Retrieved
-
Vizag: పోగొట్టుకున్న విలువైన బ్యాగు.. గంటల వ్యవధిలో
విశాఖపట్నం: మహిళ పోగొట్టుకున్న విలువైన బ్యాగును గంటల వ్యవధిలో చేధించి తిరిగి ఆమెకు విశాఖపట్నం నగర పోలీసులు అందించారు. బుధవారం సాయింత్రం సుమారు 04.30 గంటల సమయంలో కే.భారతి అనే మహిళ భీమిలి నగరంపాలెం నుంచి ఎం.వీ.పీ సర్కిల్ వరకు ఒక పాసింజర్ ఆటో ఎక్కింది. సర్కిల్ వద్ద ఆటో దిగే సమయంలో తనతో పాటు తెచ్చిన బ్యాగును తీసుకోవడం మర్చిపోయి , కొంత సమయం తర్వాత ఆమె బ్యాగును మర్చిపోయినట్లు గుర్తించి చుట్టుప్రక్కల ఆటో కోసం వెతుకగా కనపడకపోవడంతో ఎం.వీ.పీ క్రైమ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ బ్యాగులో 5 తులాల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి వస్తువులు, 18,000 నగదు ఉన్నాయని తెలిపారు. తక్షణం స్పందించి.. ఆమె తెలిపిన వివరాలు ఆధారంగా కానిస్టేబుల్ పీ.హరి, అప్పుఘర్ ఆటో స్టాండ్‌లో ఉండే దూడ సత్యనారాయణ అనే ఒక ఆటో డ్రైవర్ సహాయంతో సదరు ఆటోను కనిపెట్టారు. సదరు ఆటో డ్రైవర్ ఆర్. కొండలరావు అలియాస్ రాజు కూడా స్వచ్ఛందంగా బ్యాగ్‌ను అప్పగించడానికి వస్తున్నట్లు తెలిపారు. గురువారం అడిషనల్ డీజీపీ, కమీషనర్ ఆఫ్ పోలీస్ అండ్ అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ డా. ఏ.రవి శంకర్ చేతుల మీదుగా బాధితురాలికు ఆమె బ్యాగును అందజేసి , బ్యాగ్ కనిపెట్టడంలో ప్రతిభ కనబర్చిన ఎంవీపీ కానిస్టేబుల్ పి.హరిని మెరిట్ సర్టిఫికెట్ ఇచ్చి అభినందించారు. అదే విధంగా బ్యాగును కనిపెట్టడంలో సహాయం చేసిన సత్యనారాయణ, స్వచ్ఛందంగా బ్యాగును అప్పగించిన రాజును ప్రత్యేకంగా అభినందించి క్యాష్ రివార్డులు అందజేశారు. చదవండి: ఈనాడు ట్యాబ్ కథనంపై మంత్రి బొత్స ఫైర్ -
‘పీఓకే’ను తిరిగి పొందటమే లక్ష్యం!.. రక్షణ మంత్రి హింట్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ పర్యటనలో భాగంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)పై కీలక వ్యాఖ్యలు చేశారు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. పీఓకే ప్రజలపై పాకిస్థాన్ అకృత్యాలకు పాల్పడుతోందని, దాని పర్యావసనాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. పీఓకేను తిరిగి చేజిక్కించుకోవటమే తమ లక్ష్యమని సూత్రప్రాయంగా వెల్లడించారు. పీఓకేలోని గిల్గిత్, బాల్టిస్తాన్‌ను చేరుకున్నాకే.. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధి సాధించినట్లవుతుందన్నారు. 1947లో శ్రీనగర్‌లో భారత వైమానిక దళం అడుగుపెట్టిన రోజును పురస్కరించుకుని నిర్వహించిన శౌర్య దివాస్ కార్యక్రమంలో మాట్లాడారు. ‘జమ్ముకశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధి ప్రయాణాన్ని ఇప్పడే ప్రారంభించాం. గిల్గిత్, బాల్టిస్తాన్ చేరుకున్నాకే మా లక్ష్యం నెరవేరుతుంది. పీఓకే ప్రజలపై పొరుగు దేశం అకృత్యాలకు పాల్పడుతోంది. దాని పర్యావసనాలు ఎదుర్కోక తప్పదు. ఉగ్రవాదం అనేది ఒక మతం కాదు. టెర్రరిస్టుల ఏకైక లక్ష్యం భారత్.’ అని పేర్కొన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. 2019, ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయటం ద్వారా జమ్ముకశ్మీర్ ప్రజలపై వివక్ష తొలగిపోయిందన్నారు. ఇదీ చదవండి: ముదురుతున్న వివాదం.. కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం -
నేను సూపర్ హ్యాపీ: నటి వరలక్ష్మి
