విశ్రాంత ఏఎస్సై అదృశ్యం | retired asi missing | Sakshi
Sakshi News home page

విశ్రాంత ఏఎస్సై అదృశ్యం

Published Sun, Sep 13 2015 9:07 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM

retired asi missing

హైదరాబాద్: ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిన ఓ విశ్రాంత ఏఎస్సై అదృశ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....గౌలిపురా సర్దార్ పటేల్‌నగర్‌కు చెందిన ఎం.సత్యనారాయణ(60) విశ్రాంత ఏఎస్‌ఐ. కాగా ఈ నెల 10వ తేదీనా అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సాధ్యమైన అన్ని ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది.

 

దీంతో అతని కుమారుడు ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 5.6 అడుగుల ఎత్తున్న సత్యనారాయణ ఇంటి నుంచి వెళ్లినప్పుడు యాష్ కలర్ సఫారీ ధరించాడని, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో మాట్లాడుతాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇతని ఆచూకీ తెలిసిన వారు ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో గాని 9490616500 నంబర్‌లో గాని సమాచారం అందించాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement