
నిరసన దీక్షలో పాల్గొన్న జస్టిస్ చంద్రకుమార్
హస్తినాపురం: చట్ట సభల్లో వెనుకబడిన తరగతులకు 52 శాతం ప్రాతినిధ్యం కోసం రాజ్యాంగ సవరణ చేసి ప్రజాస్వామ్యానికి, సోషలిజానికి పునాదులు వేయాల్సిన అవసరం ఉందని ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. అంతర్జాతీయ ఆలోచన దినోత్సవం సందర్భంగా బీసీ కులాల వారీగా చట్ట సభలలో ప్రాతినిథ్యం కోసం మంగళవారం హస్తినాపురం చౌరస్తానిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఒకరోజు నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రాజ్యాంగం అమలు కావాలంటే శ్రమజీవులు పాలకులు కావాల్సిన అవసరం ఉందని, ఢిల్లీ, తమిళనాడు తరహా ప్రత్యామ్నాయం చూపే నాయకత్వం అవసరం అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు వేల్పూరి కామేశ్వరరావు మాట్లాడుతూ.. 70 సంవత్సరాలు దేశాన్ని పాలించిన అగ్రవర్ణాలు బీసీలకు ఏమాత్రం ప్రాతినిథ్యం కలి్పంచలేదన్నారు. ఈ కార్యక్రమంలో రుక్మోద్దీన్, చెన్నోజు శ్రీనివాసులు, బర్మాల సత్యనారాయణ, పాండురంగం, జి.రాజు, వలిజాల యాదయ్య పాల్గొన్నారు.