residential certificates
-
లోకల్ ‘లొల్లి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో స్థానికతకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. మెరుగైన మార్కులు సాధించినా, స్థానికేతరులైతే ఉద్యోగం దక్కడం కష్టం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానికులకు, 5% మాత్రం ఓపెన్ కేటగిరీకి కేటాయిస్తూ నియామక సంస్థలు భర్తీ ప్రక్రియ చేపడతాయి. టీజీపీఎస్సీ ద్వారా ప్రస్తుతం గ్రూప్–4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. అయితే ఎక్కువ మంది అభ్యర్థులు రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.స్థానికత నిర్ధారణ ఇలా...కొత్త జిల్లాల ఏర్పాటు..ఆపై జోన్లు, మల్టీ జోన్ల విభజన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత స్థానికత పరిగణనలో ప్రభుత్వం కొంతమేర మార్పులు చేసింది.⇒ ఒక అభ్యర్థి స్థానికతను విద్యాభ్యాసం ఆధారంగా పరిగణిస్తున్నారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతిలో ఎక్కువ కాలం(కనీసం నాలుగు సంవత్సరాలు) చదివిన జిల్లాను స్థానికతగా గుర్తిస్తున్నారు. లేదా 4,5,6,7 తరగతులను రాష్ట్రంలో చదివిన విద్యార్థిని తెలంగాణలో స్థానిక అభ్యర్థి కింద లెక్కిస్తారు. ⇒ జిల్లా యూనిట్‌గా తీసుకున్నప్పుడు మాత్రం 1 నుంచి 7వ తరగతిలో కనీసం నాలుగేళ్లు చదివిన జిల్లాను ఆ జిల్లాలో పరిగణనలోకి తీసుకుంటారు. ఈమేరకు ఆ విద్యార్హత సర్టిఫికెట్లు (బోనఫైడ్) పరిశీలిస్తారు. తహసీల్దార్ ధ్రువీకరించినవే ఎక్కువగా..గ్రూప్–4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా టీజీపీఎస్సీ ధ్రువపత్రాల పరిశీలన చేపడుతోంది. అయితే చాలామంది అభ్యర్థులు బోనఫైడ్‌లకు బదులుగా రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్నారు. ⇒ తహసీల్దార్ ద్వారా తీసుకున్న నివాన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తుండడంతో వాటిని అధికారులు ఆన్లైన్ ద్వారా నిర్ధారించుకుని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ⇒ రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్న అభ్యర్థులు ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదవుకున్న బోనఫైడ్లు మాత్రం సమర్పించడం లేదని సమాచారం. వారంతా ఏడోతరగతి వరకు బడికి వెళ్లకుండా ప్రైవేట్ పద్ధతిలో చదువుకున్నట్టు చెబుతుండడం గమనార్హం.ఆ మూడు జిల్లాల్లోనే ఎక్కువగా...రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు సమర్పించిన అభ్యర్థుల్లో అత్యధికంగా మూడు జిల్లాలకు చెందినవారే ఉన్నట్టు తెలుస్తోంది. గ్రూప్–4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మరో నెలరోజుల పాటు జరగనుంది. ఇప్పటివరకు జరిపిన పరిశీలన ప్రక్రియలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల నుంచి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ జిల్లాల పరిధిలో ఉద్యోగాల సంఖ్య కూడా ఎక్కువే.పట్టణ నేపథ్యమ్ను ఈ జిల్లాల్లో స్కూల్‌కు వెళ్లకుండా ప్రైవేట్‌గా చదివే పరిస్థితి ఉంటుందా అనే ప్రశ్న పలువురి నుంచి ఉత్పన్నమవుతోంది. తహసీల్దార్ కార్యాలయాల నుంచి స్థానికత ధ్రువీకరణ పత్రం సంపాదించడంపైనా పలు విమర్శలు వస్తున్నాయి. దీంతో సరైన విధంగా విచారణ జరపకుండా నియామక పత్రాలు ఇస్తే స్థానికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని నియామకాల్లోనూ..టీజీపీఎస్సీ మాత్రమే కాదు..తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు(టీజీఎస్పీఆర్బీ), తెలంగాణ మెడికల్‌అండ్‌హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీజీఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా గత ఆర్నెళ్లలో 30వేలకు పైబడి ఉద్యోగ నియామకాలు జరిగాయి. ఈ ప్రక్రియలోనూ చాలామంది అభ్యర్థులు రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన నియామకాల్లో రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు సమర్పించిన వారి వివరాలను బహిర్గతం చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగ నియామక సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తున్నారు. -
మీసేవల్లో అపకీర్తి..!
ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు వేలల్లో వసూళ్లు - కులం, నివాస సర్టిఫికెట్ల జారీలోనూ... - మీసేవ నిర్వాహకులతో రెవెన్యూ సిబ్బంది మిలాఖత్ - సామాన్య ప్రజలకు తప్పని తిప్పలు కలెక్టరేట్ : విద్యార్థులు, తలిదండ్రుల అవసరాలను ఆసరాగా తీసుకుని కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాల జారీలో మీసేవ కేంద్రాల నిర్వాహకులు, రెవెన్యూ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం అన్ని రకాల పత్రాలు జత చేసి దరఖాస్తు చేసినా... కొర్రీలు పెట్టి మరీ తోసిపుచ్చుతున్నారు. ప్రస్తు తం కళాశాలలు ప్రారంభం కావడం, కౌన్సిలిం గ్ తేదీలు వెల్లడైన నేపథ్యంలో విద్యార్థులకు కులం, ఆదాయం, నివాసం వంటి ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి అవసరంగా మారాయి. ఇదే అదనుగా భావించిన ఒకరిద్దరు రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుండడంతో దరఖాస్తుదారులు లబోదిబోమంటున్నారు. రెవెన్యూ సిబ్బంది చేతివాటం జిల్లాలో ఎక్కువగా ధ్రువీకరణ పత్రాల తాకిడి ఉన్నది హన్మకొండ మండలానికే. దీంతో నగరంలోని కొన్ని మీ సేవ కేంద్రాల సిబ్బందితో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది మిలాఖత్ అయి దర ఖాస్తుదారుల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.30 చెల్లించాల్సి ఉండగా... అదనంగా రూ.100 వసూలు చేస్తున్నారు. అదనంగా చెల్లించిన వారికి 24 గంటల్లో పత్రాలు ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. అదనంగా వసూలు చేసిన డబ్బుల్లో తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి కొంత ముట్టజెప్పాల్సి ఉంటుందని కలెక్టరేట్ సమీపంలోని పలు మీసేవ కేంద్రాల నిర్వాహకులు బహిరంగంగా చెబుతుండడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగులకూ ఆదాయ పత్రాలు దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు చదువుల నిమిత్తం ప్రభుత్వం ఉపకార వేతనాలు ఇస్తున్న విషయం తెలిసిందే. దీనిన ఆసరాగా చేసుకున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అక్రమంగా బీపీఎల్ పరిధిలోకి వచ్చే విధంగా ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొంది ప్రభుత్వం నుంచి ఫీజులు పొందుతున్నారు. గతంలో అధికారులు చేపట్టిన విచారణలో ఈ తతంగం బహిర్గతమైంది. ఈ దందాలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాత్ర ఉందనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నారుు. ఇక అన్ని సక్రమంగా ఉన్నా.. ఉద్దేశపూర్వకంగా తోసిపుచ్చుతున్న దరఖాస్తుల విషయంలో బాధితుల గోడు వర్ణనాతీతం. తమ బాధను అధికారులు సైతం వినే పరిస్థితి లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందిపై తహసీల్దార్ ఆగ్రహం రెవెన్యూ కార్యాలయంలో ఒకరిద్దరు చేస్తున్న అక్రమ వ్యవహారం వల్ల అందరికీ అపకీర్తి వస్తోంది. ఇదే విషయంపై ఇటీవల సిబ్బం దితో సమావేశమైన తహసీల్దార్ డాక్టర్ నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలి సింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని పరోక్షంగా సదరు సిబ్బందిని హెచ్చరిం చినట్లు సమాచారం. కాగా, అనర్హులకు జారీ చేస్తున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది సంతకం ఉంటోందా...లేక ఇష్టారాజ్యంగా చేస్తున్నారా.. అన్న విషయంలో అధికారులు విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది. -
మీ సేవ’ కేంద్రాల నిలువు దోపిడీ
అధిక వసూళ్లతో విద్యార్థుల అవస్థలు కలిగిరి, న్యూస్‌లైన్:కలిగిరిలోని ‘మీ సేవ’ కేంద్రాలలో ప్రతిపనికీ విద్యార్థుల నుంచి నిర్ణీత ధరలకంటే అధిక మొత్తంలో రుసుం వసూలు చేస్తున్నారు. కలిగిరి మోడల్ స్కూల్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీంతో విద్యార్థులు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం ‘మీ సేవ’ కేంద్రాలకు వెళుతున్నారు. ఇదే అదనుగా కేంద్రం నిర్వాహకులు ఒక్కొక్క ధ్రువీకరణ పత్రానికి రూ. 35 తీసుకోవలసి ఉండగా రూ.40 వసూలు చేస్తున్నారు. అంతేకాక దరఖాస్తు కోసం మరో రూ.15 వసూలు చేస్తున్నారు. ‘మీ సేవ’ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలా అదనపు రుసుం వసూలు చేస్తూ వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లే కాకుండా ఇతర సేవలపై కూడా అదనంగా రూ.5 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తహశీల్దార్ కార్యాలయంలో కూడా ప్రస్తుతం సర్టిఫికెట్‌కు ఎంత వసూలు చేయాలో నిర్ణయించే బోర్డు కాకుండా, పాత చార్జీలు ఉన్న బోర్డు ఉం చటం విశేషం. దీనిపై తహశీల్దార్ ఆర్. సీతారామయ్యను వివరణ కోరగా నిర్ణీత రుసుం కంటే ఎక్కువ చెల్లించనవసరం లేదన్నారు. అధికంగా వసూలు చేసేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ‘మీ సేవ’ కేంద్రాలల్లో అధిక వసూళ్లకు పాల్పడుతుంటే 99895 20262కు సమాచారం అందించాలని కోరారు. -
‘మీ సేవ’లు అయోమయం
సాక్షి, కాకినాడ : ఫలానా సేవకు ఇన్ని రోజుల్లో అందనున్న ప్రతి ఫలం, ఫలానా సేవకు ఇంత ధర నిర్ణయించడం వెరసి మీ సేవలు బహు చక్కగా పని చేస్తున్నాయని భావిస్తున్న అధికారులకు లోపాలు బయటపడ్డాయి. దీంతో శని వారం ఆ విభాగంపై జరిగిన సమీక్షలో స్వయం కృతాపరాధాన్ని తప్పుపడుతూ ఇక ముందు ఇలా జరగకూడదని దిశా నిర్దేశం చేయాల్సి వచ్చింది. పట్టణాల్లో, గ్రామాల్లో రెవెన్యూ కార్యాలయాల వైపు కన్నెత్తి చూడనవసరం లేకుండాఆ విభాగం నుంచి పొందే ఓటరు కార్డులు, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డుల దరఖాస్తులు తదితర వాటి కోసం మీ సేవకు వెళ్లి పొందే విధంగా ఆన్లైన్ చేశారు. ఇలా ఇవ్వగానే అలా అయిపోతున్నాయనుకుంటున్న ఆ సేవలు కాస్తా మీసేవా కేంద్రాల్లో కాకుండా రెవెన్యూ కార్యాలయాల్లోనే పడకేస్తున్నాయని తేలాయి. రెవెన్యూకి పట్టిన బూజుదులపాల్సిందేనన్న నిర్ణయానికి జాయింటు కలెక్టర్ వచ్చేశారు. హోలోగ్రామ్‌కు కొరత ముఖ్యంగా పొందిన కొన్ని సేవలకు గుర్తింపుగా అధీకృతం కావాలంటే హోలోగ్రామ్ స్టిక్కర్ అంటించి ఉంటేనే దానికి ప్రామాణికత వస్తుం ది. ఇవి కలెక్టరేట్లో హెచ్- సెక్షన్లో అవసరం మేరకు ముద్రించి రెవెన్యూ కార్యాలయాలకు పంపిణీ చేస్తారు. ఇందుకు మీ సేవ చూసే విభాగం ఇండెంటు ఇవ్వాలి. ఇవేమీ లేకుండానే పనులు నడిచిపోవడం మామూలై హోలో గ్రామ్ పంపిణీ అడుగంటింది. ఉదాహరణకు ఒక మీ సేవా కేంద్రానికి వెయ్యి స్టిక్కర్లు కావాలంటే తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాలి. తీరా వెళితే రెండొందలు తీసుకో అంటూ కుదించి ఇస్తున్నారు. ఇలా ఇవ్వడం వల్ల మీ సేవ వినియోగదారుల్లో నూటికి ఇరవై మందికే సేవలందుతున్నాయి. మిగిలిన వారు మీ సేవ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీని వెనుక పెద్ద కథే న డుస్తున్నట్టు ఉన్నతాధికారుల్లో అనుమాన బీజం నాటుకుంది. మీ సేవలో ఎంతకీ రాని ధ్రువీకరణ పత్రం తహశీల్దార్ కార్యాలయానికి వెళితే చిటికెలో అయిపోతుండటంతో ఆపరేటర్లు బిత్తరపోతున్నారు. ఒక్కొక్క సారి దళారీలు బయలుదేరి కట్టలుగా దరఖాస్తులు తీసుకెళ్లి పనులు పూర్తి చేసుకోవడం షరా మామూలవుతోంది. 19 వేల దరఖాస్తుల పెండింగ్ వినియోగదారుడికి ధ్రువీకరణ పత్రం జారీ అయిందో లేదో తెలిసే సాఫ్ట్వేర్ మీ సేవల్లో లేదు. అది ఒక్క రెవెన్యూ కార్యాలయాల్లోనే తెలుసుకునే వెసులు బాటుంది. ఫలితంగా మీ సేవల్లో పనులు కావడం లేదని వినియోగదారులు తిట్లు, శాపనార్థాలు పెడుతున్నారు. ఇవి భరించలేక మీసేవ నిర్వాహకులు కార్యాలయాలకు వెళ్లి అడుగుతుంటే అసలు ఎన్ని దరఖాస్తులొచ్చాయో రిజిస్టర్లో రాసి వెళ్లమని, చూస్తామని చె ప్పడం అధికారుల వంతవుతోంది.