ట్రాఫిక్ ఎఎస్సై వ్యవహారంపై ఏఎస్పీ విచారణ
కాటారం : కరీంనగర్ ట్రాఫిక్ ఎస్సై ఇంద్రసేనారెడ్డి, గ్రామస్తుల మధ్య జరిగిన గొడవపై కాటారం సర్కిల్ ఠాణాలో గోదావరి ఖని ఏఎస్పీ విష్టు వారియర్ మంగళవారం విచారణ జరిపారు. ప్రత్యక్ష సాక్షులు, గ్రామానికి చెందిన పలువురితోపాటు ఎస్సై ఇంద్రసేనారెడ్డి, వారి స్నేహితులు ఈ విచారణకు హాజరైనట్లు తెలిసింది. సంఘటన స్థలంలో జరిగిన పరిస్థితి, వాగ్వివాదానికి దారితీసిన తీరుపై ఇరువర్గాల నుంచి సమగ్రంగా వివరాలు సేకరించి నమోదు చేసుకున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏఎస్పీ విచారణ జరిపిట్లు తెలిసింది.