retired ASI
-
రైలు ఢీకొని రిటైర్డ్ ఏఎస్సై దుర్మరణం
సాక్షి,కేసముద్రం: ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ రిటైర్డ్ ఏఎస్సై దుర్మరణం చెందిన సంఘటన మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్లో సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ మురళీ తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా సుభాష్‌నగర్‌కి చెందిన రిటైర్డ్ ఏఎస్సై కోదాది వీరలింగం(62) తన బావమరిదికి బిడ్డ పుట్టగా, చూసేందుకుగాను రెండురోజుల క్రితం మానుకోటలోని ఆస్పత్రికి భార్యతో కలిసివచ్చాడు. అదే రోజు తిరిగి అత్తగారి ఊరైన కేసముద్రంస్టేషన్‌కు చేరుకున్నాడు. సోమవారం సాయంత్రం కేసముద్రంస్టేషన్‌లో గాంధీసెంటర్ వైపు ఉంటున్న అన్న ఇంటికి వెళ్లాడు. అనంతరం రైల్వేట్రాక్‌కు మరోవైపు ఉన్న అత్తగారింటికి వెళ్లేందుకు అర్థరాత్రి 11.30 గంటల ప్రాంతాన నడుచుకుంటూ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. పుట్ఓవర్ బ్రిడ్జిపై కోతులు ఉండటంతోపాటు, తనకు మోకాళ్ల నొప్పులుండటంతో రైల్వేట్రాక్‌పై నడుచుకుంటూ 2వ ప్లాట్‌ఫాం వైపుకు వెళ్తుండగా మెయిన్‌లైన్ (డౌన్‌లైన్)లో వెళ్లే గరీభ్‌రధ్ ఎక్స్‌ప్రెస్ వీరలింగంను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించినట్లు జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. సంఘటన స్థలం వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
రిటైర్డ్ ఏఎస్సై ఆత్మహత్య
మిర్యాలగూడ (నల్లగొండ) : కుటుంబ కలహాలతో ఓ రిటైర్డ్ ఏఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ విద్యానగర్‌లో మంగళవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న యోగానందం(62) అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పని చేసి రిటైర్ అయ్యారు. ఈ క్రమంలో కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విశ్రాంత ఏఎస్సై అదృశ్యం
హైదరాబాద్: ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిన ఓ విశ్రాంత ఏఎస్సై అదృశ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....గౌలిపురా సర్దార్ పటేల్‌నగర్‌కు చెందిన ఎం.సత్యనారాయణ(60) విశ్రాంత ఏఎస్ఐ. కాగా ఈ నెల 10వ తేదీనా అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సాధ్యమైన అన్ని ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అతని కుమారుడు ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 5.6 అడుగుల ఎత్తున్న సత్యనారాయణ ఇంటి నుంచి వెళ్లినప్పుడు యాష్ కలర్ సఫారీ ధరించాడని, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో మాట్లాడుతాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇతని ఆచూకీ తెలిసిన వారు ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో గాని 9490616500 నంబర్లో గాని సమాచారం అందించాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు కోరుతున్నారు.