చెన్నై: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటీమణుల్లో దక్షిణాదికి చెందిన వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. అయితే తాజాగా వరలక్ష్మి ట్విటర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు డిసెంబర్ 2వ తేదీన హ్యాకింగ్ బారిన పడ్డాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. సోషల్ మీడియాలో తన పేరు మీద ఏమైనా పోస్టులు వస్తే జాగ్రత్తగా ఉండాలని అభిమానుల్ని కోరారు. అయితే తాజాగా వరలక్ష్మి శరత్‌కుమార్ ట్విటర్ ఖాతా తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె ట్విటర్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: ‘తలైవి’ వర్ధంతి : కంగనా స్టన్నింగ్ స్టిల్స్) మళ్లీ ఇంత త్వరగా రీ ఎంట్రీ ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. మనం సోషల్ మీడియాలో బతుకుతున్నాం, ఇక్కడ ఏమైనా జరగొచ్చు కానీ అదంతా నిజం కాదని, మనం చూసిన ప్రతీదాన్ని నమ్మకూడదని ట్విటర్లో పేర్కొన్నారు. వరలక్ష్మి ప్రస్తుతం తమిళ్, తెలుగు సినిమాల్లో హీరోయిన్గా, విలన్ క్యారెక్టర్లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగులో రవితేజ హీరోగా వస్తున్న క్రాక్ సినిమాలో వరలక్ష్మి నటించనున్నారు. Thank you to @Twitter for having retrieving my account..!!! Super happy to be back.. — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) December 4, 2020 -
శవాలకోసం వెళితే మళ్లీ కాల్పులు జరిపారు
ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని దోర్నపాల్- చింతగుఫా వద్ద జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన ఎస్టీఎఫ్ జవాన్ల మృతదేహాలను సీఆర్పీఎఫ్ బలగాలు స్వాధీనపర్చుకుని, బేస్ క్యాంప్‌నకు తరలించాయి. ఎన్కౌంటర్ జరిగిన 24 గంటల తర్వాతగానీ మృతదేహాల తరలింపు సాధ్యపడకపోవడానికి గల కారణాలను ఏడీజీపీ ఆర్ కే విజ్ మీడియాకు వివరించారు. చనిపోయిన జవాన్ల శవాలకోసం ఘటనా స్థలానికి వెళ్లిన సీఆర్పీఎఫ్ బృందంపై అనూహ్యరితీలో మావోయిస్టులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళం వెనక్కి వచ్చేసింది. ఆదివారం ఉదయం మరింత బలగంతో వెళితేగానీ శవాల స్వాధీనం సాధ్యపడలేదని విజ్ చెప్పారు. కూంబింగ్ అనంతరం శనివారం మద్యాహ్నం బేస్ క్యాంపునకు తిరిగివస్తున్న ఛత్తీస్‌గఢ్ పోలీస్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) జవాన్లను దాదాపు 200 మంది నకల్స్ చుట్టుముట్టారు. ఇది గమనించిన జవాన్లు ఫైర్ ఓపెన్ చేశారు. అటు మావోయిస్టులు కూడా కాల్పులు ప్రారంభించడంతో రెండు గంటపాటు ఆ ప్రాంతమంతా తుపాకుల చప్పుళ్లతో మారుమోగింది. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు మృతిచెందగా 11 మంది గాయాలతో బయటపడ్డారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపునకు కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థగానీ, బ్యాక్ అప్ ఫోర్స్ గానీ లేకపోవడంతో బుల్లెట్ దెబ్బలుతిన్న జవాన్లు ఊసురోమంటూ సీఆర్పీఎఫ్ క్యాంప్‌ను చేరుకున్నాకగానీ ఎన్కౌంటర్ గురించి బయటి ప్రపంచానికి తెలియలేదు! ఎన్ కౌంటర్ లో ఎస్టీఎఫ్ ప్లటూన్ కమాండర్ శంకర్ రావుతో పాటు ఏడుగురు జవాన్లు మరణించారు. ప్రస్తుతం మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గాయపడినవారికి కాంచన్లాల్లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 2013లో కాంగ్రెస్ నేతలపై దాడి తరువాత మావోయిస్టులు.. పోలీసులను ఎన్కౌంటర్ చేయడం ఇదే ప్రథమం