reveneu division
-
ఉల్లంఘనలపై ఉక్కుపాదం
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ దాడులు కొనసాగుతున్నాయి. జనవరి 17 నుంచి ఇప్పటి వరకు 168కిపైగా అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. వాటిలో చాలా వరకు 600 గజాల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన బహుళ అంతస్తుల భవనాలు, గోదాములు వంటి భారీ నిర్మాణాలున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోని వివిధ మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు అధికారులు నాలుగు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన దాడుల్లో బడంగ్పేట్, శంకర్పల్లి మున్సిపాలిటీల్లో ఎక్కువ అక్రమాలు ఉన్నట్లు అధికారులు గు ర్తించారు. ఆ తర్వాత మేడ్చల్, పోచంపల్లిలో ఎక్కు వ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ‘కూల్చివేసిన చోట తిరిగి నిర్మాణాలు చేపట్టకుండా గట్టి నిఘాను ఏర్పా టు చేశాం. క్షేత్రస్థాయిలో అధికారుల బృందం ఎ ప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఎలాంటి ఉల్లంఘన లు చోటుచేసుకొన్నా గట్టి చర్యలు ఉంటాయి’.అని హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. భారీ నిర్మాణాలే ఎక్కువ... రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో సుమారు 927 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్క హెచ్ఎండీఏ పరిధిలోనే మొత్తం 459 వరకు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం 600 చదరపు గజాల నుంచి వెయ్యి చదరపు గజాల విస్తీర్ణంలో చేపట్టినవే. నిబంధనల మేరకు టీఎస్–బీపాస్ నుంచి నేరుగా అనుమతులు పొందే అవకాశం ఉన్నప్పటికీ చాలా మంది భవననిర్మాణ యజమానులు గ్రామపంచాయతీల నుంచి జీ+2 కోసం అనుమతులను పొంది అక్రమంగా 5 అంతస్తులు, అంతకంటే ఎక్కువ స్థాయిలో నిర్మాణాలు కొనసాగించారు. బడంగ్పేట్, శంకర్పల్లి, దుండిగల్లలో ఇలాంటి నిర్మాణాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు కూల్చివేసిన వాటిలో అనుమతులు లేనివి, ఆమోదించిన లే– అవుట్ కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించినవే ఎక్కువగా ఉన్నాయి. చాలా చోట్ల ప్రభుత్వ స్థలాలను, చెరువు భూములను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. కొనసాగుతున్న దాడులు... జిల్లా రెవిన్యూ అధికారులు, పోలీసు, మున్సిపల్ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ టీంలు హెచ్ఎండీఏ పర్యవేక్షణలో గత నెల 17 నుంచి దాడులు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 168 అక్రమాలను కూల్చివేశారు. రెండు రోజుల క్రితం జవహర్‌నగర్ పరిధిలో నాలుగు, చౌటుప్పల్ పరిధిలో మరో రెండింటిని కూల్చివేశారు. బండ్లగూడ జాగీర్, ఘట్కేసర్, బోడుప్పల్, దమ్మాయిగూడ, మణికొండ, నిజాంపేట్, తదితర ప్రాంతాల్లో అక్రమాలపై హెచ్ఎండీఏ కొరడా ఝళిపించింది. దాడులను మరింత ఉద్ధృతం చేయనున్నట్లు హెచ్ఎండీఏ అధికారి చెప్పారు. -
లైన్ క్లియర్..!
కోరుట్ల: ఐదేళ్లుగా ఉధృతంగా సాగిన ఉద్యమం..అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన హామీ దరిమిలా కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ అయింది. గత నెల 7న కోరుట్ల రెవెన్యూ డివిజన్‌పై డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌తో పాటు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరుతూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. అభ్యంతరాలకు నెల రోజుల గడువు..అంటే సరిగ్గా ఈనెల 9 వ తేదీ చివరి రోజుగా నిర్ణయించారు. కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఇప్పటికీ పెద్దగా అభ్యంతరాలు లేనట్లుగా సమాచారం. ఈక్రమంలో మరో 4 రోజుల్లో కోరుట్ల రెవెన్యూ డివిజన్ కల సాకారం కానుంది. అప్పుడు..అంచనా తప్పింది కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోసం సుమారు ఐదేళ్లుగా ప్రజలు వివిధ రకాలుగా ఉద్యమం కొనసాగించారు. రెండున్నరేళ్లకు ముందు టీఆర్ఎస్ సర్కార్ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమైన సమయంలో సుమారు 3 నెలల పాటు కోరుట్ల డివిజన్ ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. సుమారు 17 దరఖాస్తులు కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోసం సర్కార్‌కు పంపినా ఫలితం దక్కలేదు. చివరి నిమిషం వరకు ఊరించి చివరకు మెట్‌పల్లిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించారు. మెట్పల్లి డివిజన్ పరిధిలో కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, మేడిపల్లి మండలాలను చేర్చారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై అంచనాలు తలకిందులు కావడంతో ఆ సమయంలో స్థానికులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఉద్యమం మరికొన్నాళ్లు