పంది అవయవాలు మనుషులకు!
వాషింగ్టన్: పంది అవయవాలను మనుషులకు అమర్చడం భవిష్యత్తులో సాధ్యం కావొచ్చు. ఈ దిశగా ఉన్న అతిపెద్ద అడ్డంకిని శాస్త్రవేత్తలు అధిగమించారు. వరాహ జన్యువులోని రిట్రోవైరస్లను క్రియారహితంగా మార్చడం ద్వారా వీటి అవయవాలు మనుషులకు సరిపడేలా చేయగలిగారు. ఈ రిట్రోవైరస్లు పందిలోని ప్రతి కణంలో ఉంటాయి... అయితే దానికి హాని చేయవు. మరో జీవి శరీరంలో ప్రవేశపెడితే మాత్రం రోగకారకాలవుతాయి. గతంలో అత్యధికంగా ఆరుచోట్ల మాత్రమే పంది జన్యువుల్లో మార్పులు జరగ్గా...
హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు... అత్యంత శక్తిమంతమైన జన్యు మార్పు ప్రకియ ద్వారా ఏకంగా 62 చోట్ల పంది జన్యువులో మార్పు చేయగలిగారు. ప్రమాదకరమైన రిట్రోవైరస్లను తొలగించడంలో సఫలమయ్యారు. తద్వారా పంది అవయవాలను మనిషికి అమర్చే దిశగా పెద్ద ముందడుగు పడింది.