reveanth reddy
-
సర్దుకుపోదాం రండి!.. టీపీసీసీ నేతలతో దిగ్విజయ్ భేటీ
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్ నేతల అంతర్గత సమస్యలను పరిష్కరించేందుకు అధిష్టానం దూతగా సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్ వచ్చారు. బుధవారం రాత్రి 8:30 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్ కుమార్, పార్టీ ముఖ్య నేతలు హర్కర వేణుగోపాల్‌రావు, సంగిశెట్టి జగదీశ్ తదితరులు స్వాగతం పలికారు. దిగ్విజయ్ నేరుగా తాజ్ కృష్ణా హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆయన్ను కలిశారు. కాగా గురువారం ఉదయం 11 గంటల నుంచి గాంధీభవన్‌లో దిగ్విజయ్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో విడివిడిగా భేటీ కానున్నారు. పీసీసీ డెలిగేట్ల నియామకం నుంచి పీసీసీ కమిటీల ఏర్పాటు, రేవంత్ రెడ్డితో సీనియర్ల సమన్వయం, పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలకు గల కారణాలపై వారితో చర్చించనున్నారు. ఈ భేటీ అనంతరం నాలుగున్నర గంటల సమయంలో దిగ్విజయ్ మీడియాతో మాట్లాడనున్నట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే సమాచార సేకరణ తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితిపై దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరించారు. హైదరాబాద్ బయలుదేరడానికి ముందే ఢిల్లీలో ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శులు నదీమ్ జావెద్, బోసురాజుతో సమావేశమయ్యారు. పార్టీలో విభేదాలకు గల కారణాలపై ఆరా తీశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో సీనియర్లకు పొసగకపోవడానికి గల కారణాలు, పీసీసీ కమిటీపై సీనియర్ల అభ్యంతరాలు, వారి డిమాండ్లు అడిగి తెలుసుకున్నారు. పీసీసీలో రేవంత్ వర్గంగా ఉన్న నేతల వివరాలు, వారి రాజీనామాల అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. రేవంత్‌కు, సీనియర్ల మధ్య సమన్వయానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ చేసిన ప్రయత్నాల వివరాలను తీసుకున్నారు. అనంతరం పార్లమెంట్‌కు వెళ్లిన దిగ్విజయ్.. మాణిక్యం ఠాగూర్‌తోనూ సమావేశమై పార్టీలో విభేదాలపై చర్చించారు. ఆ తర్వాతే హైదరాబాద్ బయలుదేరారు. వాదనలకు సిద్ధం: దిగ్విజయ్ ముందు తమ వాదనలు వినిపించేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌లోని రెండు వర్గాలు సిద్ధమయ్యాయి. పార్టీ అభివృద్ధికి తాము కష్టపడిన తీరును, సీనియర్లతో సమన్వయం కోసం రేవంత్‌రెడ్డి చేసిన ప్రయత్నాలను వివరించేందుకు రేవంత్ వర్గం సిద్ధమైనట్లు తెలిసింది. మరోవైపు రేవంత్ ఏకపక్ష వైఖరి, మాణిక్యం ఠాగూర్ వ్యవహారశైలి, పీసీసీ పదవుల్లో పార్టీలోని పాతకాపులకు జరిగిన అన్యాయం, సీనియర్లను కోవర్టులుగా చిత్రీకరించేందుకు యత్నించడం, సోషల్‌మీడియాలో దుష్ప్రచారం తదితర అంశాలపై సీనియర్లు నివేదికలు సిద్ధం చేసుకున్నారు. ఇలావుండగా పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి గురువారం నాటి సమావేశానికి హాజరుకావడం లేదని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈనెల 29 నుంచి జూలై 3 వరకు ప్రజా సమస్యలపై నిరసనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం గాంధీభవన్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉత్తమ్ రాష్ట్రంలోని సమస్యలపై పార్టీ నేతలతో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఆర్.సి. కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సంపత్‌కుమార్, ఎంపీ రేవంత్‌రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, ఏఐసీసీ ట్రైనింగ్ సెల్ ఇన్చార్జి సచిన్ రావ్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డిలతో పాటు పలువురు డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఈనెల 28న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని కోరారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ఈనెల 29న జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈనెల 30న కరోనా వైరస్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో విలేకరుల సమావేశాలు నిర్వహించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో పెరిగిన కరెంటు బిల్లులను నిరసిస్తూ జూలై 3న నల్ల బ్యాడ్జీలతో జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ప్రధాన కార్యదర్శులు మహేష్‌కుమార్ గౌడ్, బొల్లు కిషన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌లతో కూడిన ఒక కమిటీని కూడా ఉత్తమ్ ప్రకటించారు. -
బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్
టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, ఎంపీ బాల్క సుమన్ సాక్షి, హైదరాబాద్: బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. హై దరాబాద్‌లోని తెలంగాణ భవన్లో గురువారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి ని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బతీయడానికి ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న కుట్ర లో రేవంత్ పావుగా మారాడన్నారు. మెట్రో పనులు ఆగవని, టీడీపీ చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ద్ధాలని నిరూపించడానికి బహిరంగచర్చకు రావాలని సవాల్ చేస్తే.. రేవంత్ తప్పించుకుని తిరుగుతున్నారన్నారు. 1995 నుండి ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై విచారణ జరుపుదామని జూపల్లి సవాల్ చేశారు. అసెంబ్లీలో వారి బండారం బయటపెడ్తామన్నారు. అత్యంత అవినీతిపరుడైన నేతగా చంద్రబాబు పేరును తెహెల్కా రాసిందని గుర్తుచేశారు.