సాగినా నిరుత్సాహం వెంటాడింది. ఎన్నికల సాక్షిగా.. రెండున్నరేళ్ల తర్వాత టీఆర్ఎస్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. ఈ సమయంలో కోరుట్ల సెగ్మెంట్లో కోరుట్ల పట్టణ ఓటర్లు కీలకంగా మారారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై హామీ ఇచ్చారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు రోజులు ఉన్నాయనగా కోరుట్లలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మరోసారి అప్పటి మంత్రి కేటీఆర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఖాయమని ప్రకటించారు. ఈ విషయంలో ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవచూపడంతో డివిజన్ ఏర్పాటుపై ఎన్నికల సమయంలో గట్టి హామీ దొరికింది. కీలక నేతల నుంచి హామీ రావడంతో కోరుట్ల స్థానికుల్లో టీఆర్ఎస్పై ఉన్న అసంతృప్తి చాలా మేర సమసిపోయింది. తర్వాత కోరుట్ల ఎమ్మెల్యేగా విద్యాసాగర్‌రావు గెలవడంతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కోరుట్ల డివిజన్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఫిబ్రవరి 7న కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాలు, సూచనల కోసం సర్కార్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యంతరాలు అంతంతే.. కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాలు సూచనలకు 30రోజుల గడువు ఇవ్వగా, ఇప్పటికి 26 రోజులు గడిచాయి. మరో నాలుగురోజుల సమయం ఉంది. కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి మండలాలతో కూడిన కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఇప్పటి వరకు పెద్దగా అభ్యంతరాలు రానట్లు సమాచారం. చిన్నపాటి మార్పులకు చెందిన సలహాలు ఉన్నా పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కాకపోవడం గమనార్హం. ఈక్రమంలో మరో 4రోజులు గడిచిన తర్వాత కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై అభ్యంతరాల గడువు ముగిసిపోనుంది. కార్యాలయాలు ఎక్కడో.. కోరుట్ల రెవెన్యూ డివిజన్‌కు చెందిన కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఊరికి దూరంగా ఆదర్శనగర్‌లో ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని పట్టణంలోకి తరలించిన తర్వాత ఆ భవనంలో డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోరుట్ల పోలీస్ సబ్ డివిజన్ ఉంటుందా లేదా అన్న విషయంలో పూర్తి స్పష్టత లేదు. గతంలో పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయం పెద్దగుండు వద్ద ఉన్న ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. సబ్ డివిజన్ ఏర్పాటుతో ఇతరత్రా సబ్ డివిజనల్ కార్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి. కోరుట్ల కోట బురుజులు -
రెవెన్యూ డివిజన్ సాధనకు ఉద్యమం ఉధృతం
కల్వకుర్తి రూరల్ : అన్ని అర్హతలుండి ప్రభుత్వ నివేదికలో సైతం స్థానం కల్పించిన కల్వకుర్తికి రెవెన్యూ డివిజన్ మంజూరు చేసే వరకు ఉద్యమం ఉధృత్తం చేస్తామని అఖిలపక్షం నేతలు ప్రకటించారు. పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ శ్రీశైలంలు మాట్లాడుతూ భవిష్యత్తు తరాల బాగు కోసం రెవెన్యూ డివిజన్ తప్పనిసరన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం డివిజన్ సాధించేందుకు కలిసికట్టుగా ఉద్యమిద్దామన్నారు. కడ్తాలను మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజలందరూ ఐక్యమత్యంగా కలిసిమెలిసి ఉద్యమాన్ని ముం దుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. స్వచ్ఛందంగా ప్రజలు ఉద్యమంలో భాగస్వామ్యులవుతున్నారని వెల్లడించారు. నగర పంచాయతీ, జిల్లెల, జంగారెడ్డిపల్లితో పాటు కల్వకుర్తి మండల ప్రజాపరిషత్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మా నం చేయడం పట్ల హర్షం ప్రకటించారు. అన్ని మండలాలు, గ్రామాలు తీర్మానాలు చేయాలని కోరారు. ఉద్యమంలో భాగంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రులను, సీసీఎల్ఏ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందిస్తామని తెలిపారు నియోజకవర్గాన్ని విడదీÄñæ¬ద్దు కల్వకుర్తికి రెవెన్యూ డివిజన్ మంజూరు చేయడంతో పాటు ఐదు మండలాలను నియోజకవర్గం నుంచి విడదీÄñæ¬ద్దన్నారు. మూడు మండలాలను ఇతర జిల్లాల్లో కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని అది మంచి పద్ధతి కాదని, నియోజకవర్గం మొత్తాన్ని ఒకే చోట ఉంచాలని, అది ఎక్కడైనా సరే అని అఖిలపక్షం నేతలు కోరారు. సమావేశంలో జేఏసీ కన్వీనర్ సదానందం, నగర పంచాయతీ వైస్ చైర్మన్ షాహేద్, నాయకులు మిర్యాల శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మ సురేందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, జగన్, దుర్గాప్రసాద్, రాఘవేందర్‌గౌడ్, శ్రీధర్, సూరి, నర్సింహ, పాండుయాదవ్‌లు పాల్గొన్నారు.