‘పోడు’దారులందరికీ పట్టాలివ్వాలి
- రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ రాంపురంలో పోడు
- సాగుదారులతో సమీక్ష
రాంపురం(కొణిజర్ల) : ఏళ్లతరబడి పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు, గిరిజనేతరులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని రిటైర్డ్ హైకోర్డు జడ్జి చంద్రకుమార్ అన్నారు. మండల పరిధిలోని గుబ్బగుర్తి అటవీ ప్రాంతంలోని రాంపురం గ్రామంలో ఆయన శుక్రవారం పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, గిరిజనేతరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు సాగుదారులు తమ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. తాము సాగు చేసుకుంటున్న భూములను బిడ్డలకు వరకట్నంగా ఇస్తే.. ఇప్పు డు ఆ భూములు ప్రభుత్వం లాగి వేసుకుంటుం దని, దీంతో తమ అల్లుళ్లు బిడ్డలను ఇళ్ల వెళ్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమినే నమ్ముకుని బతుకుతున్న తమకు భూమి లేకుం డా చేయాలని అధికారులు, ప్రభుత్వం చూస్తుం దన్నారు.
అనంతరం చంద్రకుమార్ మాట్లాడుతూ 30,40 ఏళ్ల నుంచి భూములు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు రాకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. ఎంతో మంది పట్టాలు కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఆలోచించకుండా భూములు లాగేసుకోవాలని ప్రయత్నించడం దారుణమన్నారు. హరితహా రం పేరుతో మొక్కలు నాటడానికి గిరిజనులు వ్యతిరేకం కాదన్నారు. వాతావరణ కాలుష్యం ఏర్పడటానికి కార్పొరేట్ సంస్థలు, వాటి కంపెనీల నుంచి వచ్చే కాలుష్యం తప్ప నిత్యం మొక్కల మధ్య బతికే గిరిజనులు కాదన్నారు. ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, కానీ ప్రకృతిని కాపాడటానకి గిరిజనులపై యుద్ధం వద్దన్నారు.
పెట్టుబడిదారులు, పారిశ్రామిక వర్గాలకు అండగా ఉంటున్న వారి ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం వల్లే ప్రజ లకు ఇలాంటి దుస్థితి ఏర్పడిందన్నారు. రాబో యే ఎన్నికల్లో కాంట్రాక్టర్ల ప్రతినిధులను, డబ్బు కు ఆశపడే వారిని ఎన్నుకోవద్దన్నారు. నిరుపేదల పక్షాన నిలబడి ైధె ర్యంగా పోరాడే వారిని గెలిపించాలన్నారు. సీఎం కేసీఆర్ మనసు కరి గించడానికి గ్రామాల్లో ప్రతి టీఆర్ఎస్ ముఖ్య నాయకుడికి పోడు సాగుదారులు తమకు పట్టాలు ఇప్పించాలని దరఖాస్తులు ఇవ్వాలన్నారు. వారే తమ నాయకుడితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
పోడు భూములు సాగు చేసుకుంటున్న వారు భయపడాల్సిన పని లేదన్నారు. ధైర్యంగా ఉండి భూములు సాగు చేసుకోవాలన్నారు. గిరి జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ ధర్మా, ఎంపీపీ వడ్లమూడి ఉమారాణి, పోడు భూము ల పరిరక్షణ కమిటీ సభ్యులు బొంతు రాంబా బు, భూక్యా వీరభద్రంనాయక్, తాళ్లపల్లి కృష్ణ, రైతు సంఘం మండల కార్యదర్శి వడ్లమూడి నాగేశ్వరావు, ఐలూ, వి.లక్ష్మీనారాయణ, చింతనిప్పు చలపతిరావు, శాగం కృష్ణారెడ్డి, బానోత్ భరత్, డి.రామ్మూర్తి పాల్గొన్నారు.