొత్తగా ఉంటుంది. సాయిరామ్–శరత్ కుమార్ల నటన, వారిద్దరి మధ్య సన్నివేశాలు ఆడియన్స్‌కు సరికొత్త థ్రిల్‌ను కలిగిస్తాయి.
మహిత్ స్వరపరచిన పాటలను టాప్ సెలబ్రిటీస్ త్వరలో రిలీజ్ చేస్తారు’’ అన్నారు. ‘‘మా చిత్రం ప్రేక్షకులను అలరించటంతో పాటు, ఆలోచింపచేసేలా ఉంటుంది. ఆసక్తికరమైన కథతో థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాం’’ అని సాయిరామ్ శంకర్ చెప్పారు. ‘‘మా చిత్రానికి కథే హైలెట్. ఈ నెల 17న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత శ్రీకాంత్ రెడ్డి అన్నారు.